
సాక్షి, హైదరాబాద్: వివాహమై సంతోషంగా గడుపుదామనుకున్న కొత్త జంట జీవితంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్ళైన మూడు నెలలకే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే తాడుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అర్చన, సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment