Banking Act
-
నలుగురు నామినీలు.. కీలక మార్పులు..
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభ ఆమోదించింది. ప్రధానంగా బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలకు గరిష్టంగా నలుగురు నామినీలను కలిగి ఉండేలా ఈ బిల్లు అనుమతిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది."ప్రతిపాదిత సవరణలు బ్యాంకింగ్ రంగంలో పాలనను బలోపేతం చేస్తాయి. నామినేషన్, డిపాజిట్‌దారుల రక్షణకు సంబంధించి కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి" అని సీతారామన్ బిల్లును ప్రవేశ పెడుతూ చెప్పారు. బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం బ్యాంకులో ఖాతాదారు గరిష్టంగా నలుగురు నామినీలను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరిని ఒకేసారి కానీ, వివిధ సందర్భాల్లో గానీ చేర్చుకోవచ్చు. ఎవరెవరికి ఎంత వాటా అన్నది కూడా ఖాతాదారు పేర్కొనవచ్చు.పాలనా ప్రమాణాలను మెరుగుపరచడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ్యాంకులు నివేదించడంలో స్థిరత్వాన్ని అందించడం, డిపాజిటర్లకు, ఇన్వెస్టర్లకు మెరుగైన రక్షణ కల్పించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడం, నామినీల విషయంలో కస్టమర్ సౌలభ్యాన్ని పెంచడం, సహకార బ్యాంకుల్లో డైరెక్టర్ల పదవీకాలం పెంచడం వంటి వాటికి సంబంధించి 19 సవరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు.ప్రతిపాదిత కీలక మార్పులుబ్యాంకు ఖాతాలకు నామినీల సంఖ్య పెంపుతోపాటు మరికొన్ని కీలక మార్పులు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024లో ఉన్నాయి.బ్యాంకులకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు, షేర్, వడ్డీ లేదా బాండ్ల రిడెమ్షన్ను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF)కి బదిలీ చేస్తారు. సంబంధిత వ్యక్తులు ఎకరైనా ఉంటే అక్కడి నుంచి క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.డైరెక్టర్షిప్స్కు సంబంధించి సబ్‌స్టాన్షియల్ ఇంట్రస్ట్ పరిమితి రూ.2 కోట్లకు పెరుగుతుంది. ఇది ప్రస్తుత రూ.5 లక్షలుగా ఉంది. దీన్ని సుమారు 6 దశాబ్దాల కిందట నిర్ణయించారు.సహకార బ్యాంకుల డైరెక్టర్ల (ఛైర్మన్, ఫుల్‌టైమ్ డైరెక్టర్ మినహా) పదవీ కాలం ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెరుగుతుంది.కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరు రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులో కూడా సభ్యుడిగా ఉండేందుకు అనుమతి. -
ఒక్క రోజు ఆలస్యం అయినా చర్యలు!
న్యూఢిల్లీ: రుణ వాయిదాల చెల్లింపుల విషయంలో ‘ఒక రోజు’ ఆలస్య ఘటనలు పెరుగుతుండటం పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి (వన్–డే డిఫాల్ట్) నిబంధనావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని బ్యాంకింగ్‌కు సూచించింది. రుణ చెల్లింపుల విషయంలో ‘ఒకరోజు కూడా ఆలస్యం జరగరాదు’ అన్న నిబంధనావళి కాకుండా ‘నెలలో ఏ రోజైనా రుణ చెల్లింపులు’ అన్న విధంగా నిబంధనావళిని మార్చాలని ప్రభుత్వం నుంచి సైతం ఒత్తిడి వస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. ‘బాండ్లకు సంబంధించి ఒక్కరోజు కూపన్ రేటు చెల్లింపులో ఆలస్యం జరిగినా మార్కెట్ భారీ జరిమానా విధిస్తుంది. రేటింగ్ పడిపోతుంది. ఆ భయాలతో బాండ్ల మార్కెట్‌కు సంబంధించి తగిన విధంగా వ్యవహరించే కార్పొరేట్లు, బ్యాంకు రుణాల విషయంలో ‘ఆలస్య’ విధానాన్ని ఎలా అనుసరిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ధోరణి సరికాదని స్పష్టం చేశారు. రుణ గ్రహీతలు చెల్లింపుల ‘ఒన్–డే డిఫాల్డ్ నిబంధన’ను పాటించని పక్షంలో దానిని ‘హెచ్చరిక సంకేతంగా’ తీసుకోవాల్సిందేనని ఆయన బ్యాంకింగ్‌కు స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ (ఆర్బీఐ నిర్వహిస్తున్న)14వ స్నాతకోత్సవ కార్యక్రమంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్కు ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్న విశ్వనాథన్ బుధవారం మాట్లాడారు. నేపథ్యం ఇదీ... బ్యాంకింగ్ రుణాల్లో మొండిబకాయిలు (ఎన్పీఏ) 10 శాతం దాటిపోవడంతో ఆర్బీఐ ఈ సమస్య పరిష్కారంలో పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన ఒక విధానాన్ని ఆవిష్కరించింది. దీనిప్రకారం– రుణ చెల్లింపుల్లో (వడ్డీసహా) కేవలం ఒక్కరోజు ఆలస్యం జరిగినా, సంబంధిత డిఫాల్ట్ వివరాలను సంబంధిత బ్యాంక్ వెల్లడించాల్సి ఉంటుంది. ఇలాంటి కేసులకు సంబంధించి 180 రోజుల్లో ఒక పరిష్కార మార్గం చూడాలి. లేదంటే, వెంటనే సంబంధిత డిఫాల్టింగ్ కంపెనీని ఇన్సాల్వెన్సీ కోర్టులకు నివేదించాలి. డిఫాల్టింగ్ విషయంలో ఈ విధానాన్నే బ్యాంకింగ్ అవలంభించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల వల్ల పలు కంపెనీలు ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమలపై సైతం ఒత్తిడి పెరుగుతుందని ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు సైతం ప్రతికూలమేనన్న విమర్శలూ వచ్చాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఏమన్నారంటే... అనేకమంది రుణ గ్రహీతలు, ఇంకా చెప్పాలంటే, అధిక రేటింగ్ ఉన్న వారుసైతం ఒన్ డే డిఫాల్ట్ నిబంధనను పాటించడంలో విఫలం అవుతున్నారు. ఈ ధోరణి మారాలి. ఇలాంటి పరిణామాన్ని బ్యాంకులు హెచ్చరికపూర్వక సూచికగా భావించాలి. తగిన చర్యల తీసుకోవాలి. ఒక్క రోజు రుణ డిఫాల్ట్ జరిగినా, ఈ సమస్య పరిష్కారానికి సంబంధించిన వాచ్‌లిస్ట్‌లోకి వెళ్లిపోతారని తమ కస్టమర్లకు బ్యాంకులు స్పష్టం చేయాలి. ఇక రేటింగ్ ఏజెన్సీల పనితీరు మదింపునకు సంబంధించి తగిన ప్రమాణాలను ఆర్బీఐ తీసుకువస్తుంది. రేటింగ్ అభిప్రాయంలో విశ్వసనీయతకు ఇది అవసరం. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధన కల్పన వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. -
ప్రభుత్వ సంస్థలకు ‘మొండి’ ప్రాజెక్టులు
► వ్యూహరచనలో కేంద్రం ► ఎన్పీఏల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ)అప్పగించే కీలక వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో బుధవారం బ్యాంకింగ్ యాక్ట్ సవరణకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపిన కేంద్రం, ఇదే క్రమంలో మరింత ముందుకు వెళ్లడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌యూలకు ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను అప్పగించడానికి తగిన నిబంధనల సవరణపై కేంద్రం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో కేబినెట్ సెక్రటేరియట్ వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, బ్యాంకుల మధ్య సమన్వయం చేస్తుంది. ప్రధాని కీలక సమీక్ష సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గత వారం ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి అంజులీ చిబ్ దుగ్గల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఒక నిర్ధిష్ట రంగం ప్రాజెక్టులను సంబంధిత మంత్రిత్వశాఖకు అప్పగించే వ్యూహంపై కేంద్రం ప్రత్యేకించి దృష్టి పెట్టింది. వివిధ రంగాలకు సంబంధించి భారీ ఎన్పీఏలను గుర్తించాలని, ఆయా రంగాల వివరాలను సంబంధిత మంత్రిత్వశాఖలకు తెలియజేయాలని ఇప్పటికే బ్యాంకింగ్‌కు కూడా సంకేతాలు అందాయి. అలాగే ఆయా అంశాలకు సంబంధించి వ్యూహాలను రూపొందించే పనిలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బిజీగా ఉన్నాయి. పరస్పర ప్రయోజనం లక్ష్యం... తక్కువ స్థాయి ధర వద్ద... ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టుల కొనుగోలు ప్రభుత్వ రంగ సంస్థలకు లాభదాయక అంశమయితే, ఎన్పీఏల భారం తగ్గడం బ్యాంకులకు సానుకూల అంశమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈ పరస్పర ప్రయోజన లక్ష్యంగా సమస్య ఎన్పీఏల పరిష్కార ప్రణాళికలు రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకు ఎన్పీఏలు 2015 మార్చిలో రూ.2.67 లక్షల కోట్లు ఉంటే,, 2016 మార్చి నాటికి ఈ మొత్తం రూ.5.02 లక్షలకోట్లకు పెరగడంతో దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్పీఏల పరిష్కారం దిశలో ఆర్బీఐకి కీలక అధికారాలను అప్పగించే నిర్ణయాలను బుధవారం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలు ప్రత్యేకించి బ్యాంకింగ్ చట్ట సవరణలు ఎన్పీఏల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయని ఫైనాన్స్ కార్యదర్శి అశోక్ లవాసా గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు.