ధర్మసాగర్ రిజర్వాయర్లో విద్యార్థులు గల్లంతు | Five students missing in dharmasagar reservoir | Sakshi
Sakshi News home page

ధర్మసాగర్ రిజర్వాయర్లో విద్యార్థులు గల్లంతు

Published Sat, Sep 17 2016 1:32 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

ధర్మసాగర్ రిజర్వాయర్లో విద్యార్థులు గల్లంతు - Sakshi

ధర్మసాగర్ రిజర్వాయర్లో విద్యార్థులు గల్లంతు

వరంగల్ : వరంగల్ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద శనివారం విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్ శివారులోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు శనివారం చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు.

మృతుల్లో ముగ్గురు యువకులతోపాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ మూడో సంవత్సరం చదువుతున్న ఉప్పల శ్రీనిధి, రమ్య ప్రత‍్యూష, శ్రావ్యారెడ్డి(19), కర్నె శివసాయి (19), పొలినేని శివసాయికృష్ణా (20), పొలినేని వినూత్న (18) తో పాటు మరో యువకుడు కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్కు సరదాగా ఈతకు వెళ్లారు.

ఈ క్రమంలో వారు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. అయితే అదృష్టవశాత్తు ప్రత్యూషను మాత్రం పక్కనే ఉన్న మరో కళాశాల విద్యార్థులు కాపాడారు. విద్యార్థుల మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి శ్రావ్యారెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు.

మృతుల వివరాలు ఇవీ...

ధర‍్మసాగర్ రిజర్వాయర్లోకి వెళ్లిన వారిలో.. శ్రావ్యారెడ్డి, కర్నె శివసాయి, ఉప్పల శ్రీనిధి, పొలినేని శివసాయికృష్ణ, పొలినేని వినూత్న మరణించారు. రామప్రత్యూషను మాత్రం చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాపాడగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement