Basara tripul IT campus
-
వెనక్కు తగ్గని విద్యార్థులు
నిర్మల్/బాసర/ఇందల్వాయి (నిజామాబాద్ రూరల్): తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేయమంటూ బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు శుక్రవారం నాలుగో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. ప్రధాన ద్వారం వద్దనే రోజంతా బైఠాయించి, మౌనదీక్ష కొనసాగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రానున్నట్లు సమాచారం ఉండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బారికేడ్లను గేటుకు అడ్డంగా పెట్టారు. అయినా.. అందరి కళ్లుగప్పి, పంటచేల మీదుగా ట్రాక్టర్లో వచ్చిన రేవంత్‌రెడ్డి క్యాంపస్‌లోకి ప్రవేశించారు. విషయం తెలుసుకుని, విద్యార్థుల వద్దకు వెళ్లకముందే పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల దీక్షకు మద్దతుగా వర్సిటీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ, ఏబీవీపీ నాయకులను కూడా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని దిలావర్పూర్ టోల్‌ప్లాజా వద్ద, ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డిని నర్సాపూర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. ట్రిపుల్ఐటీ గోడదూకి ముళ్లపొదల్లో నుంచి వస్తున్న రేవంత్‌రెడ్డి ఆందోళనను ఆపే ప్రయత్నం.. రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్ఐటీ నాలుగు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. విద్యార్థులంతా ఒకేమాటపై నిలబడి, మూకుమ్మడిగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ రావాలంటూ ప్లకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. కొందరు పోలీసులు విద్యార్థులుగా వచ్చి ఆందోళనను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో విద్యార్థులు యూనిఫామ్ వేసుకుని, ఐడీకార్డులు చూపుతూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎర్రటి ఎండలో గొడుగులు పట్టుకుని మరీ దీక్షను కొనసాగించారు. పలువురు బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. చుట్టూ తిరిగి.. చేలు దాటి.. ఎవరూ ఊహించని విధంగా రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో అడుగు పెట్టారు. ఎక్కడా పోలీసులకు చిక్కకుండా.. పంట చేల మీదుగా ట్రిపుల్ఐటీ వెనుక గోడ దూకి అందులోకి అడుగుపెట్టారు. విద్యార్థుల వైపు వస్తుండగా, ఒక్కసారి పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. బలవంతంగా ఆయనను రెండోగేటు నుంచి లోకేశ్వరం పోలీస్‌స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా మీదుగా పంపించేశారు. ‘బాసర విద్యార్థుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలి. వారి ఆందోళన ఆగేలా చూడాలి. ఏదైతే లక్ష్యంతో ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారో దాన్ని పూర్తిచేయాలి’. – ట్విట్టర్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విద్యావ్యవస్థ నిర్వీర్యం ‘రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీల్లో, విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపర్చకుండా పేదవారికి విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. విద్యా సంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టకుండా, అవసరమైన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తూ సీఎం కేసీఆర్ విద్యార్థుల కష్టాలకు కారణమవుతున్నారు. కేసీఆర్‌కు రాజకీయ అవసరాల కోసం ప్రశాంత్ కిషోర్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లతో గంటల కొద్దీ ప్రగతి భవన్లో చర్చించేందుకు సమయం ఉంటుంది గానీ, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై దృష్టి సారించేందుకు సమయం ఎందుకు ఉండదు?. కేసీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రులను పంపి విద్యార్థులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. – ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద మీడియాతో రేవంత్ -
Telangana: రేవంత్ రెడ్డి అరెస్ట్
సాక్షి, నిర్మల్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బాసర పోలీసులు అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో.. శుక్రవారం బాసరకు చేరుకున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోలీసుల వలయాన్ని ఛేదించి రహస్యంగా గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆపై ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. అక్రమ అరెస్టుపై ఆయన మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
గేట్- 2014 టాపర్ల మనోగతాలు
ఆటోమొబైల్స్‌పై ఆసక్తితో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రవేశం. అదే విభాగంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడం అత్యున్నత విద్యతోనే సాధ్యం. ఇందుకు సాధనం.. గేట్లో మెరుగైన ర్యాంకు. దీన్ని గుర్తించి, ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించి.. ఆశించిన లక్ష్యం సాధించిన గేట్ మెకానికల్ అయిదో ర్యాంకర్, ఆంధ్రా వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ మెకానికల్ చివరి సంవత్సరం విద్యార్థి అల్లూరి సునీల్ వర్మ సక్సెస్ స్టోరీ.. శాస్త్రవేత్త కావాలన్నదే నా లక్ష్యం ఆర్ఎంపీ వైద్యుని కుమారుడు.. పదో తరగతి వరకు మారుమూల పల్లెలోనే విద్యాభ్యాసం.. అయినా పదిలో మండల టాపర్‌గా నిలిచి, బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు దక్కించుకున్నాడు. ఇప్పుడు గేట్-2014లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాడుతాడూరి నవీన్.. గేట్ మెకానికల్ 5వ ర్యాంకు: ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌తో మేనేజ్‌మెంట్‌లోనూ ఉన్నతవిద్యను అభ్యసించొచ్చు. కానీ అకడెమిక్స్కు అనుగుణమైన విభాగాల్లో ఉన్నత విద్య పూర్తి చేసినప్పుడే సార్థకత. అందుకే మొదట్నుంచీ ఇంజనీరింగ్‌లోనే కెరీర్‌కోసం దృష్టి సారించాను. ఫలితంగా మనం అకడెమిక్స్‌లో చదివిన అంశాలను క్షేత్రస్థాయిలో అన్వయం చేసేందుకు అవకాశం లభిస్తుంది. వృత్తి పరంగానూ సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనికితోడు చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్ పట్ల నెలకొన్న ఆసక్తి కూడా ఈ విభాగంలో అడుగుపెట్టేందుకు దోహదం చేసింది. అందుకే ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ఇతర బ్రాంచ్‌లలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మెకానికల్ బ్రాంచ్‌లోనే చేరాను. అకడెమిక్స్.. గేట్ సిలబస్ సమన్వయంతో: గేట్ ప్రిపరేషన్ కోసం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం నుంచి పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. అకడెమిక్ సిలబస్‌ను గేట్ సిలబస్‌తో సమన్వయం చేసుకుని ప్రిపరేషన్ సాగించాను. అభ్యర్థుల కోణంలో గేట్ పరంగా లభించే ప్రయోజనం.. అకడెమిక్ సిలబస్‌లోని అంశాల నుంచే గేట్లో ప్రశ్నలు ఉంటాయి. దీంతో అకడెమిక్స్‌లో పట్టు సాధిస్తే గేట్లో విజయం సులువైనట్లే. ఇదే వ్యూహం అనుసరించి.. బీటెక్ అకడెమిక్స్‌తో సమాంతరంగా రోజుకు రెండు గంటలు.. పరీక్షకు ఆరు నెలల ముందు నుంచి ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు చొప్పున చదివాను. గేట్ సిలబస్‌లోని అంశాలపై ముందుగా స్పష్టత ఏర్పరచుకోవాలి. అప్పుడు ప్రిపరేషన్ పరంగా సమయం ఆదా అవడంతోపాటు ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. ఆన్లైన్ టెస్ట్‌లు.. అదనపు ప్రయోజనం: గేట్లో విజయానికి ఉపకరించే మరో ముఖ్య సాధనం ఆన్లైన్ టెస్ట్‌లకు హాజరవ్వడం. ఈ ఏడాది నుంచి గేట్ అన్ని సబ్జెక్ట్‌లకు ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించడం మొదలైంది. ఈ నేపథ్యంలో మాక్-ఆన్లైన్ టెస్ట్‌లకు హాజరవ్వడం కూడా ఎంతో ఉపయోగపడింది. ఎంట్రన్స్ తేదీకి ముందు నెల రోజుల సమయాన్ని పూర్తిగా రివిజన్‌కు కేటాయించాను. ఇలా ప్రతి దశలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఈ ర్యాంకు సాధించగలిగాను. వాస్తవానికి వందలోపు ర్యాంకు వస్తుందని ఊహించాను కానీ టాప్-10లో నిలవడం అనిర్వచనీయ ఆనందాన్ని కలిగిస్తోంది. ఐఐఎస్సీ బెంగళూరు లేదా ఐఐటీ-ముంబై: ప్రస్తుత ర్యాంకుతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) లేదా ఐఐటీ-ముంబైలలో మెషీన్ డిజైన్ స్పెషలైజేషన్‌లో ప్రవేశం పొందాలని భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇదే విభాగంలో ఆర్ అండ్ డీలో కెరీర్ లక్ష్యంగా ఎంచుకున్నాను. ఈ ఆశయంతోనే.. ఎల్ అండ్ టీ, విప్రో సంస్థల్లో క్యాంపస్ సెలక్షన్స్ లభించినా వదులుకుని గేట్ కోసం ఉపక్రమించాను. కచ్చితత్వంతో చదవాలి: గేట్ ప్రిపరేషన్ పరంగా ఔత్సాహికులకు ఇచ్చే సలహా.. ఎంత చదివామనే దానికంటే చదివిన అంశాలను ఎంత బాగా ఒంటబట్టించుకున్నామన్నదే ప్రధానమని గుర్తించాలి. ముఖ్యంగా నెగెటివ్ మార్కింగ్ ఉన్న గేట్లో ఇది కీలకం. చాలా మంది విద్యార్థులు మొత్తం సిలబస్‌ను పూర్తి చేయాలని.. అప్పుడే సత్ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో ఉంటారు. దీనివల్ల అందుబాటులో ఉన్న సమయంలో అన్ని అంశాలు పూర్తి చేయలేక చివరి నిమిషంలో మానసిక ఆందోళనకు గురవుతారు. కానీ సిలబస్‌లో 80 నుంచి 85 శాతం అంశాలను కచ్చితత్వంతో పూర్తిచేస్తే సరిపోతుంది. దీర్ఘకాలిక ప్రణాళికతో బీటెక్‌లో రెండో ఏడాది చివరి నుంచి లేదా మూడో ఏడాది నుంచి గేట్ కోసం ఉపక్రమిస్తే సత్ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా గేట్ ఆన్లైన్ స్లాట్ సమయం కూడా ఒక నెలరోజుల ముందే తెలుస్తుంది. ఆ సమయంలోనే మాక్ టెస్ట్‌లు, ఆన్లైన్ టెస్ట్‌లకు హాజరైతే మానసికంగా సంసిద్ధత లభిస్తుంది. గేట్ ఈసీఈ 8వ ర్యాంకు మా స్వస్థలం కరీంనగర్ జిల్లా, కమలాపూర్ మండలంలోని శనిగరం. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. 2008లో పదో తరగతిలో 545 మార్కులతో మండల టాపర్‌గా నిలిచాను. ఫలితంగా ఆ ఏడాదే మొదలైన ఏపీ ట్రిపుల్ ఐటీల్లో బాసర క్యాంపస్‌లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశం లభించింది. మొదటి రెండేళ్లు అందరికీ ఉమ్మడిగా ఉండే పీయూసీ (ఎంబైపీసీ) చదివాను. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ పరికరాలపై నాకు చాలా ఆసక్తి. దాంతో వాటి పనితీరు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌ను ఎంచుకున్నాను. స్ఫూర్తి నింపిన మాటలు: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మా బ్యాచ్ ప్రారంభమైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంపస్‌కు వచ్చారు. ఆ సందర్భంగా..‘‘మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశాం. ఇందుకోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని కూడా నెలకొల్పాం. తొలుత ఒక్కో క్యాంపస్‌కు వేయి సీట్లు మాత్రమే అనుకున్నప్పటికీ.. మీలాంటి విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల సీట్లకు పెంచాం. మీరంతా పెద్ద చదువులు చదువుకొని ప్రయోజకులు అయినప్పుడే మా ఆశలు నెరవేరుతాయి’’ అంటూ ఆయన ఉద్విగ్నంగా మాట్లాడారు. ఆయన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఆ స్ఫూర్తి పట్టుదలగా చదవడానికి సహకరించింది. గేట్ లక్ష్యంగా: ట్రిపుల్ ఐటీలలోని ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో చేరిన రెండో ఏడాది నాకు గేట్ గురించి తెలిసింది. గేట్ ప్రాధాన్యాన్ని వివరించడంలో ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల పాత్ర ఎంతో ఉంది. అందులో రాణించేందుకు అవసరమైన మెటీరియల్‌ను సైతం అందుబాటులో ఉంచారు. అప్పటికే ఎలక్ట్రానిక్స్ అంటే సహజమైన ఆసక్తి ఉండటంతో ఉన్నత విద్య దిశగా ‘గేట్’ను లక్ష్యంగా ఎంచుకున్నాను. బీటెక్+గేట్.. సమాంతర ప్రిపరేషన్: గేట్లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా చదవడం ప్రారంభించాను. ఒకవైపు బీటెక్ కోర్సు సబ్జెక్టులు చదువుతూనే గేట్‌కు ప్రిపేర్ కావడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. బీటెక్‌లో కోర్ సబ్జెక్టులను మొదట్నుంచీ లోతుగా అధ్యయనం చేయడం ఎంతో లాభించింది. మరోవైపు.. ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించిన వీడియో లెక్చర్స్‌ను అందించేవారు. ఇది కూడా ఎంతో ఉపయోగపడింది. ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ విభాగాల విషయంలో కొంత ఇబ్బందిపడ్డాను. లేకుంటే మరిన్ని మార్కులు వచ్చేవి. మాక్ టెస్ట్‌లతో మరింత పదును: గేట్ పరీక్షపై అవగాహన కోసం 2013 వేసవి సెలవు ల్లో రెండు నెలలు శిక్షణ తీసుకున్నాను. ఆ సందర్భం గా నిర్వహించిన మాక్ టెస్ట్‌లు బాగా ఉపయోగపడ్డాయి. వీటివల్ల పరీక్షలో ప్రశ్నలు అడిగే తీరు, వాటి క్లిష్టత తదితర అంశాలపై అవగాహన వచ్చింది. లోతుగా అధ్యయనం: గేట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్ష అంటే చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతారు. ఈ క్రమంలో మార్కెట్లో లభించే ప్రతి మెటీరియల్‌ను చదవాలని, లేదంటే విఫలమవుతామనే అపోహలో ఉంటారు. బీటెక్ తొలి ఏడాది నుంచే సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేస్తే మంచి ర్యాంకు సాధించడం సులభమే. రోజుకు నాలుగైదు గంటల ప్రిపరేషన్‌తో బీటెక్ సబ్జెక్ట్‌లు, గేట్ ప్రిపరేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి, గేట్‌కు అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఈ విషయంలో సీనియర్లు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. నేను ఇదే ఫార్ములా అనుసరించాను. శాస్త్రవేత్త.. నా లక్ష్యం: ప్రస్తుత గేట్ ర్యాంకుతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరులో మైక్రో ఎలక్ట్రానిక్స్ చదవాలని భావిస్తున్నాను. అది పూర్తయ్యాక డీఆర్డీఓలో సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడమే లక్ష్యం. ఇది వ్యక్తిగత సంతృప్తిని ఇవ్వడంతోపాటు సమాజానికి సేవ చేసేందుకు కూడా దోహదపడుతుంది. నా సలహా: భవిష్యత్తులో గేట్ రాసే విద్యార్థులకు ఒకటే సలహా.. బీటెక్‌లోని ప్రతి సబ్జెక్టును కాన్సెప్ట్స్ ఆధారితంగా చదవండి. కాన్సెప్ట్లపై అవగాహన పొందుతూ పాత ప్రశ్న పత్రాలను బాగా ప్రాక్టీస్ చేయండి. తద్వారా ఓ వైపు బీటెక్, మరోవైపు గేట్ రెండు గమ్యాలు ఒకే సమయంలో చేరుకోవచ్చు. అకడమిక్ నేపథ్యం: పదో తరగతి: 545 మార్కులు (2008లో) ట్రిపుల్ ఐటీలో పీయూసీ: 2010లో 95.7శాతం (ఎంబైపీసీ). {పస్తుతం బీటెక్ ఈసీఈ చివరి సెమిస్టర్. ఇప్పటి వరకు 90.6 శాతం మార్కులు వచ్చాయి.