Balwinder Sandhu
-
కపిల్‌లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు!
Balwinder Sandhu: ‘‘కపిల్‌లా బ్యాటింగ్ చేయండి.. కపిల్‌లా ఫీల్డింగ్ చేయండి. కపిల్‌లా కెప్టెన్సీ చేయండి. అప్పుడే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్... 2023లో వన్డే ప్రపంచకప్ గెలవగలం’’- వరుస ఐసీసీ టోర్నీల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సహా భారత ఆటగాళ్లను ఉద్దేశించి 1983 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా సభ్యుడు బల్వీందర్ సంధు చేసిన వ్యాఖ్యలు ఇవి. అన్ని విభాగాల్లో రాణిస్తేనే ఐసీసీ టైటిల్ గెలుస్తారని.. అందుకోసం అలుపెరుగక కృషి చేయాలని సూచించారు. కాగా భారత్‌కు మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన దిగ్గజ సారథి కపిల్ దేవ్ జీవితం ఆధారంగా.. 1983 వరల్డ్ కప్ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్లో 83 మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. డిసెంబరు 24న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ వీక్షించిన సందర్భంగా జీ న్యూస్‌తో ముచ్చటించిన సంధు.. భారత జట్టును ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక కపిల్ దేవ్ మాట్లాడుతూ... ‘‘అప్పట్లో మాకు సోషల్ మీడియా లేదు. క్రీడాస్ఫూర్తిలో వివాదాలు కొట్టుకోపోయేవి. ప్రతి ఒక్కరు ఆటపై దృష్టి పెట్టి... కెరీర్లో ముందుకు వెళ్లేవారు. అయితే, చరిత్ర సృష్టించేవాళ్లు కూడా కావాలి కదా. ఆ చరిత్రను చెప్పేవాళ్లు కూడా కావాలి. ఆ మధుర జ్ఞాపకాలను వెండితెర మీద చూడటం సంతోషంగా ఉంది’’ అని ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. విమర్శలకు కృంగిపోతే ఏమీ సాధించలేమని.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు దరిచేరతాయని యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపారు. నాడు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు బలమైన విండీస్‌ను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్ IPL 2022- SRH: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ -
‘శౌర్యచక్ర’ బల్వీందర్ హత్య
అమృతసర్/చండీగఢ్: పంజాబ్‌లో తీవ్రవాదం అంతానికి పోరాడిన, శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్వీందర్ సింగ్ సంధూ దుండగుల కాల్పుల్లో చనిపోయారు. ఆయనకు కల్పించిన భద్రతను ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లా బిఖివిండ్ పట్టణంలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తన కార్యాలయంలో ఉన్న బల్వీందర్ సింగ్ సంధూపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన చనిపోయారు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని, తీవ్రవాదుల ఘాతుకమే ఇదని సంధూ భార్య జగదీశ్ కౌర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తమపై 62 దాడులు జరిగాయని, తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని, భద్రత కల్పించాలని డీజీపీని పలుమార్లు అభ్యర్థించామని, అయినా వారు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. సంధూ మృతికి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సంధూపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని అంతమొందించేందుకు బల్వీందర్ సింగ్ అలుపెరగని పోరాటం చేశారు. -
కోచ్ రేసులో ప్రసాద్, సంధు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిపై మాజీ బౌలర్లు వెంకటేశ్ ప్రసాద్, బల్విందర్ సంధు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు కోచ్ పదవికి బుధవారం దరఖాస్తు చేసినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం వెంకటేశ్ ప్రసాద్ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 2007లో ధోని సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచిన సమయంలో టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు. 1983లో ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంధు... ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో పాటు, మహారాష్ట్ర, బరోడా రాష్ట్ర జట్లకు కోచ్‌గా పనిచేశారు. ఈ నెల 10వరకు దరఖాస్తులకు గడువు ఉంది.