డిప్యూటీ కాగ్ జనరల్ గా నంద కిషోర్
న్యూఢిల్లీ: సీనియర్ ప్రభుత్వాధికారి నంద కిషోర్ డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గా బుధవారం నియమితులయ్యారు. 1981లో ఇండియన్ అడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అధికారిగా ఎంపికైన నంద కిషోర్ ప్రస్తుతం అదనపు డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తిసున్నారు. ఆగస్టు 31న బల్వేందర్ సింగ్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో నంద కిషోర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కేబినెట్ నియామకాల కమిటీ నంద కిషోర్‌ను డిప్యూటీ కాగ్ జనరల్ గా ఎంపికచేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ఇప్పటికే జాతీయ సంస్థ న్యాయ పునర్విచారణ ట్రిబ్యునల్ టెక్నినల్ మెంబర్ గా బల్వేందర్ సింగ్ నియమించిన సంగతి విదితమే.