Banana market
-
మన ఫలం..ఎడారికి పయనం
రైతు సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతోపాటు రైతులు పండించిన పంట దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. కడప అగ్రికల్చర్: జిల్లాలో సాగు చేస్తున్న అరటికి గిట్టుబాటు ధర లభించేలా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు అరటిని తరలిస్తున్నారు. పులివెందులలో అరటి ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే వైఎస్సార్ జిల్లాతోపాటు పక్కనున్న అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో పండించే అరటిని సైతం ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. పులివెందుల నియోజక వర్గం నుంచే పులివెందుల, వేముల, వేంపల్లి, సింహాద్రిపురం ప్రాంతాలలో గ్రాండ్ –9 రకానికి చెందిన అరటిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ రకం అధిక దిగుబడి రావడంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉండి ఎగుమతులకు అనుకూలంగా ఉంటుందని పలువురు రైతులు తెలిపారు. పులివెందుల ప్రాంతంలో సాగు చేసే ఈ రకాన్ని గత మూడేళ్ల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా ఎగుమతి చేసే అరటికి స్థానిక మార్కెట్ ధరకంటే కొంతమేర రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. స్థానిక మార్కెట్‌కు అరటిని తరలించాలంటే అందుకు తగ్గ ఖర్చులన్నీ రైతులే భరించాల్సి ఉంటుంది. ఇదే అరటిని ఇతర దేశాలకు ఎగుమతికి అనుమతి వస్తే పంట దిగుబడికి మూడు నెలల ముందు నుంచే కంపెనీ ప్రతినిధులు పంటను పర్యవేక్షించుకుంటూ.. పరిరక్షించుకుంటారు. పంట దిగుబడి వచ్చే వరకు అయ్యే ఖర్చులన్నీ వారే భరిస్తారు. ముమ్మరంగా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ పనులు పులివెందుల, వేంపల్లి, వేముల, సింహాద్రిపురం మండలాలతోపాటు జిల్లాలో ఇంకా పలు మండలాల్లో అధికంగా పండించే అరటిని స్టాకు పెట్టుకుని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునేందుకు వీలుగా 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ పనులను పులివెందులలో చేపట్టారు. 125 మెట్రిక్ టన్నుల కెపాసిటీతోపాటు 600 మెట్రిక్ టన్నుల కోల్డ్‌స్టోరేజ్ కెపాసిటీతో ఈ పనులను ప్రారంభించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. మూడేళ్ల నుంచి ఎగుమతులు పులివెందుల ప్రాంతంలో పండించిన గ్రాండ్–9 అరటి రకాన్ని గత మూడేళ్ల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇందులో 2018–19 ఏడాదికి సంబంధించి 25 మెట్రిక్ టన్నులను, 2020–21 సంవత్సరానికి సంబంధించి 2177 మెట్రిక్ టన్నులను, 2021–22 సంవత్సరానికి సంబంధించి 983 మెట్రిక్ టన్నులను ఎగుమతి చేశారు. ఈ ఎగుమతి చేసిన అరటి పండ్లను సింగపూర్, దుబాయ్, ఇరాన్, ఇరాక్ దేశాలకు కంటైనర్ల ద్వారా తరలించినట్లు స్థానిక ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. గతంలో అనంతపురం నుంచి మాత్రమే అరటిని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం పులివెందుల ప్రాంతం నుంచి కూడా అరటిని ఇతర రాష్ట్రాలతోపాటు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అరటి రైతుకు భరోసా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌తోపాటు కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి రానుండటం వల్ల అరటి రైతులకు మరింత భరోసా వచ్చింది. ఎగుమతులకు అనుగుణంగా అర టిని సిద్ధం చేసుకుని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పంపించుకునే వెసులుబాటు లభిస్తుంది. – కొమ్మా రాంమల్లేశ్వరెడ్డి, అరటి రైతు, పులివెందుల టన్ను రూ. 16 వేలకు అమ్ముకున్నా నేను 13 ఎకరాల్లో అరటిని సాగు చేశాను. ఇందులో 30 టన్నులను టన్ను రూ. 13 వేలతో నవంబర్, డిసెంబర్ నెలలో లోకల్ మార్కెట్లో అమ్ముకున్నాను. తరువాత ఫిబ్రవరి, మార్చిలో మరో 46 టన్నులను టన్ను రూ. 16 వేలకు పైగా రేటుతో ఎక్స్‌పోర్టుకు అమ్మాను. దీంతో మంచి డబ్బులు వచ్చాయి. – భాస్కర్‌రెడ్డి, అరటిరైతు, నల్లపురెడ్డిపల్లె రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది పులివెందులలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ హౌస్‌తోపాటు కోల్డ్ స్టోరేజీతో అరటి రైతుకు మేలు చేకూరనుంది. జిల్లాలో పండిన అరటిని స్టాక్ పెట్టుకోవడంతోపాటు ప్యాకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇతర ప్రాంతాలకు ఎక్స్‌పోర్టు చేసుకునే వీలవుతుంది. – వెంకటేశ్వరరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, ఉద్యానశాఖ -
అన్నన్నా.. బనానా!
బాగా తగ్గిన అరటి ఎగుమతులు, ధరలు రావులపాలెం : పెద్దనోట్ల రద్దు ప్రభావం రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో ఎగుమతులపై పడింది. చలామణికి అవసరమైన చిల్లర నోట్ల అందుబాటులో లేకపోడంతో వ్యాపారులు పాతనోట్లతోనే కొనుగోళ్లు సాగిస్తుండటంతో సుమారు 25 శాతం ఎగుమతులు తగ్గాయి. సాధారణంగా ప్రతిరోజూ సుమారు 25 లారీల వివిధ రకాల అరటి గెలలను ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేశారు. తద్వారా రూ.20 నుంచి రూ.25 లక్షల వ్యాపారం జరిగేది. అయితే ప్రస్తుతం 15 నుంచి 18 లారీల సరుకు ఎగుమతవుతోంది. తద్వారా రూ.10 నుంచి రూ.15 లక్షల వ్యాపారం జరుగుతున్నట్టు మార్కెట్ వర్గాల అంచనా. ధరలు కూడా గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. వరిచేలల్లో కోతలు ప్రారంభం కావడంతో రైతులు అరటి గెలల కోతలపై దృష్టి పెట్టకపోవడంతో మార్కెట్‌కు వచ్చే గెలల సంఖ్య కొంత మేర తగ్గింది. అలాగే అరటి చేలల్లో కూడా 75 శాతం కోతలు పూర్తి కావడంతో దిగుబడి తగ్గింది. వీటితోపాటు తాజాగా రూ.500, వెయ్యి నోట్ల రద్దు చేయడం కూడా ధరలు, ఎగుమతులపై ప్రభావం చూపింది. ఒక లోడు(అరుగెలలు) అమ్మితే వచ్చే మొత్తంలో రైతుకు అధిక శాతం పాత వెయ్యి, రూ. 500 నోట్లను కొంత చిల్లర నోట్లను వ్యాపారులు ఇస్తున్నారు. పాతనోట్లను తీసుకోవడం ఇబ్బందైనా తప్పని పరిస్థితుల్లో రైతులు తీసుకుని బ్యాంకుల్లో మార్చుకొంటున్నారు. అయితే ప్యాకింగ్, లోడింగ్ కూలీలకు కూలిగా కూడా రూ.500 నోట్లను ఇస్తుండడంతో వాటిని మార్చుకోవడానికి రూ.50 వరకూ తాము కోల్పోవాల్సి వస్తోందని వారు అంటున్నారు. రూ. 50 కోల్పోతున్నాం కూలీగా ఇస్తున్న నోట్లలో రూ.500 నోటు మార్చుకోవాలంటే రూ.50 కోల్పోవాల్సివస్తోంది. వ్యాపారులు కొత్త నోట్లు వచ్చేంత వరకూ పాత నోట్లనే తీసుకోక తప్పదని గెలల కొనుగోళ్లకు రైతులకు అవే ఇస్తున్నామని చెబుతున్నారు. – గంధం నాగేశ్వరరావు, ప్యాకింగ్ కూలీ, కొమరాజులంక. పాత నోట్లతోనే అమ్మకాలు, కొనుగోళ్లు నోట్ల రద్దు తర్వాత సరిపడ కొత్త నోట్ల రాకపోవడంతో మార్కెట్ యార్డులో అధిక శాతం పాతనోట్లతోనే అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులు ఇచ్చిన పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకొంటున్నాం. పరిచయాలతో పాత నోట్లనే ఇచ్చిపుచ్చుకుంటున్నారు. – నడింపల్లి పెద్దిరాజు, రైతు, వెదిరేశ్వరం ధరలలో వ్యత్యాలు నోట్ల రద్దుకు ముందు ప్రస్తుతం రకం(గెల రూ.ల్లో) కనిష్ట గరిష్ట కనిష్ట గరిష్ట కర్పూర 150 500 100 250 చెక్కరకేళీ(తెలుపు) 125 400 100 350 బుషావళి 100 350 100 250 బొంత(కూరఅరటి) 150 300 100 250 అమృతపాణి 200 600 100 300 చెక్కరకేళీ(ఎరుపు) 150 350 100 300 -
రాజమండ్రి అరటి మార్కెట్‌పై చిల్లర ప్రభావం
-
అరటిపండుతోంది!
అ‘ధర’హో = చాగంటిపాడులో సొంత మార్కెట్‌కు రైతుల శ్రీకారం = గిట్టుబాటు ధరే లక్ష్యం లాభాలతో ఆనందం చాగంటిపాడు అరటి మార్కెట్ రైతులకు లాభాల పంట పండిస్తోంది. స్వయంగా రైతులే ఏర్పాటుచేసుకున్న ఈ మార్కెట్లో న్యాయబద్ధమైన ధర లభిస్తోంది. మార్కెట్ మాయాజాలం, అడ్డూఅదుపూ లేని కమీషన్ల భారం, తడిసిమోపెడవుతున్న రవాణాఖర్చుల బారినుంచి వారిని అరటి మార్కెట్ ఆదుకుంటోంది. వారు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభిస్తుండడంతో అరటి రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తోట్లవల్లూరు, న్యూస్‌లైన్ : వాణిజ్య పంటల్లో ప్రధానమైన అరటిని లంక, మెట్ట భూముల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. తోట్లవల్లూరు, వల్లూరుపాలెం, రొయ్యూరు, భద్రిరాజుపాలెం, చాగంటిపా డు, కళ్లంవారిపాలెం, దేవరపల్లి, పొట్టిదిబ్బలంక ప్రాంతాల్లో అరటి సాగవుతోంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం 700 నుంచి 800 ఎకరాల్లో అరటిని పండిస్తున్నారు. మద్దతు ధర కోసం.. అరటి రైతులు మార్కెట్ మాయాజాలానికి బలవుతున్నారు. ఓ వైపు సాగు ఖర్చులు, ప్రకృతి విపత్తుల కారణంగా ఎదురయ్యే నష్టాలతో అల్లాడుతున్న రైతులకు మార్కెట్లో లభించే ధర గిట్టుబాటు కావడం లేదు. వచ్చే అరకొర ధరలో కమీషన్, రవాణా ఖర్చులు పోగా మిగిలేది అంతంతమాత్రమే. దీన్నుంచి బయటపడేందుకు చాగంటిపాడు రైతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాబార్డు సహకారంతో గ్రామంలోని ఔత్సాహిక రైతులు రైతుక్లబ్‌గా ఏర్పడి రెండు నెలల కిందట అరటి మార్కెట్‌ను ప్రారంభించారు. వారి పంటకు వారే ధర నిర్ణయించుకోవడం విశేషం. ముమ్మరంగా కొనుగోళ్లు.. రైతుల ఆధ్వర్యంలో ప్రారంభమైన మార్కెట్లో అరటి కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తోట్లవల్లూరు, భద్రిరాజుపాలెం, దేవరపల్లి, కళ్లంవారిపాలెం, వల్లూరుపాలెం, ఐలూరు, ఐనపూరు, పెనమకూరు గ్రామాల రైతులు పం టను మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ప్రతి సోమ, గురువారం వేలంపాటలు నిర్వహిస్తున్నారు. వారానికి సగటున 1800కు పైగా గెలలు వస్తున్నాయి. చల్లపల్లి, అవనిగడ్డ, నూజివీడు, ఆగిరిపల్లి, ఉయ్యూరు, కంకిపాడు, పామర్రు, గుంటూరు జిల్లా నుంచి వ్యాపారులు అరటి కొనుగోలు కోసం వస్తున్నారు. రవాణావ్యయం, కమీషన్ ఖర్చులు తగ్గడంతో కనీస మద్దతు ధర లభిస్తోంది. ఒక్కో గెలకు రూ. 15 నుంచి రూ. 20 వరకు బయటి మార్కెట్ల కంటే అదనంగా నగదు లభిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ధర కోసమే.. వ్యాపారుల మాయాజాలం కారణంగా అరటికి బయట మార్కెట్లలో సరైన ధర లభించడం లేదు. రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో మార్కెట్‌ను ప్రారంభించాం. రైతులు, వ్యాపారుల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. - కొల్లి కేశవచంద్రమోహనరెడ్డి, చీఫ్ కోఆర్డినేటర్, రైతుక్లబ్, చాగంటిపాడు ఎంతో ఉపయుక్తం.. చాగంటిపాడులో అరటి మార్కెట్ ఏర్పాటుచేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది. వ్యాపారుల మోసాల నుంచి రైతులను రక్షించడంతోపాటు రవాణా వ్యయం బాగా కలిసివస్తోంది. దీంతో కొంతవరకు మెరుగైన ధర లభిస్తోంది. మార్కెట్ ఏర్పాటులో రైతుక్లబ్ తీసుకున్న చొరవ అభినందనీయం. - కలకోట వెంకటరామిరెడ్డి, రైతు, చాగంటిపాడు