ఉన్నత చదువు కోసం ఎక్కువ ఖర్చవుతుందనే విషయం అందరికీ తెలుసు, కావున కొన్ని సందర్భాల్లో దీనికోసం కొంతమంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. మీరు తీసుకునే లోన్.. ఎంచుకున్న కోర్సుని బట్టి ఉండవచ్చు. అయితే బ్యాంకులు కొన్ని సందర్భాల్లో లోన్ చార్జీలను వెల్లడించదు. అలంటి సందర్భాల్లో వినియోగదారుడు లోన్ తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందికి లోనవుతాడు.
నిజానికి నర్సింగ్ ప్రారంభం నుంచి ఉన్నత డిగ్రీ పొందే వరకు వివిధ సందర్భాల్లో విద్యార్థి లోన్స్ తీసుకోవచ్చు, ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఒక స్టూడెంట్ లోన్ తీసుకునేటప్పుడు దాని కోసం అదనపు ఖర్చులను భరించాల్సి వస్తుంది, అలాంటి వాటిని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.
ప్రాసెసింగ్ ఫీజు: మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకు లోన్ ప్రాసెస్ చేయడానికి కొంత ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేస్తుంది. ఇది మీరు తీసుకునే లోన్ అమౌంట్ మొత్తంలో 1 నుంచి 2 శాతం వరకు ఉంటుంది.
ప్రీ పేమెంట్ ఫీజు: మీరు లోన్ తీసుకున్నప్పుడు అనుకున్న సమయానికంటే ముందుగా లోన్ తిరిగి చెల్లించాల్సి వస్తే దాని కోసం బ్యాంకులు ప్రీ పేమెంట్ ఫీజుని వసూలు చేసేవి, కానీ ఇప్పుడు ఆర్‌బిఐ నోటిఫికేషన్ కారణంగా ఏ బ్యాంకులు ఇటువంటి ఫీజులను తీసుకోవడం లేదు.
లేట్ పేమెంట్: మీరు ఏదైనా కారణం వల్ల గానీ, ఇతర సమస్య వల్ల గానీ చెల్లించాల్సిన గడువు తర్వాత లోన్ తిరిగి చెల్లించినప్పుడు లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మీరు ఆలస్యం చేయడం వల్ల సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది భవిస్యత్తులో కొన్ని అవసరాల్లో ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా నిర్దిష్ట సమయంలో లోన్ చెల్లించాల్సి ఉంటుంది.
వడ్డీ రకంలో మార్పు: మీరు లోన్ తీసుకునే సమయంలో మీ వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. అయితే స్థిరమైన వడ్డీ రేటు నుంచి ప్లోటింగ్ వడ్డీ రేటుకు మారాలనుకున్నప్పుడు కూడా కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
లోన్ రద్దు చేసుకోవడం: మీరు లోన్ కావాలని అప్లై చేసుకుని తరువాత ఏదైనా కారణం వల్ల లోన్ వద్దనుకుంటే అప్పుడు బ్యాంకు మైనర్ క్యాన్సిలేషన్ కింద కొంత మొత్తం వసూలు చేస్తుంది. ఇది మీరు మంజూరైన లోన్ మొత్తంలో 1 శాతం వరకు ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment