bank payment
-
హయ్యర్ స్టడీస్ లోన్‌పై బ్యాంకు విధించే చార్జెస్, ఇవే!
ఉన్నత చదువు కోసం ఎక్కువ ఖర్చవుతుందనే విషయం అందరికీ తెలుసు, కావున కొన్ని సందర్భాల్లో దీనికోసం కొంతమంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. మీరు తీసుకునే లోన్.. ఎంచుకున్న కోర్సుని బట్టి ఉండవచ్చు. అయితే బ్యాంకులు కొన్ని సందర్భాల్లో లోన్ చార్జీలను వెల్లడించదు. అలంటి సందర్భాల్లో వినియోగదారుడు లోన్ తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందికి లోనవుతాడు. నిజానికి నర్సింగ్ ప్రారంభం నుంచి ఉన్నత డిగ్రీ పొందే వరకు వివిధ సందర్భాల్లో విద్యార్థి లోన్స్ తీసుకోవచ్చు, ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఒక స్టూడెంట్ లోన్ తీసుకునేటప్పుడు దాని కోసం అదనపు ఖర్చులను భరించాల్సి వస్తుంది, అలాంటి వాటిని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు: మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకు లోన్ ప్రాసెస్ చేయడానికి కొంత ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేస్తుంది. ఇది మీరు తీసుకునే లోన్ అమౌంట్ మొత్తంలో 1 నుంచి 2 శాతం వరకు ఉంటుంది. ప్రీ పేమెంట్ ఫీజు: మీరు లోన్ తీసుకున్నప్పుడు అనుకున్న సమయానికంటే ముందుగా లోన్ తిరిగి చెల్లించాల్సి వస్తే దాని కోసం బ్యాంకులు ప్రీ పేమెంట్ ఫీజుని వసూలు చేసేవి, కానీ ఇప్పుడు ఆర్బిఐ నోటిఫికేషన్ కారణంగా ఏ బ్యాంకులు ఇటువంటి ఫీజులను తీసుకోవడం లేదు. లేట్ పేమెంట్: మీరు ఏదైనా కారణం వల్ల గానీ, ఇతర సమస్య వల్ల గానీ చెల్లించాల్సిన గడువు తర్వాత లోన్ తిరిగి చెల్లించినప్పుడు లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మీరు ఆలస్యం చేయడం వల్ల సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది భవిస్యత్తులో కొన్ని అవసరాల్లో ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా నిర్దిష్ట సమయంలో లోన్ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రకంలో మార్పు: మీరు లోన్ తీసుకునే సమయంలో మీ వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. అయితే స్థిరమైన వడ్డీ రేటు నుంచి ప్లోటింగ్ వడ్డీ రేటుకు మారాలనుకున్నప్పుడు కూడా కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది. లోన్ రద్దు చేసుకోవడం: మీరు లోన్ కావాలని అప్లై చేసుకుని తరువాత ఏదైనా కారణం వల్ల లోన్ వద్దనుకుంటే అప్పుడు బ్యాంకు మైనర్ క్యాన్సిలేషన్ కింద కొంత మొత్తం వసూలు చేస్తుంది. ఇది మీరు మంజూరైన లోన్ మొత్తంలో 1 శాతం వరకు ఉండవచ్చు. -
పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు కేబినెట్ ఓకే
♦ 2017 సెప్టెంబర్‌కల్లా ఏర్పాటు ♦ 650 బ్రాంచీలతో కార్యకలాపాలు న్యూఢిల్లీ: పోస్టాఫీసు పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 650 బ్రాంచీలతో ఈ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల కార్పస్‌తో పోస్టాఫీసు పేమెంట్ బ్యాంక్ ఏర్పాటవుతుందని బుధవారం నాడు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో రూ.400 కోట్ల ఈక్విటీకాగా, రూ.400 కోట్లు గ్రాంట్. దేశంలో మొత్తం 1.54 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. ఇందులో 1.39 లక్షల పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక అనుసంధానం జరుగుతుందని భావిస్తున్నట్లు రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్వహించే ఈ బ్యాంక్, పటిష్ట స్థాయి నిర్వహణకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. పోస్టల్ శాఖ, వ్యయ నిర్వహణ శాఖ, ఆర్థిక సేవల శాఖల సహా పలు ఇతర ప్రభుత్వ శాఖలు సైతం బ్యాంక్ సక్రమ నిర్వహణలో భాగస్వామ్యం అవుతాయని అన్నారు. పోస్టాఫీసులకు సంబంధించి కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను పెంపొందించే క్రమంలో 2017 మార్చి నాటికి ‘గ్రామీణ డాక్ సేవకులు’ అందరికీ ఐపాడ్, స్మార్ట్ఫోన్లు అందించే విషయమై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పోస్టాఫీసుల కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్ ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకన్నా అధికంగా ఉంది. ఎస్బీఐ 1,666 కోర్ బ్యాంకింగ్ బ్రాంచీలు కలిగివుండగా, పోస్టాఫీసులకు సంబంధించి ఈ సంఖ్య 22,137గా ఉంది.