bank mangers
-
బ్యాంక్ మేనేజర్ సజీవ దహనం
-
అధికారుల నిర్లక్ష్యం... నిరుద్యోగులకు శాపం
చెన్నూరు : జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ నేతలు చేస్తున్న ఒత్తిళ్లు.. అధికారుల నిర్లక్ష్యం దళిత నిరుద్యోగులకు శాపంలా మారింది. ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు లేక చిన్నపాటి యూనిట్లు నెలకొల్పుకొని జీవిద్దామనుకొంటున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ, బ్యాంకు మేనేజర్లను సమన్వయం చేయాల్సిన అధికారులు విఫలంమయ్యారు. అధికారులు ఇటు నేతలకు, అటు బ్యాంకు అధికారులకు ఎంత చెప్పినా ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడంతో నిరుద్యోగులైన దళిత యువకులకు మంజూరైన రుణాలు రద్దయ్యాయి. రూ 9.10 లక్షల సబ్సిడీ రద్దు చెన్నూరు మండలంలోని నిరుద్యోగులైన ఎస్సీ యువకులకు యూనిట్లు నెలకొల్పేందుకోసం ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 36 సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. ఇందులో చెన్నూరు ఎస్బీఐ 11, ఏపీజీబీ రామనపల్లెకు 10, చెన్నూరు ఏపీజీబి 15 యూనిట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు గత ఏడాది నవంబర్‌లో దరఖాస్తులు చేసుకోవాలంటూ అధికారులు చెప్పారు. 253 మంది దరఖాస్తులు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకొని నాయకులు, అధికారులు, బ్యాంకర్ల చుట్టూ తిరిగి తమకు సబ్సిడీ రుణాలు ఇప్పించాలని కోరారు. రూ. 50 వేల నుంచి రూ. లక్షవరకు సబ్సిడీ యూనిట్లు కావడంతో అధికార పార్టీ నాయకులు వారికి అనుకూలమైన వారికి ఇప్పించేందుకు ఒత్తిడి చేశారు. స్టేట్‌బ్యాంకు, ఏపీజీబీ రామనపల్లె బ్యాంకుల్లో జాబితా పూర్తి చేసి వెంటనే పంపారు. యూనిట్లు మంజూరయ్యాయి. చెన్నూరు ఏపీజీబీలో బ్యాంకు మేనేజర్ లబ్ధిదారుల జాబితా తయారు చేసి పంపగా నాయకులు తమకు అనుకూలమైన వారివి తక్కువ ఉన్నాయని జాబితా వెనక్కు పంపారు. మేనేజర్ నేరుగా ఎస్సీ కార్పొరేషన్‌కు పంపారు. జన్మభూమి సంతకాల కోసం మండలానికి పంపారు. వారు అక్కడి నుంచి పంపక పోవడంతో గడువు దాటిపోయింది. దీంతో సుమారు 30 మందికి మంజూరు కావాల్సిన రుణాలు ఆగిపోయాయి. రూ. 9.10 లక్షల సబ్సిడీ రద్దయింది. ఆవేదనలో లబ్ధిదారులు తాము దరఖాస్తు చేసుకొని రుణాలకు అర్హత పొందినా అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయామని నిరుద్యోగులైన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీనేతలు తాము చెప్పిన వారికే ఇవ్వాలని ఒత్తిడి చేయడం.. బ్యాంకులో లావాదేవీలు జరిపే వారికి తాము ఇవ్వాలంటూ బ్యాంకర్లు పట్టుబట్టడంతో ఎవ్వరికి రుణాలు రాకుండా పోయి సబ్సిడీని కోల్పోవాల్సి వచ్చిందని లబ్ధిదారులు అంటున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ విజయకుమారిని వివరణ కోరగా జాబితాను సిద్ధం చేశామని ఎస్సీ కార్పొరేషన్ సిబ్బందికి తీసుకెళ్లాలని సూచించినా రాలేదని, ఈ జాబితాలో రుణాలు రానివారికి మళ్లీ జాబితాలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. బ్యాంకు మేనేజర్ లక్ష్మికాంత్‌రెడ్డి మాత్రం తాము బ్యాంకు నిబంధనల ప్రకారం లావాదేవీలు, రికవరీలు చేసుకొని రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. -
మాయలేడి
ధర్మవరం అర్బన్: ఆమె మహిళా సంఘాలకు నాయకురాలు. మహిళా సంఘాలన్నింటికి ఆమె ముందుండి నడిపిస్తారు. ఇదే అదునుగా ఆమె చెలరేగిపోయింది. మరో ముగ్గురు మహిళలతో కలసి పన్నాగం పన్నింది. అనుకున్నదే తడువుగా దొంగ గ్రూపులను సృష్టించింది. బ్యాంకులకు టోకరా వేసింది. అంతటితో ఆగకుండా మున్సిపాలిటి అధికారులకే తెలియకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ.25 లక్షలు అప్పు చేసి.. అందులో రూ.16 లక్షలకు టోకరా వేసింది. చివరికి అసలు విషయం బయటపడగా.. ఏకంగా మున్సిపాలిటి అధికారులనే బెదిరించింది. తాను ఎమ్మెల్యేకు ఎంత చెబితే అంత అని, జెడ్పీ చైర్మన్ చమన్ తన బంధువు అవుతాడని హెచ్చరించింది. ఏకంగా బ్యాంక్ మేనేజర్లనే ఫోన్లో బెదిరించింది. ఇదీ ధర్మవరం మున్సిపాలిటీలో చోటుచేసుకున్న తతంగం. వివరాలలోకి వెళితే.. ధర్మవరం పట్టణానికి సంబంధించి 2,500 గ్రూపులు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి టీఎల్ఎఫ్ (పట్టణ సమాఖ్య) ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా భావమ్మ అనే మహిళ కొనసాగుతోంది. కొద్ది కాలంగా ఈమె నేతృత్వంలో డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లు బినామీ గ్రూపులను తయారు చేసింది. పేపర్లపై సృష్టించిన ఈ గ్రూపులకు లోన్లు తీసుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్‌లో రూ.10 లక్షల వరకు లోన్లు తీసుకోగా, ఎస్బీఐ, కెనరా, అనంత గ్రామీణ బ్యాంకుల్లో రూ. 15 లక్షల వరకు సంఘాల పేరుతో లోన్లు తీసుకున్నారు. అయితే ఈ లోన్లు తీసుకోవడానికి డ్వాక్రా సంఘాలు అర్హులైనవి అని చెప్పడానికి సీ.ఓలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే గ్రూపులు నకిలీవి అని తేల్చిన అధికారులు సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో మరో మహిళ సంఘం సభ్యురాలితో కలసి ఏకంగా అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేసింది. ఇవన్నీ నిజమైన సంతకాలేనని నమ్మిన సెంట్రల్ బ్యాంక్ అధికారులు లోన్లు మంజూరు చేశారు. అయితే తీసుకున్న లోన్లు కట్టకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు సంబంధిత మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లి విచారించగా అసలు విషయం బయట పడింది. మున్సిపాలిటీకి చెందిన కమ్యూనిటి ఆర్గనైజర్(సీఓ) బ్యాంక్‌కు పంపించిన నివేదికల్లో తాను ఎలాంటి సంతకాలు చేయలేదని, ఇవన్నీ ఫోర్జరీ సంతకాలేనని చెప్పడంతో అవాక్కవ్వడం మున్సిపాలిటీ అధికారుల వంతైంది. ఒక వైపు మున్సిపాలిటి అధికారులను, మరో వైపు బ్యాంక్ అధికారులను మభ్యపెట్టి పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకోవడంతో రికవరీ ఎలా చేయాలోనని బ్యాంక్ అధికారులు తలలు పట్టుకున్నారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాబయ్య ఈ విషయూన్ని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. నిందితురాలిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నేతల పేర్లతో బెదిరింపులు బండారం బట్టబయలు కావడంతో ఎలాగైనా బయటపడాలని భావించి తీవ్రస్థాయిలో ఆమె అధికారులపై ఒత్తిడి తె చ్చింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు తాను ఎంత చెబితే అంత అని, జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ తనకు బంధువునని టీపీఓను బెదిరించింది. ఈ విషయూన్ని ఆయన ధ్రువీకరించారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకును మోసం చేసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ రఫీ తెలిపారు. కాగా, నిజంగా ఈమెకు రాజకీయ నేతల మద్దతు ఉండే ఇలా చేసిందా.. లేక వారి పేరు వాడుకుని మోసం చేసిందా అనేది విచారణలో తేలాల్సి ఉంది.