banjarahills road no 12
-
లతిత అమ్మగారి భోజనం.. భళా
జూబ్లీహిల్స్: ఆహ్లాదకరమైన వాతావరణంతో రుచిరకరమైన భోజనాన్ని అందుబాటులో ఉంచిన ‘లలిత అమ్మ గారి భోజనం’ రెస్టారెంట్ నిర్వాహకులు అభినందనీయులని... నాణ్యత, శుభ్రతతో రుచికరమైన వంటకాలను అందించి భోజనప్రియుల ఆదరణ పొందాలని హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్‌నం.12 లో లలిత అమ్మ గారి భోజనం పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సందీప్‌రాజ్, ప్రణయ్ మాట్లాడుతూ... 90 శాతం మంది మహిళా సిబ్బందితో ఈ హోటల్ నిర్వహిస్తున్నామన్నారు. రుచికరమైన వెజ్, నాన్‌వెజ్ వంటకాలు ఉన్నాయన్నారు. రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నహోంమంత్రి మహమూద్ అలీ -
పెళ్ళైన మూడు నెలలకే దంపతుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: వివాహమై సంతోషంగా గడుపుదామనుకున్న కొత్త జంట జీవితంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్ళైన మూడు నెలలకే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే తాడుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అర్చన, సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యభిచారం కేసులో బ్యూటీషియన్..
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించి నిర్వాహకుడితో పాటు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఎన్బీటీ నగర్లో గత కొంత కాలంగా షేక్ ముజుమిల్ రెహమాన్ అనే వ్యక్తి వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు రెహమాన్‌తో పాటు గాంధీనగర్ దేవిచౌక్ ప్రాంతానికి చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. బ్యూటీషియన్‌గా పని చేస్తున్న తాను నెలకు రూ.15 వేలు కూడా సంపాదించలేకపోతున్నానని ప్రతినెలా రూ. 50 వేలు ఇస్తానని రెహమాన్ చెప్పడంతో ఆరు నెలల క్రితం ఈ వృత్తిలోకి దిగినట్లు తెలిపింది. నిర్వాహకుడు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించింది. నిందితుడు రెహమాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు యువతిని పునరావాసకేంద్రానికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాకీలకు చుక్కలు చూపించిన మహిళ
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కళింగ చౌరస్తాలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో ఓ మహిళ వ్యాపారవేత్త పోలీసులకు చుక్కలు చూపించింది. బంజారాహిల్స్ రోడ్‌నెం.3లో నివసించే యువ వ్యాపారవేత్త మద్యం తాగి తన ఆడికారు నడుపుకుంటూ వస్తుండగా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆపేందుకు యత్నించగా వేగంగా ముందుకు పోనిచ్చింది. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు యత్నించగా ఆమె అడ్డుకోవడమే కాకుండా ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా చిందులు తొక్కింది. అతికష్టం మీద పోలీసులు ఆమెకు శ్వాస పరీక్ష నిర్వహించగా పరిమితికి మించి మద్యం తాగి ఉన్నట్టు నిర్థారణైంది. దీంతో కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు చేపట్టిన డ్రంకన్ డ్రైవ్‌లో అతిగా మద్యం తాగి వాహనం నడుపుతున్న 20 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 కార్లు, 9 బైక్‌లు, ఒక ఆటో ట్రాలీ ఉన్నాయి. పట్టుబడ్డ వాహనదారులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని సీఐ ఉమా మహేశ్వరరావు తెలిపారు.