Barcelona Open Tournament
-
సైనా, శ్రీకాంత్ శుభారంభం
బార్సిలోనా (స్పెయిన్): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్... బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21–16, 21–14తో వైవోని లి (జర్మనీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 23–21, 21–18తో శుభాంకర్ డే (భారత్)ను ఓడించాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 18–21, 15–21తో డారెన్ లియు (మలేసియా) చేతిలో ఓడిపోగా... వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ మూడో గేమ్‌లో 12–14 స్కోరు వద్ద గాయంతో వైదొలిగాడు. జయరామ్ 21–14, 21–12తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) పై, సమీర్ వర్మ 21–12, 21–9తో క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 10–21, 21–16, 21–17తో క్రిస్టియాన్సెన్–బోయె (డెన్మార్క్) జోడీపై గెలిచింది. -
నాదల్‌దే బార్సిలోనా టైటిల్
బార్సిలోనా: సొంతగడ్డపై జరిగిన బార్సిలోనా ఓపెన్ టోర్నీని రఫెల్ నాదల్ (స్పెయిన్) కైవసం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడోసీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ నాదల్ 6–4, 6–1తో నాలుగోసీడ్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై అలవోక విజయం సాధించాడు. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. ఓవరాల్‌గా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి విజేతగా నిలిచాడు. గతవారమే మాంటెకార్లో ఓపెన్‌ను రికార్డు స్థాయిలో పదోసారి నెగ్గిన నాదల్.. బార్సిలోనా ఓపెన్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు. సెమీస్‌లో ప్రపంచ నం.1 ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించి జోరు కనబర్చిన థీమ్.. ఫైనల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చాడు. 14 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ నాదల్.. ఈనెలలో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు ఫామ్‌లోకి రావడం తన అభిమానుల్ని ఎంతగానో అలరిస్తోంది.