Baseball bat
-
వామ్మో కట్టెముక్కను విరిచినట్లు.. బ్యాట్‌ను సింపుల్‌గా
మనుషులకు కోపం సహజం. అందులో కొంతమంది కోపాన్ని తట్టుకోవడం కష్టం. కోపంలో ఉన్న వ్యక్తి తనకు ఏది ఎదురుపడితే దానిని విరిచేయడమో లేక పగులగొట్టడమో చేస్తుంటారు. తాజాగా బేస్‌బాల్ ఆటలో తాను ఔటయ్యాననే కోపంలో బ్యాట్‌ను రెండు ముక్కలు చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదో కట్టెముక్కును విరగొట్టినట్లుగా సింపుల్‌గా బ్యాట్‌ను విరిచేయడం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళితే.. న్యూయార్క్ మెట్స్, మియామి మార్లిన్స్ మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూయార్క్ మెట్స్ 5-3 తేడాతో మియామి మార్లిన్స్పై విజయం అందుకుంది. అయితే మ్యాచ్ విజయం కంటే న్యూయార్క్ మెట్స్ స్టార్ పీట్ అలోన్సో చర్య ఎక్కువ హైలైట్ అయింది. 8వ ఇన్నింగ్స్‌లో పీట్ అలోన్సో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. కీలక సమయంలో ఔటయ్యానన్న బాధ పీట్ అలోన్సో కళ్లలో స్పష్టంగా కనిపించింది. అంతే ఉగ్రంగా మారిపోయిన పీట్.. ఏదో కట్టెముక్కను విరిచేసిట్లు బ్యాట్‌ను తొడ బాగంలో పెట్టుకొని సింపుల్‌గా రెండు ముక్కలు చేసి పారేశాడు. దీనికి సంబంధించిన వీడియోపై మీరు ఒక లుక్కేయండి. Pete was not happy. pic.twitter.com/iQ7hKWm0Qf — Bally Sports Florida & Bally Sports Sun (@BallySportsFL) June 25, 2022 చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? -
ఆస్ట్రేలియా కెప్టెన్ ఇరగదీశాడు!
న్యూయార్క్: ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా క్రికెట్ ప్రేమికులకు చెప్పాల్సిన అవసరం లేదు. మైదానం నలుమూలల షాట్లు బాదుతూ పరుగులు పిండుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. స్మిత్ వికెట్ తీయడానికి బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా ఆడుతూ జట్టును గట్టెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. అత్యున్నత ప్రతిభతో స్వల్ప కాలంలోనే ఆసీస్ జట్టుకు నాయకుడిగా ఎదిగారు. న్యూయార్క్‌లో తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో స్మిత్ పోస్టు చేశారు. ఒక్క బంతిని కూడా వదలకుండా స్మిత్ ఆడిన షాట్లు అభిమానులను అలరిస్తున్నాయి. అయితే క్రికెట్ బ్యాటుతో కాకుండా సన్నగా ఉండే బేస్‌బాల్ బ్యాటుతో ఒక్క బాల్ కూడా మిస్ కాకుండా స్మిత్ కొట్టడం విశేషం. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయినా ఎడమచేతితోనూ బంతిని బలంగా బాదడం మరో విశేషం. టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న స్మిత్ వన్డేల్లో 13వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన ఆయన ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గానూ రాణించారు. That's outta here ⚾️⚾️⚾️ A post shared by Steve Smith (@steve_smith49) on Jun 27, 2017 at 7:24pm PDT -
కారుపై కోపం..!
వద్దన్నా వదిలేసి వెళ్లిపోయాడనో... ఫ్లాష్‌బ్యాక్‌లో మరేదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చిందో... మొత్తానికి బాయ్‌ఫ్రెండ్ శామ్యూల్‌పై కోపంతో అతని మెర్సిడెజ్ కారును తుక్కు చేసింది స్టార్ ర్యాపర్ నికీ మినాజ్. తన జతగాడితో అప్పటివరకూ తీవ్రంగా కొట్లాడి, విడిపోయిన ఈ అనకొండ సింగర్.. అదే టెంపోను కంటిన్యూ చేసింది. పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌ను పట్టుకుని... ముద్దుగా ఉన్న కారును చెత్తగా మార్చేసింది. కసి తీరలేదేమో.. అతగాడి డ్రెస్స్టూ తీసుకెళ్లి గార్బేజీలో పడేసింది!