కాల్పులకు తెగబడ్డ పాక్ బలగాలు
శ్రీనగర్: పొరుగు దేశం పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంది. సరిహద్దులో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. మరోసారి కాల్పులకు తెగబడింది. ఉత్తర కశ్మీర్ లోని బారాముల్లా సెక్టార్ లో గురువారం సాయంత్రం పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్ ఎఫ్ జవాను మృతి చెందాడు.
ఐదు రోజుల వ్యవధిలోనే దాయాది దేశం మరోసారి కాల్పులకు దిగింది. ఆదివారం కశ్మీర్ లోయని నౌగామ్ సెక్టార్ వద్ద పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో బీఎస్ ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు.