Bandh Continue
-
బంద్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారుల బంద్ కొనసాగుతోంది. మద్యం వ్యాపారులు చేస్తున్న సమ్మెతో రెండు కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పండింది. ఈ నిరవధిక సమ్మెతో జిల్లా వ్యాప్తంగా 241 మద్యం దుకాణాలు, 34 బార్లు మూత పడ్డాయి. ట్రేడ్ మార్జిన్‌ను పెంచాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్‌కు రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసినప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మద్యం వ్యాపారులు బంద్ వైపే మొగ్గు చూపారు. ఈనెల 27 నుంచి మార్జిన్ మనీ 7 నుంచి 24 శాతానికి పెంచాలని బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. -
కర్నూలులో కొనసాగుతున్న బంద్
కర్నూలు: విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ రాజధాని సాధన సమితి నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. దాంతో నగరంలోని విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో కర్నూలు నగరంలో జనజీవనం స్తంభించింది. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్ చేస్తుంది. గతంలో ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేదని ఈ సందర్భంగా ఆ సమితి గుర్తు చేసింది. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్‌కు తరలిపోయిందని.... రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని మళ్లీ కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ రాజధాని సాధన సమితి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కానీ ఆ ప్రభుత్వం మాత్రం విజయవాడ - గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ రాజధాని సాధన సమితి బంద్‌కు పిలుపు నిచ్చింది.