ప్రమాదకర ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు
ప్రమాదకర ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు
Published Wed, Sep 21 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
ధర్మసాగర్ : వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలతో ధర్మసాగర్ రిజర్వాయర్‌పై పలు ప్రమాదకరమైన ప్రదేశాల్లో ముళ్ల కంచెను, హెచ్చరిక బోర్డులను పోలీసులు ఏర్పాటు చేశారు. ఐదుగురు బీటెక్ విద్యార్థులు ఈ నెల 17న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ప్రదేశంతోపాటు, పైప్‌లైన్ పంపింగ్ ప్రదేశాల్లో ఇనుపముళ్ల కంచె ఏర్పాటు చేసి, ఎర్రజెండాలను పాతారు. ఉనికిచర్ల ఎస్‌ఆర్‌సీఎస్ పాఠశాల యాజమాన్యం, లయన్స్ క్లబ్ వారు రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో, రిజర్వాయర్‌లోని పలు ప్రాంతాల్లో గతంలో రిజర్వాయర్‌లోపడి మృతిచెందినవారి ఫొటోలతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేశారు. కాజీపేట ఏసీపీ జనార్దన్ మాట్లాడుతూ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ఇక్కడ ముళ్లకంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్ వద్ద పోలీ సుల పహారాను కొనసాగించి ఇక్కడికి వచ్చేవారిని నీటిలోకి దిగకుండా చూస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్‌రాంకుమార్, హెచ్‌సీ ఉమాకాంత్, పోలీస్ సిబ్బంది, ఎస్సార్సీఎస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement