
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతులు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు, ఫిబ్రవరి 7న తలపెట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమం నేపథ్యంలో రైతులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దు వద్ద రోడ్లపై భారీ ఎత్తున ఇనుప మేకుల ఏర్పాటు, కందకాలు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. సరిహద్దుల్లో అమర్చిన ఇనుప మేకులు, ముళ్ల కంచెలను తొలగించింది. ఈ ఘటనకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే దీనిపై ఢిల్లీ పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (రైతులతోనే యుద్ధమా? వైరలవుతున్న ఫోటోలు)
అటు రైతు ఉద్యమకారులను కలవడానికి ఘజియా పూర్‌లోని ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న పది రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. శిరోమణి అకాలీదల్‌కు చెందిన హరి సిమ్రత్ కౌర్ బాదల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కు చెందిన సుప్రియ సులే, డీఎంకెకు చెందిన కనిమెళి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌతా రాయ్ ఉన్నారు. కాంక్రీట్ బారికేడ్స్, ముళ్ల కంచెల వెనుక రైతులున్న దృశ్యాలను చూసి షాకయ్యానంటూ హరిసిమ్రత్ పేర్కొన్నారు. (రైతు ఉద్యమం : ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక)
మరోవైపు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. అటు ఈ వ్యవహారంపై రైతులతో చర్చలు జరిపాలని, చట్టాలను రద్దు చేయాలంటూ పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
#ghazipurborder #FarmersProtest https://t.co/zlrWJngT3d
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) February 4, 2021
Comments
Please login to add a commentAdd a comment