banjara hills city centre
-
ఏసీబీ వలలో బంజారాహిల్స్ సీఐ నరేందర్
సాక్షి, బంజారాహిల్స్: లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్స్పెక్టర్ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్ పీఎస్, నరేందర్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది. -
సిటీ సెంటర్లో పోకిరీలకు దేహశుద్ధి!
-
సిటీ సెంటర్ లో పోకిరీకి దేహశుద్ధి
హైదరాబాద్: రాజధానిలో ఈవ్ టీజర్లు రెచ్చిపోతున్నారు. వెకిలి చేష్టలతే వనితలను వేధిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ సిటీ సెంటర్ లో శుక్రవారం పోకిరీలు రెచ్చిపోయారు. ఇద్దరు యువతులను వేధింపులకు గురిచేశారు. దీంతో కలత చెందిన యువతులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ లో సమాచారం అందించారు. వెంటనే సిటీ సెంటర్ కు చేరుకున్న యువతి బంధువులు పోకిరీలకు బుద్ధి చెప్పేందుకు యత్నింగా వారు ఎదురు తిరిగారు. దీంతో ఒకరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు పారిపోయారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మహిళలపై వేధింపులు ఆగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.