Barbed wire fence
-
మయన్మార్ సరిహద్దుల్లో కంచె
గువాహటి: భారత్–మయన్మార్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మయన్మార్‌తో సరిహద్దులకు కూడా పూర్తి స్థాయిలో ముళ్ల కంచె నిర్మిస్తామని చెప్పారు. రెండు దేశాల సరిహద్దుల్లో ప్రజలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటును సైతం రద్దు చేసేందుకు యోచిస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. భారత్ –మయన్మార్ మధ్య అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరంల రాష్ట్రాల మీదుగా 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుంది. యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా 2018 నుంచి సరిహద్దులకు ఇరువైపులా 16 కిలోమీటర్ల దూరం వరకు వీసా లేకుండా ప్రజలు సంచరించేందుకు కేంద్రం వీలు కలి్పంచింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని మయన్మార్‌కు చెందిన వేలాది మంది భారత భూభాగంలో అక్రమంగా నివాసం ఉండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమిత్ షా ప్రకటనతో అక్రమ చొరబాట్లతో ఇక చెక్ పడనుంది. శనివారం అమిత్ షా అయిదు అస్సాం పోలీస్ కమాండో బెటాలియన్ల మొదటి బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌నుద్దేశించి, ఆ తర్వాత సలోనిబారిలో సశస్త్ర సీమాబల్ 60వ అవతరణ దినోత్సవంలో మాట్లాడారు. సరిహద్దులను కాపాడటంతోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా తమ విధులను ఎస్ఎస్బీ, ఇతర కేంద్ర బలగాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని కొనియాడారు. ప్రధాని మోదీ హయాంలో పదేళ్లలో దేశంలో శాంతిభద్రతలు గణనీయంగా మెరుగయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాలు రావాలంటే యువత లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, నేడు బీజేపీ పాలనలో ఉద్యోగాల కోసం ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్టపై ఆయన..దాదాపు 550 ఏళ్ల తర్వాత రామ్ లల్లా తిరిగి అయోధ్యకు రావడం యావత్ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. మూడేళ్లలో దేశంలో నక్సల్స్ ఉనికి లేకుండా చేస్తామని చెప్పారు. -
రైతు ఉద్యమం: వెనక్కి తగ్గిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతులు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు, ఫిబ్రవరి 7న తలపెట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమం నేపథ్యంలో రైతులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దు వద్ద రోడ్లపై భారీ ఎత్తున ఇనుప మేకుల ఏర్పాటు, కందకాలు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. సరిహద్దుల్లో అమర్చిన ఇనుప మేకులు, ముళ్ల కంచెలను తొలగించింది. ఈ ఘటనకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఢిల్లీ పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (రైతులతోనే యుద్ధమా? వైరలవుతున్న ఫోటోలు) అటు రైతు ఉద్యమకారులను కలవడానికి ఘజియా పూర్లోని ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న పది రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. శిరోమణి అకాలీదల్‌కు చెందిన హరి సిమ్రత్ కౌర్ బాదల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కు చెందిన సుప్రియ సులే, డీఎంకెకు చెందిన కనిమెళి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌతా రాయ్ ఉన్నారు. కాంక్రీట్ బారికేడ్స్, ముళ్ల కంచెల వెనుక రైతులున్న దృశ్యాలను చూసి షాకయ్యానంటూ హరిసిమ్రత్ పేర్కొన్నారు. (రైతు ఉద్యమం : ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక) మరోవైపు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. అటు ఈ వ్యవహారంపై రైతులతో చర్చలు జరిపాలని, చట్టాలను రద్దు చేయాలంటూ పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. #ghazipurborder #FarmersProtest https://t.co/zlrWJngT3d — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) February 4, 2021 -
ప్రమాదకర ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు
ధర్మసాగర్ : వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలతో ధర్మసాగర్ రిజర్వాయర్‌పై పలు ప్రమాదకరమైన ప్రదేశాల్లో ముళ్ల కంచెను, హెచ్చరిక బోర్డులను పోలీసులు ఏర్పాటు చేశారు. ఐదుగురు బీటెక్ విద్యార్థులు ఈ నెల 17న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ప్రదేశంతోపాటు, పైప్‌లైన్ పంపింగ్ ప్రదేశాల్లో ఇనుపముళ్ల కంచె ఏర్పాటు చేసి, ఎర్రజెండాలను పాతారు. ఉనికిచర్ల ఎస్ఆర్సీఎస్ పాఠశాల యాజమాన్యం, లయన్స్ క్లబ్ వారు రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో, రిజర్వాయర్‌లోని పలు ప్రాంతాల్లో గతంలో రిజర్వాయర్లోపడి మృతిచెందినవారి ఫొటోలతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేశారు. కాజీపేట ఏసీపీ జనార్దన్ మాట్లాడుతూ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ఇక్కడ ముళ్లకంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్ వద్ద పోలీ సుల పహారాను కొనసాగించి ఇక్కడికి వచ్చేవారిని నీటిలోకి దిగకుండా చూస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్‌రాంకుమార్, హెచ్‌సీ ఉమాకాంత్, పోలీస్ సిబ్బంది, ఎస్సార్సీఎస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.