Bapatla parliamentary constituency
-
తెలంగాణ కృష్ణప్రసాద్‌కు ఎంపీ సీటుపచ్చ నేతలు హాట్..హాట్
చీరాల: ఎంతో ఘన చరిత్ర కలిగిన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటిసారి టీడీపీ ఎంపీ అభ్యర్థి సీటును తెలంగాణకు చెందిన టి.కృష్ణప్రసాద్‌కు కేటాయించడంపై ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, అభ్యర్థులతో చర్చించకుండా టీడీపీ అధినేత సీటు ప్రకటించారని వాపోతున్నారు. తెలంగాణ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వరంగల్ ఎంపీ సీటు ఆశించిన మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్‌కు ఇక్కడ కేటాయించడంపై విస్మయానికి గురయ్యారు. ఉండవల్లి శ్రీదేవికి ఝలక్.. తొలుత బాపట్ల ఎంపీ సీటును వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఖరారు చేసినట్లు ప్రచారం జోరుగా జరిగింది. మాజీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, టీడీపీ నేత ఎంఎస్ రాజు పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవ్వరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే కృష్ణప్రసాద్‌కు పచ్చ కండువా కప్పి బాపట్ల ఎంపీ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిండంపై స్థానిక నేతలు షాకయ్యారు. పార్లమెంట్ పరిధిలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాలకు చెందిన ఉమ్మడి పార్టీల నాయకులు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సామాన్యుడికి పట్టంకట్టిన ఓటర్లు బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం 1977లో ఏర్పడింది. అయితే 2009 పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్ స్థానంగా కేటాయించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2019 ఎన్నికల్లో చీరాల, రేపల్లె, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం బాపట్ల, వేమూరు, ఎస్ఎస్పాడు నియోజకవర్గాలు వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. అయినప్పటికీ బాపట్ల ఎంపీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి సామాన్యుడైన నందిగం సురేష్ విజయం సాధించారు. ఇప్పటికీ ఆయన ప్రజల్లో ఒక కార్యకర్తలాగా తిరుగుతుండటంతో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం నుంచి దిగుమతి అయిన కృష్ణ ప్రసాద్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి నందిగం సురేష్ విజయం నల్లేరుపై నడకలా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ ఎంపీగా కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కృష్ణ ప్రసాద్ తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని ఆశించినప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదు. ఉద్దండుల కోట బాపట్ల ఎంపీ సీటు అంటే ఒకప్పుడు రాజకీయ ఉద్దండులు, యోధానుయోధులు, అధిక జనాకర్షణ ఉన్న నేతలు పోటీ చేసే నియోజకవర్గం. ఇక్కడ పోటీ చేసిన పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలకు అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రులు, ఉప రాష్ట్రపతిగా పని చేసిన ఘనత ఉంది. ముఖ్యంగా గతంలో దేశానికి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ఎం.వెంకయ్యనాయుడు టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు బాపట్ల ఎంపీగా పోటీచేసి పార్లమెంట్ మెట్లెక్కారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం బాపట్ల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ నుంచి బాపట్ల ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఎస్సీ నియోజకవర్గం కానప్పటికీ గతంలోనే సలగల బెంజిమెన్ వెంకయ్యనాయుడుపై ఎంపీగా గెలిచారు. ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత పనబాక లక్ష్మి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రిగా పనిచేసిన జేడీ శీలం సైతం బాపట్ల పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత శీలం రాజ్యసభకు వెళ్లి కేంద్రమంత్రిగా పనిచేశారు. విశ్రాంత ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్లు సైతం బాపట్ల నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారు. -
సామాన్యుడి స్వరం వినిపిస్తా..
సాక్షి, బాపట్ల (శ్రీకాకుళం): ‘బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నేను నిలబడాలని జగనన్న చెబితే మొదట్లో అర్థం కాలేదు. సామాన్యుడినైన నాకు ఎంపీ టికెట్టా అని అడిగితే.. ఏ..? సామాన్యుడు ఎంపీ కాకూడదా అంటూ జగనన్న చిరునవ్వుతో బదులిచ్చారు. మా అధినేత నింపిన స్ఫూర్తితో బాపట్ల ఎంపీగా గెలుస్తా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు వినిపిస్తా’... అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్‌బాబు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని.. తాను ఎంపీగా గెలుపొందిన వెంటనే నీటి సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఒక సామాన్యుడు ఎంపీ స్థాయికి ఎదగడం అంటే కోహినూర్ వజ్రాన్ని సొంతం చేసుకున్నట్లేనని పేర్కొన్నారు. ఎంతో మంది సామాన్యులు తామే ఎంపీ అభ్యర్థిగా ఉన్నామని భావిస్తూ తన గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నారని సురేష్‌బాబు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. ఆ వివరాలు... సాక్షి : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేయడాన్ని ఏ విధంగా భావిస్తున్నారు? సురేష్‌బాబు : ఎంతో మంది ప్రముఖులు గెలుపొందిన ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నా. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తా. బాపట్లను కచ్చితంగా అభివృద్ధివైపు పరుగులు తీయిస్తా. సాక్షి : ప్రస్తుత ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సురేష్‌బాబు : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలపైనే జోరుగా చర్చ సాగుతోంది. ప్రజలు కూడా నవరత్నాలపైనే విశ్వాసంగా ఉన్నారు. సామాన్యుడినైనా నాకు ఎంపీగా అవకాశం రావడంతో నేను ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ కనిపిస్తోంది. నా గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడుతున్నాయి. కచ్చితంగా గెలిచి తీరుతా. సాక్షి : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యలను గుర్తించారా? సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంపై నాకు ఎంతో పట్టు ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించి పట్టుసాధించా. ఈ నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు కృషి చేస్తా. నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా శ్రమిస్తా. సాక్షి : ఎన్నికల ప్రచారం ఎలా సాగింది? సురేష్‌బాబు : ఎన్నికల ప్రచారం చాలా చక్కగా జరిగింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాపట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తిచేశా. ఎక్కడ చూసినా ఫ్యాన్ జోర్ తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సంక్షేమ పాలన అందుతుందని ప్రజలు భావిస్తున్నారు. నవరత్నాలు ఎప్పుడు అందుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సాక్షి : నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా సొంతం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న శ్రీరామ్‌మాల్యాద్రి ఐదేళ్లుగా ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రజలను కలిసి ఓట్లు అడిగారు.. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో ప్రజలు ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇది నాకు కలిసొచ్చే అంశం. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రానికి దిక్సూచి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని భావిస్తున్నారు. సాక్షి : ఎంపీగా గెలిచాక ఎలా ఉంటారు? సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలోనే ఒక సామాన్యుడు ఎంపీ అభ్యర్థిగా వస్తాడని ప్రజలు ఊహించలేదు. నేను ఒక సామాన్యుడిగా ప్రజల ముందుకు వచ్చాను. నన్ను ప్రజలు గెలిపిస్తే వారి మధ్యనే ఉంటా. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీలో వినిపిస్తా. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండి చూపిస్తా. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్ వేదికగా పోరాడతా. -
వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా అమృతపాణి
సాక్షి, గుంటూరు : బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ వరికూటి అమృతపాణిని ఎంపిక చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన ఈయన వైద్యునిగా నియోజకవర్గ ప్రజలకు పరిచితులే. డాక్టర్ అమృతపాణి సంతనూతలపాడు పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. అమ్మ కంటి ఆస్పత్రి నిర్వహిస్తూ, వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు. ఈయన ఎంపిక పట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. అభ్యర్థి పేరు : డాక్టర్ వరికూటి అమృతపాణి పార్టీ : వైఎస్ఆర్ సీపీ పుట్టిన తేదీ : 02-07-1960 విద్యార్హత : ఎంబీబీఎస్, ఎంఎస్ (ఆప్తమాలజీ) స్వస్థలం : సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా తల్లిదండ్రులు : కోటమ్మ, మాలకొండయ్య కుటుంబం : భార్య డాక్టర్ బేబీరాణి, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ గతానుభవం : కంటి వైద్య నిపుణునిగా చీరాల, ఒంగోలులో సేవలు. నాగార్జున యూనివర్సిటీ వారి ప్రతిభా పురస్కార్ గ్రహీత రాజకీయ నేపథ్యం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.