basavanagauda Patil yatnal
-
సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి,బళ్లారి: రాష్ట్ర రాజకీయాల్లో ఈనెల 17 తర్వాత పెనుమార్పులు చోటు చేసుకుంటాయని, పలువురు ఎమ్మెల్యేలు సీఎంపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని సీనియర్ బీజేపీ నేత, ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ పేర్కొన్నారు. ఆయన బెళగావి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ ఎవరెవరి బలం ఏమిటో, బలహీనత ఎంత ఉందో కాలమే నిర్ణయిస్తుందన్నారు. సూర్యచంద్రులు ఉండే వరకు ఏమైనా యడియూరప్ప మాత్రమే సీఎంగా కొనసాగుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆయనను సీఎంగా హైకమాండ్ కొనసాగించడమే అదృష్టంగా భావించాలన్నారు. మే 2 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చన్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన వ్యక్తిని సీఎంని చేయడానికి పార్టీ నేతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే కుమారునిపై దాడి తుమకూరు: తురువేకెరె ఎమ్మెల్యే జయరాం కుమారుడు తేజు జయరాంపై మంగళవారం రాత్రి దుండగులు దాడి చేశారు. ఈ ఘటన గుబ్బి తాలూకా నెట్టికెరె క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాలు... తేజు జయరాం బెంగళూరు నుంచి స్వగ్రామం అంకల కొప్పకు కారులో వస్తుండగా దుండగులు అడ్డగించి గొడవకు దిగి దాడి చేశారు. ఇంతలోనే స్థానికులు రావడంతో దుండగులు ఉడాయించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తేజును ఆస్పత్రికి తరలించారు. కాగా దుండగులు వదలి వెళ్లిన కారును పరిశీలించగా బ్యాట్, కారంపొడి, పెద్ద కత్తి లభ్యమయ్యాయి. సీజ్ చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: ముఖ్యమంత్రికి హెలికాప్టర్ కష్టాలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: బీజేపీ నేతల దుందుడుకు వ్యాఖ్యలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేసిన హిందువుల కోసం మాత్రమే పని చేయాలని, ముస్లింలకు పనులు చేయవద్దని కార్పొరేటర్లకు సూచించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్పొరేటర్లను కలిసిన తాను వారందరూ తనకు ఓటువేసిన హిందువుల కోసం పనిచేయాలని, ముస్లింలకు కాదని తాను విస్పష్టంగా చెప్పానని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే చెప్పడం కనిపించింది. హిందువుల కోసమే పని చేయాలంటూ అక్కడ చేరిన వారు గట్టిగా బదులివ్వడం కనిపించింది. టోపీ, బుర్ఖాలు ధరించి వచ్చే వారిని అనుమతించరాదని, తన కార్యాలయంలో, తన పక్కన వారిని అనుమతించరాదని సిబ్బందికి చెప్పానన్నారు. జూన్ 4న విజయపురలో జరిగిన ఓ కార్యక్రమంలో పాటిల్ యత్నాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. యత్నాల్ గతంలో ఎంపీగా, వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. -
కేంద్ర మాజీ మంత్రి యత్నాల్ అరెస్ట్
మత ఘర్షణ కేసు .. 26న బీజాపురలో విజయోత్సవ ర్యాలీ నేపథ్యంలో అల్లర్లు యత్నాల్, అతని అనుచరులే కారణమని గుర్తించిన పోలీసులు వారిపై పలు కేసులు మహారాష్ర్టలో తలదాచుకున్న నిందితుల అరెస్ట్ బెంగళూరు, న్యూస్‌లైన్ : పధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజాపురలో ఈ నెల 26న జరిగిన మత ఘర్షణకు కారణమంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బసవనగౌడ పాటిల్ యత్నాల్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఐజీపీ భాస్కర్‌రావు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు .. మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజాపురలో 26న బసవనగౌడ పాటిల్ యత్నాల్ నే తృత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. గాంధీ చౌక్ నుంచి బసవేశ్వర సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అయితే మార్గ మధ్యలో ఒక మార్కెట్ దగ్గర ఒక వర్గం వారితో బీజేపీ నేతలు గొడవ పడ్డారు. అది కాస్త మత ఘర్షణకు దారితీసింది. ఆస్తి నష్టం చాలా జరిగింది. ఈ అల్లర్లకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని క్లిప్పింగ్గులను పోలీసు అధికారులు పరిశీలించారు. ఓ వర్గం వారిని యత్నాల్, అతని అనుచరులు రెచ్చగొట్టడం వల్లే ఈ అల్లర్లు జరిగాయని గుర్తించారు. పలువురు ఫిర్యాదు చేయడంతో యత్నాల్, అతని ఐదుగురు అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీన్ని గుర్తించిన యత్నాల్ అనుచరుల సహా పరారై.. మహారాష్ట్ర కోల్లాపురలోని ఓరియంటల్ హోటల్ తప్పుడు సమాచారం ఇచ్చి తలదాచుకున్నారు. విషయాన్ని గుర్తించిన పోలీసులు యత్నాల్, అతని ఐదుగురు అనుచరులను బీజాపుర డీఎస్పీ బాలరాజ్ నే తృత్వంలో బుధవారం అరెస్ట్ చేశారు. వారందనీ బీజాపురలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని ఐజీపీ భాస్కర్‌రావు తెలిపారు. ఇప్పటికీ బీజాపురలో నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని చెప్పారు.