banknotes cancel
-
బినామీల భరతం పడతాం
సుందర్‌నగర్/కంగ్రా: అవినీతిపరుల భరతం పట్టేందుకు త్వరలోనే బినామీ చట్టం రానుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అక్రమాస్తులున్న కాంగ్రెస్ నేతల్లో ఇప్పటికే దీనిపై గుబులురేగుతోందన్నారు. బినామీ ఆస్తులు కూడబెట్టుకున్న వారెవరినీ ఉపేక్షించబోమని మోదీ స్పష్టం చేశారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన భారీ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘నోట్లరద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమం.. ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది. బినామీ ఆస్తులపై త్వరలో విరుచుకుపడనున్న తుపాను కంటే ముందే నాకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారు. పేదలనుంచి దోచుకున్నది వారికి తిరిగిచ్చే సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ నేతలు అవి వారి ఆస్తులే అని ప్రకటించుకోలేని పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. నవంబర్ 8న బ్లాక్‌డే నిర్వహించాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. కానీ ఇది అసలైన ‘బ్లాక్‌మనీడే’ అనే విషయం వారికి అర్థంకావటం లేదన్నారు. ‘కొవ్వొత్తుల ర్యాలీలు, కొందరిని వెనకేసుకుని వస్తే నేను భయపడను. సర్దార్ పటేల్ శిష్యుడిగా ఇలాంటి కుట్రలకు తలొగ్గేది లేదు’ అని మోదీ స్పష్టం చేశారు. ప్రజాధనం లూటీతో బినామీ ఆస్తులు ‘నేను కాంగ్రెస్ నేతలపై కొంత సమాచారం తీసుకుందామని ప్రయత్నించాను. కొందరు రద్దయిన పాతనోట్ల సంచులను పోగొట్టుకున్నారని తెలిసింది. ఈ సమయంలోనే మోదీ బినామీ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. దీని ఫలితాలు కనబడితే తమ గతేంటనేదే వారి భయం. భూమి, ఫ్లాట్లు, దుకాణాలు, దాచిపెట్టుకున్న రూ.500, రూ. వెయ్యి నోట్లు ఇలా దేన్నీ వదిలిపెట్టను. ఈ విషయం అర్థమవటంతోనే ప్రజలను తప్పుదారి పట్టిం చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ప్రధాని తెలిపారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు తమ డ్రైవర్లు, వంట మనుషులు, పని మనుషుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు. ఇదంతా ప్రజలను లూటీ చేసిన డబ్బుతో కొన్నదని.. అది ప్రజల సంక్షేమానికే వినియోగించాలని మోదీ పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో లెక్కలేనన్ని కుంభకోణాలు చేసిన కాంగ్రెస్.. సిగ్గులేకుండా నవంబర్ 8ని బ్లాక్‌డేగా జరపాలనటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలకు మరో వందేళ్లైనా ప్రజలుఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఓటమి గుర్తించే కాంగ్రెస్ పలాయనం అంతకుముందు, కంగ్రాలో జరిగిన ర్యాలీలోనూ కాంగ్రెస్ పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ దేశానికి పట్టిన చెద’ అని విమర్శించిన మోదీ.. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. హస్తం పార్టీ నేతలు పలాయనం చిత్తగిస్తున్నారన్నారు. నోట్లరద్దు తర్వాత పేదలు, మధ్యతరగతి ప్రజలు తిరిగి పనులు చేసుకుంటుంటే.. అవినీతిపరులు మాత్రం తమ అక్రమ సంపాదనను బలవంతంగా బ్యాంకులో వేయించినందుకు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ సీఎంగా, వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే హిమాచల్ ప్రదేశ్ పురోగతి సాధించిందన్న మోదీ.. నవంబర్ 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడొంతుల మెజారిటీ కల్పించాలని కోరారు. ‘నేను అవినీతిపై పోరాటం చేయాలా? వద్దా?. నిజాయితీగా ఉన్నవారికి భరోసా కలిగించాలా? వద్దా?. నేనీపని చేయటం పాపమవుతుందా?’ అని ప్రశ్నించారు. -
మోదీ ప్రజల ప్రధానే..!
అసంతృప్తి ఉన్నా తరగని మోదీ వన్నె: సర్వేల్లో వెల్లడి మోదీ సర్కారు ఎన్నికల హామీల అమలు విషయంలో వెనుకబడినప్పటికీ.. ప్రజామోదం విషయంలో ముందంజలోనే ఉందన్నది ఇటీవల వివిధ జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో వెల్లడైంది. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారనేది అంచనా వేసేందుకు చేసిన ఈ సర్వేలు.. ఒకవైపు తాము కోరుకున్న ఫలితాల కోసం నిరీక్షణతో ప్రజల్లో అసహనం పెరుగుతున్నప్పటికీ.. మోదీ మీద ప్రజాభిమానం తరగలేదని చెప్తున్నాయి. ఆయన ప్రజల మనసులకు దూరం కాలేదని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై దాదాపు 61 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఎకానమిక్ టైమ్స్ పత్రిక సర్వేలో.. మోదీ పనితీరు ఆశించినదానికన్నా బాగుందని సుమారు 45 శాతం మంది హర్షం వ్యక్తం చేస్తే, దాదాపు 40 శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారు. ధరల పెరుగుదల: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయని లోకల్ సర్కిల్స్ సర్వేలో 66 శాతం మంది బదులిచ్చారు. అయితే.. జీవన వ్యయాన్ని తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎకానమిక్ టైమ్స్ సర్వేలో 58 శాతం మంది పేర్కన్నారు. శాంతి భద్రతలు: ఇక శాంతిభద్రతలు, మహిళలపై నేరాల పెరుగుదల విషయంలో జనంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నేరాల రేటు తగ్గలేదని లోకల్‌సర్కిల్స్‌సర్వేలో దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడడం లేదని గత ఏడాది అసంతృప్తి వ్యక్తంచేసిన వారి సంఖ్య 38 శాతం మాత్రమే. అలాగే.. ఎకానమిక్‌టైమ్స్‌తాజా సర్వేలో ‘మహిళలు, పిల్లలపై నేరాలు తగ్గాయని భావిస్తున్నారా?’ అన్న ప్రశ్నకు ‘లేద’ని సమాధానం ఇచ్చిన వారు 60 శాతం మంది ఉన్నారు. ఇక అసహనం పెరుగుతుందన్న ప్రశ్నలకు.. అత్యధికులు అటువంటిదేమీ తమకు కనిపించలేదని జవాబు ఇచ్చారు. ఉపాధి కల్పన: మోదీ సర్కారుకు అతి తక్కువ మార్కులు వచ్చింది ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయంలోనే. లోకల్‌సర్కిల్స్‌సర్వేలో 63 శాతం మంది ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గత ఏడాది 43 శాతంగా మాత్రమే ఉంది. ఎకానమిక్‌టైమ్స్‌సర్వేలోనూ నిరుద్యోగిత తగ్గలేదని ప్రజాభిప్రాయం బలంగా వ్యక్తమైంది. పెద్ద నోట్ల రద్దు: దేశ ప్రజలను రోజుల తరబడి బ్యాంకుల ముందు క్యూల్లో నిల్చోబెట్టిన పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతిని అరికట్టే విషయంలో ఒరిగిందేమీ లేదని లోకల్‌సర్కిల్స్‌సర్వేలో 49 శాతం మంది అభిప్రాయపడితే.. ఈ చర్య సరైన దిశలో చేపట్టినదేనని 51 శాతం మంది సమర్థించారు. జీఎస్టీ: మోదీ సర్కారు అతి త్వరలో అమలులోకి తెస్తున్న వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) వల్ల తమ వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలపై సానుకూల ప్రభావం ఉంటుందని ఎకానమిక్‌టైమ్స్‌సర్వేలో 60 శాతం మంది ఆశాభావం వ్యక్తంచేశారు. (మరిన్ని వివరాలకు చదవండి) (ఇండియా ఫస్ట్) (కొంచెం మోదం! కొంచెం ఖేదం!!) (మోదీ మ్యానియా) (57 విదేశీ పర్యటనలు) – సాక్షి నాలెడ్జ్సెంటర్