Dharmasagar Reservoir
-
ప్రమాదకర ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు
ధర్మసాగర్ : వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలతో ధర్మసాగర్ రిజర్వాయర్‌పై పలు ప్రమాదకరమైన ప్రదేశాల్లో ముళ్ల కంచెను, హెచ్చరిక బోర్డులను పోలీసులు ఏర్పాటు చేశారు. ఐదుగురు బీటెక్ విద్యార్థులు ఈ నెల 17న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ప్రదేశంతోపాటు, పైప్‌లైన్ పంపింగ్ ప్రదేశాల్లో ఇనుపముళ్ల కంచె ఏర్పాటు చేసి, ఎర్రజెండాలను పాతారు. ఉనికిచర్ల ఎస్ఆర్సీఎస్ పాఠశాల యాజమాన్యం, లయన్స్ క్లబ్ వారు రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో, రిజర్వాయర్‌లోని పలు ప్రాంతాల్లో గతంలో రిజర్వాయర్లోపడి మృతిచెందినవారి ఫొటోలతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేశారు. కాజీపేట ఏసీపీ జనార్దన్ మాట్లాడుతూ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ఇక్కడ ముళ్లకంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్ వద్ద పోలీ సుల పహారాను కొనసాగించి ఇక్కడికి వచ్చేవారిని నీటిలోకి దిగకుండా చూస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్‌రాంకుమార్, హెచ్‌సీ ఉమాకాంత్, పోలీస్ సిబ్బంది, ఎస్సార్సీఎస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో విద్యార్థులు గల్లంతు
వరంగల్ : వరంగల్ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద శనివారం విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్ శివారులోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు శనివారం చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు యువకులతోపాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్న ఉప్పల శ్రీనిధి, రమ్య ప్రత్యూష, శ్రావ్యారెడ్డి(19), కర్నె శివసాయి (19), పొలినేని శివసాయికృష్ణా (20), పొలినేని వినూత్న (18) తో పాటు మరో యువకుడు కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. అయితే అదృష్టవశాత్తు ప్రత్యూషను మాత్రం పక్కనే ఉన్న మరో కళాశాల విద్యార్థులు కాపాడారు. విద్యార్థుల మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి శ్రావ్యారెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుల వివరాలు ఇవీ... ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి వెళ్లిన వారిలో.. శ్రావ్యారెడ్డి, కర్నె శివసాయి, ఉప్పల శ్రీనిధి, పొలినేని శివసాయికృష్ణ, పొలినేని వినూత్న మరణించారు. రామప్రత్యూషను మాత్రం చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాపాడగలిగారు. -
విహారయాత్రలో విషాదం..
రిజర్వాయర్‌లో నిట్ విద్యార్థి మృతి ధర్మసాగర్: స్నేహితులతో కలసి విహారానికి వచ్చిన ఆ విద్యార్థి అంతలోనే నీట మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామానికి చెందిన సామినేని వాసు, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్. వీరిలో నిఖిల్ (22) వరంగల్ నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఈసీఈ ఫైనలియర్ చదువుతున్నాడు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భం గా నిట్‌లో జరిగిన జెండావిష్కరణలో పాల్గొన్న అనంతరం ఆరుగురు మిత్రులతో కలిసి ఎన్ఐటీకి 10 కిలోమీటర్ల దూరంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌కు విహారం కోసం వెళ్లారు. రిజర్వాయర్ వద్ద మిత్రులతో కలసి నిఖిల్ కొద్దిసేపు సరదాగా గడిపాడు. అనంతరం జాలర్లు చేపలు పట్టడానికి ఉపయోగించే తెప్పను తీసుకుని ఒంటరిగా నీటిలో కొద్దిదూరం వెళ్లి ఫొటోలు దిగటానికి ప్రయత్నిస్తుండగా తెప్ప పట్టు తప్పంది. ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండ టం, నిఖిల్‌కు ఈత రాకపోవటంతో ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీంతో వీరిలో మిగతా ఇద్దరు విద్యార్థులతోపాటు, వీరి అరుపులు విని వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అతడిని రక్షించటానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే నిఖిల్ నీటిలో పూర్తిగా మునిగి మృతి చెందాడు. ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న కాజీపేట ఏసీపీ జనార్దన్, సీఐ రాజయ్య ఘట నాస్థలానికి చేరుకుని స్థానిక జాలర్ల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. విగతజీవిగా మారిన నిఖిల్‌ను చూసి మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక క్యాంపస్‌కు చెందిన విద్యార్థి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న నిట్ డైరక్టర్ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న సామినేని నిఖిల్ క్యాంపస్ ఇంటర్యూలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం పొందాడని, ఈ సెమిస్టర్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరాల్సి ఉందని తెలిపారు. తెలివైన విద్యార్థిగా పేరుపొంది, ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న నిఖిల్ మృతి చెందటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
దేవాదుల పైప్‌లైన్ లీక్
ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సమీపంలో దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్-2 పైప్‌లైన్ శుక్రవారం రెండుచోట్ల లీకైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి గండిరామారానికి ఫేజ్-2 పైప్‌లైన్ ద్వారా నీటిని తలిస్తున్నారు. ఈ క్రమంలో జానకిపురం గ్రామ సమీపంలో పైప్‌లైన్ ఎయిర్‌వాల్వ్‌లు రెండుచోట్ల లీక్ కావటంతో నీరు పెద్దఎత్తున పైకి చిమ్ముతూ పక్కనే ఉన్నపంటపొలాలకు వెళ్తోంది. -
దేవాదుల నుంచి నీటి విడుదల
►ఇన్‌టేక్‌వెల్ వద్ద 80 మీటర్లకు చేరిన నీరు ►మొదటి దశలో రెండు మోటార్లు ప్రారంభం ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని దేవాదుల వద్ద జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం రెండు మోటార్లను ప్రారంభించినట్టు ఇరిగేషన్ ఈఈ గంగాధర్ తెలిపారు. ఈనెల 17న దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వద్ద గోదావరి నీటి మట్టం 74 మీటర్లకు చేరడంతో నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం గోదావరి నీటి మట్టం 80 మీటర్లకు చేరడంతో వరంగల్ నగరానికి తాగునీటిని అందించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మోటార్లను ప్రారంభించారు. వరద నీరు ఇలాగే నిలకడగా ఉంటే.. రెండో దశలో మరో రెండు మోటార్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. దేవాదుల పంప్‌హౌస్ నుంచి నీరు పైపులైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నీరు వెనుకకు రాకుండా ఎయిర్ట్యాంక్లను సిద్ధం చేశారు. దేవాదుల ప్రాజెక్టు కింద అన్ని రిజర్వాయర్లకు నీరు అందే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.