యూనివర్సిటీ క్రికెట్ జట్టు ఎంపిక
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక చింతలపాటి బాపిరాజు స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన వారిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ బాలుర క్రికెట్ జట్టుకు ఎంపిక చేసినట్టు జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ ప్రకటించారు.
జట్టుకు ఎంపికైంది వీరే..
ఎన్.వినయ్. బి.సాయి కృష్ణకాంత్, వి.వెంకటేశ్వరారవు(వేగవరం), ఎస్కే సమీర్, ఎస్బీ రోహన్ లక్ష్మణ్(రాజమహేంద్రవరం, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్,) వీఈఎస్ అఖిల్ వర్మ (డీఎన్ ఆర్, భీమవరం), టి.గోపి( పెనుగొండ), జి.నరేష్(జంగారెడ్డిగూడెం), ఎన్ .విద్యా సాగర్(కొత్తపేట), ఎల్.శ్రీనివాసరావు( గోపన్నపాలెం), ఎఎస్ఎస్ ప్రసాద్(అమలాపురం) కె.రోహిత్ కుమార్(కాకినాడ), ఆర్.సత్యనారాయణ( రాజమహేంద్రవరం), వి.జయరాజు(అనపర్తి), టి.నాగసాయి ప్రసాద్( నర్సాపురం), డి.శ్రీను(తుని), స్టాండ్ బైలుగా ఎస్కే జాఫర్(కాకినాడ), ఏడీఎస్స్ సంతోష్(రాజమహేంద్రవరం), ఎ.కిరణ్కుమార్( తణుకు), ఎల్.ధనుంజయ(రాజ మహేంద్రవరం)ఎంపిక చేసినట్టు సెలక్షన్ కమిటీ తరపున ఎస్కే సలీమ్ భాషా, బి.బాపిరెడ్డి తెలిపారు. ఈనెల 28న తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించనున్న అంతర యూనిర్సిటీల క్రికెట్ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని చెప్పారు. కార్యక్రమంలో పీడీ లతానియేలు పాల్గొన్నారు.