Barbie Movie
-
Barbie OTT Release: తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
హాలీవుడ్ సినిమా 'బార్బీ' గతేడాది జూలై 21న రిలీజై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో చేరిపోయిన బార్బీ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో బార్బీ , ప్రపంచవ్యాప్తంగా రూ. 11వేల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో బార్బీ మూవీకి దాదాపు 150 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి తెలుగు వర్షన్ వచ్చేసింది.హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్ కిన్నన్, విల్ ఫెర్రెల్, అమెరికా ఫెరెరా, ఇస్సా రే, సిము లియులు బార్బీలో నటించారు. 96వ ఆస్కార్ అవార్డుల్లో ఎనిమిది నామినేషన్స్‌లలో చోటు దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రమే ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఇప్పుడు జియో సినిమా ఓటీటీలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అయితే రెంటల్ విధానంలో రూ. 149 రూపాయలు చెల్లించి చూడవచ్చు. -
ఆస్కార్ ఒరిజినల్ సాంగ్.. గతేడాది 'ఆర్ఆర్ఆర్'కి.. మరి ఇప్పుడు?
ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న కార్యక్రమంపై భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నాడు. ఎందుకంటే అనితర సాధ్యమైన ఈ పురస్కారాన్ని గతేడాది 'ఆర్ఆర్ఆర్' గెలుచుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ అందుకుంది. ఈసారి ఈ విభాగంలో గెలిచిందెవరు? ఏంటంత స్పెషల్? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 అవార్డుల వేడుక.. విజేతలు వీళ్లే) 'ఆర్ఆర్ఆర్' సినిమా గతేడాది ఆస్కార్ బరిలో నిలిచినప్పుడు చాలామంది మనకు ఓ ఆస్కార్ వస్తే బాగుంటుందని ఆశపడ్డారు. కోట్లాది మంది భారతీయల కల నెరవేరింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' పాటకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. దీంతో కోట్లాదిమంది మురిసిపోయారు. అయితే ఈసారి భారతీయ సినిమాలేం ఆస్కార్ బరిలో లేవు. కానీ గతేడాది 'ఆర్ఆర్ఆర్' గెలుచుకున్న విభాగంలో ఈసారి ఎవరికి అవార్డు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. 'ఓపెన్ హైమర్' సినిమాతో పోటీపడి బాక్సాఫీస్ దగ్గర వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టిన 'బార్బీ' సినిమాలోని 'వాట్ వజ్ ఐ మేడ్ ఫర్' పాటకు ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ వచ్చింది. బిల్లీ ఏలిష్ పాడిన పాట.. 'నాటు నాటు'తో పోలిస్తే చాలా డిఫరెంట్. మెలోడీగా సాగే ఈ గీతాన్ని మీరు ఓసారి వినేయండి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)