bangaraiah
-
ఈరోజు లక్ష్మి అమ్మవారిని ఇలా పూజిస్తే..!
-
ఉద్యోగం పోయింది ఓటమి మిగిలింది.. టీడీపీ అభ్యర్థి
విశాఖపట్నం , నక్కపల్లి/పాయకరావుపేట: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకు ఆదివారం పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. పరవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పరిశీలకునిగా నిర్వహించిన ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, లాలంకాశీనాయుడు, నల్లపురాజు వెంకటరాజు, మరో సీనియర్ నాయకుడు కొప్పిశెట్టి వెంకటేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్లతో పాటు ఇతర ముఖ్యనాయకులు ముఖం చాటేశారు. ఒకరిద్దరు నాయకుల మినహా నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. జాతీయ రహదారి పక్కన పీఎల్‌పురం సమీపంలోని ద్వారకా హోటల్లో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ సమావేశానికి పట్టుమని 100 మంది కూడా రాకపోవడంతో సమావేశం బోసిపోయింది. చోటామోటా నాయకులతోనే ఈ సమావేశాన్ని మమ అనిపించారు. పార్టీ ముఖ్యనాయకులు చెబుతున్నట్లుగా ఈ ఎన్నికల్లో టీడీపి ఓటమికి ఈవీఎంలు కారణం కాదని, పార్టీలో ఐకమత్యం లేకపోవడమేనని ఎస్‌రాయవరం మండలానికి చెందిన తుంపాల నాగేశ్వరరావు అనే నాయకుడు సభలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయింది. మనలో లోపాలను ఈవీఎంలపై నెట్టడం సరికాదని నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరం. ఉద్యోగం పోయింది... ఓటమి మిగిలింది... ఈ సమావేశంలో అభ్యర్థి బంగారయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఎమ్మెల్యే అవుదామన్న ఆశతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. పాయకరావుపేట టీడీపీకి కంచుకోట అని భావించానని విజయం తథ్యమని ఆశపడ్డానన్నారు. ఉన్న ఉద్యోగం పోయి.. ఆశలు ఆవిరయ్యాయని. ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతానని, కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. -
ఆధిపత్య భాషల వెన్నుపోటుకి బలైన తెలుగు
‘తెలుగువారికి సొంత భాష లేదు. తెలుగు నేలమీద చెలామణిలో వున్న సాహిత్యం తెలుగు కాదు. అది సంస్కృత పురాణేతిహాసాలకు అనువాదమే. లేదా వాటికి అనుకరణే. తెలుగు భాషలో మౌలికమైన రచయితలూ కవులూ లేరు. వెయ్యేళ్ళుగా కవులుగా గుర్తింపు గౌరవం పొందుతున్న కవులెవరూ కవులు కారు. మనకున్నది అనువాదకులూ అనుకర్తలు మాత్రమే. నిజానికి మనం రాసే భాషే తెలుగు కాదు. సంస్కృతం ప్రాకృతం ఉర్దూ ఇంగ్లీషు భాషల ప్రభావానికి లోనై అది సహజత్వాన్ని కోల్పోయింది. అందుకే మన భాషలో డెబ్బై శాతం పరాయి భాషా పదాలే కనిపిస్తాయి.పరాయి భాషా పదాల్ని వాడీ వాడీ చివరికి తెలుగు మాటల్ని మరిచిపోయాం అందువల్ల యెంతో భాషా సంపదని కోల్పోయాం, సొంత సంస్కృతికి దూరమయ్యాం’. అరవై యేళ్లకి పూర్వం యెంతో ఆవేదనతో యీ అభిప్రాయాలు వ్యక్తం చేసి తెలుగు భాష దుస్థితికి కారణాలు అన్వేషించిన భాషా శాస్త్రవేత్త బంగారయ్య. చావు బతుకుల్లో ఉన్న భాషల జాబితాలో చేరడానికి తెలుగు సిద్ధంగా ఉందని భాషా వేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు గానీ ఈ వినాశనానికి బీజాలు వేసినవాడు వాగనుశాసన బిరుదాంకితుడు నన్నయేనని కుండ బద్దలు కొట్టినవాడు బంగారయ్య. వాడుకలో వున్న తెలుగును కాదని భారతానువాదాన్ని డుమువులు చేర్చిన సంస్కృత పదాలతో నింపి పెట్టిన నన్నయ ఆదికవి కాదు తొలి వెన్నుపోటుగాడని ఆయన తీర్మానించాడు. గాసట బీసటగా వున్న తెలుగుని నన్నయ ఉద్ధరించాడు అని చెబుతారుగానీ నిజానికి సంస్కృతంతో కలగాపులగం చేసి భాషని భ్రష్టు పట్టించాడనీ వందల యేళ్ళు అదే కొనసాగిందనీ మనవి కాని ఇతివృత్తాల్నీ మనవి కాని ఛందో రీతుల్నీ స్వీకరించడం వల్ల పరాయి భాషకి దాస్యం చేయడం వల్ల తెలుగు జాతి ఉనికే ప్రశ్నార్థకమైందనీ భాషమీద అలవికాని ప్రేమతో తెలుగు నానుడి కూటమి స్థాపించి తెలుగా ఆంధ్రమా?, నుడి–నానుడి వంటి గ్రంథాల ద్వారా ప్రచారం చేసిన బంగారయ్య అసలు పేరు సత్యానందం. సొంత పేరులో సంస్కృతం ఉందని బంగారయ్యగా మారాడు. ‘కాలా’ సినిమాలో పా. రంజిత్ ప్రతిపాదించిన వర్ణ సిద్ధాంతాన్ని అప్పుడే (1965) ‘నలుపుచేసిన నేరమేమిటి?’ అన్న గ్రంథం ద్వారా ప్రచారం చేశాడు. చనిపోడానికి (1992) కొద్ది కాలం ముందు దళిత అస్తిత్వానికి సంబంధించి అనేక మౌలికమైన ఆలోచనల్ని (chduled castes stabbed, Schduled castes: search for Identity) గ్రంథ రూపంలో ప్రకటించాడు. ఇన్ని చేసీ అనామకంగా అజ్ఞాతంగా ఉండిపోయిన భాషా తాత్వికుడు బంగారయ్య. బంగారయ్య గొప్ప విద్యావేత్త. ప్రజా సమూహాల ఉచ్చారణని ప్రామాణికంగా తీసుకొని సంస్కృ త వర్ణాలు వదిలేస్తే తెలుగు అక్షరమాల సగానికి సగం తగ్గి అమ్మ నుడి నేర్చుకునే పసి పిల్లల మీద భారం తగ్గుతుందని భావించాడు. అందుకు అనుగుణంగా వ్యాకరణం, నుడిగంటులు (నిఘంటువులు) నిర్మించుకొనే పద్ధతులు బోధించాడు. పిల్లలకు వాచక పుస్తకాలు ఎలా ఉండాలో నిర్దేశించాడు. భిన్న ప్రాంతాల మాండలికాలని కలుపుకుంటూ పోయినప్పుడే భాష పెంపొందుతుందని గ్రహించాడు. అరువు తెచ్చుకోకుండా అవసరానుగుణంగా కొత్త పదబంధాలను సొంత భాషలోనే నిర్మించుకోవచ్చని స్వయంగా ఎన్నో పదాల్ని పుట్టించి నిరూపించాడు. వస్తు రూపాల్లో తెలుగుదనం చిప్పిల్లే మూల రచనల కోసం పరితపించాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆజీవితం కృషి చేశాడు. కానీ ఆధిపత్య కులాల వర్గాల భాషా రాజకీయాల కారణంగా ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదు. అయితే బంగారయ్య తెలుగు భాష పెంపుదల గురించి రచించిన గ్రంథాల్ని, చేసిన సూచనల్ని జయధీర్ తిరుమలరావు ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికా ముఖంగా ప్రకటించడంతో భాషోద్యమకారుల్లో చలనం వచ్చింది. స.వెం. రమేశ్ వంటి రచయితలు అచ్చమైన తెలుగులో కథలు రాసి (కతల గంప) యితర భాషా పదాలు లేకుండా పాపులర్ రచనలకు పాఠకుల మన్నన పొందవచ్చని నిరూపించాడు. హోసూరు మొరసునాడు మొ‘‘ ప్రాంతాల యువ రచయితలు దాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ బంగారయ్య నిరసించిన పరభాషా దాస్యం ఇప్పుడు చుక్కలనంటింది. పాలకులు ఒంట బట్టించుకున్న రాజకీయ ఆర్ధిక బానిసత్వం భాషకు సోకింది. ఒకప్పుడు సంస్కృతానికి తలవొగ్గాం, ఇప్పుడు ఇంగ్లిష్‌కి ఊడిగం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో ఏలికల చలవ వల్ల తెలుగు మీడియం స్కూళ్ళు మూతబడుతున్నాయి. తెలుగు మాధ్యమంలో బోధనకి కాలం చెల్లిందని చెప్పి ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుని ఒక సబ్జెక్టుగా కుదించేసి భాషని ఉద్ధరిస్తున్నామని పాలకులు బుకాయిస్తున్నారు. తెలుగులో చదివితే పనికి రాకుండా పోతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాల పోటీలో నిలవాలంటే ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని ఊదరగొడుతున్నారు. తల్లిభాషను కాపాడుకోవాల్సిన ఇటువంటి తరుణంలో ‘వాగరి’ బంగారయ్య ప్రతిపాదించిన భాషా వాదాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మ నుడిని నానుడిని రక్షించుకోలేని జాతికి మనుగడ లేదు. ప్రతులకు: అన్ని పుస్తక దుకాణాల్లో లభ్యం (నేడు హైదరాబాదులో ఇందిరాపార్కు సమీపంలోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ సమావేశ మందిరంలో బంగారయ్య రచించిన నుడి–నానుడి గ్రంథావిష్కరణ) ఎ.కె. ప్రభాకర్ ‘ మొబైల్ : 76800 55766 -
మహిళ దారుణ హత్య
నందిపాడ్ (మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్: నందిపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అదే ఇంట్లో ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో ఇంట్లో సీలింగు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు భార్యాభర్త మృతిచెందడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరేడుచర్ల మండలం రామాపురానికి చెందిన ఆవుల బంగారయ్య(25), తిరుపతమ్మ(22)లకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రి తం నందిపాడు గ్రామానికి వచ్చి గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బంగారయ్య తల్లి గురువమ్మ అదే గ్రామంలో వేరేచోట గుడిసె వేసుకుని నివాసముం టోంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు కుమారుడి ఇంట్లో గడిపిన గురవమ్మ ఆ తర్వాత తన ఇంటికి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున ఆమె కుమారుడి ఇంటికి రాగా తలుపు బయట వైపు గడియ వేసి ఉంది. గడియ తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా కోడలు తిరుపతమ్మ మంచంలో రక్తపు మడుగులో పడి ఉండగా, కుమారుడు బంగారయ్య సీలింగు ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతని రెండు చేతులు చున్నీతో కట్టి ఉన్నాయి. దీంతో ఆమె ఇరుగు పొరుగును పిలిచి విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, ప్రొబేషనరి డీఎస్పీ విజయభాస్కర్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ రాహుల్దేవ్లు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నల్లగొండ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతులిద్దరూ నిరుపేదలు కావడం, వారి వద్ద విలువైన వస్తువులు, డబ్బు లేకపోవడంతో ఇతరులు హత్య చేసే అవకాశం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భార్యాభర్త గొడవపడిన సందర్భంలో తిరుపతమ్మ తలపై గురవయ్య రోకలిబండతో కొట్టడంతో చనిపోయి ఉండొచ్చని, దిక్కుతోచని స్థితిలో అతను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. డాగ్ స్క్వాడ్ సైతం ఇంట్లోకి వెళ్లి మృతుడి చుట్టూ తిరిగి, ఇంట్లో ఉన్న బావి వద్దకు వెళ్లింది. తిరిగి మృతుడి వద్దకు వెళ్లడంతో పోలీసుల అనుమానం బలపడింది. గురువమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.