ఇద్దరు పిల్లలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
వరంగల్: ఇద్దరు పిల్లలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గూడూరులో బానోత్ లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ తన ఇద్దరు ఆడపిల్లలకు విషం ఇచ్చాడు. తాను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
విషయం తెలిసిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడితో లక్ష్మణ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.