హయత్‌నగర్‌లో10 ప్రైవేట్ ట్రావెల్స్ సీజ్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌పై చేపట్టిన దాడులు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ సమీపంలో 10 బస్సులు, ఎల్బీ నగర్ వద్ద 5, ఉప్పల్ వద్ద మరో 5 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో కూడా నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను అధికారులు సీజ్ చేశారు. దాంతో ఆ ట్రావెల్స్‌లోని ప్రయాణికులు తమను నడిరోడ్డుపై దించేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.
దీంతో ప్రయాణికులను బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద అధికారులు దింపివేశారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఆ ఘటనతో నిద్రాణంలో ఉన్న ఆర్టీఏ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్‌పై వరసగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.