Barbed wire
-
ముళ్ల పొదలో నిర్జీవ శిశువు
సాక్షి, పెద్దదోర్నాల: పేగు తెంచుకొని పుట్టిన ఆ పసి బిడ్డ ఏ తల్లికి భారమయ్యాడో ఏమో.. 9 నెలలు పాటు తల్లి కడుపులో పెరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ముళ్ల పొదల మధ్య నిర్జీవంగా కన్పించాడు. కుక్కలు పీక్కు తినటంతో ఓ కాలు, ఓ చేయి లేని శిశువు మాంసం ముద్దలా మారి మంగళవారం సాయంత్రం నిర్జీవంగా స్థానికుల కంట పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఐనముక్కల సమీపంలో కర్నూల్, గుంటూరు ప్రధాన రహదారి పక్కనే చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఐనముక్కల వద్ద నిరుపయోగంగా ఉన్న ఎమ్మార్సీ భవనం ఎదురుగా ఉన్న చిల్ల చెట్లలో శిశువు మృతదేహం పడి ఉన్న వార్త వ్యాపించడంతో పరిసర ప్రాంత ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆకర్షిణీయంగా ఉన్న ఆ మగ శిశువు పదునైన ముళ్ల కంపలో పడి ఉండటాన్ని చూసి.. చిన్నారిని అలా పడేయడానికి ఆ తల్లిదండ్రులకు ఎలా మనస్సు వచ్చిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు బతికి ఉండగానే భారమని అక్కడ పారవేశారా లేక పుట్టిన వెంటనే ప్రాణం పోవడంతో తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అని చర్చించుకున్నారు. కాగా చనిపోయిన మృతశిశువును అక్కడే ఉన్న మట్టికుప్పలో నామమాత్రంగా పూడ్చి వేయటం వల్ల మృత శిశువును కుక్కలు బయటకు లాక్కొనివచ్చి ఉంటాయని మరి కొందరు భావిస్తున్నారు. మృత శిశువు పడి ఉన్న విషయాన్ని పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్సై సుబ్బారావు మాట్లాడుతూ సమీప గ్రామంలో రెండు రోజుల క్రితం ఓ మహిళ మృత శిశువుకు జన్మనిచ్చి ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొంతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఈ ముళ్ల చెట్టు... వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!
ఫొటోలో కనిపిస్తున్న ముళ్లచెట్లను మీరు ఎప్పుడైనా చూశారా? మహారాష్ట్రలోని ఫల్టన్ ప్రాంతంలోని నింబ్కర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నారీ) అధ్యక్షురాలు నందినీ నింబ్కర్ ఈ మొక్క కల్పవృక్షానికి ఏమాత్రం తీసిపోదంటారు. అనడమే కాదు.. ఎక్కడో అమెరికాలోని టెక్సస్ ప్రాంతంలో కనిపించే మేలు రకం మొక్కల్ని తెచ్చి.. పెంచుకోమని రైతులకు పంచుతున్నారు. పెంచి ఏం చేసుకోమూ... అనేనా మీ సందేహం. ఒక్కొక్క ప్రయోజనం వరుసగా... కాయల రుచి అదుర్స్. పైగా మంచి పుష్టినిస్తాయి కూడా. కాండాలను తీసేస్తే మిగిలిన ఆకుల్లాంటి నిర్మాణాలు నేరుగా పశువుల దాణాగా వాడవచ్చు. లేదంటే నీళ్లు పుష్కలంగా ఉండే ఈ ఆకుల్ని, ఇతర భాగాలను కాస్మోటిక్స్, ప్లైవుడ్ తయారీలో వాడుకోవచ్చు. సోపులు, జిగురు, రంగుల తయారీలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుంది. అధికరక్తపోటుతోపాటు మధుమేహ చికిత్సకు అవసరమైన మందులు తయారు చేసేందుకు ఫార్మా కంపెనీలకూ దీని అవసరముంది. మరిన్ని వివరాలకు... జీఝఛజ్చుటఃజఝ్చజీ.ఛిౌఝ ఐడీకి మెయిల్ చేయండి!