basket ball champion
-
అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా?
లాస్ వెగాస్: ప్రఖ్యాత పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కు లాస్ వెగాస్ లోని ఓ హోటల్లో ఘోర అవమానం జరిగింది. ప్రముఖ ఎన్బీఏ స్టార్ ఫ్రాన్స్ కు చెందిన విక్టర్ వెంబన్యామ(19)కు వీరాభిమాని అయిన బ్రిట్నీ స్పియర్స్ అతడితో ఒక ఫోటో కోసం వెంటపడగా సెక్యూరిటీ వారు ఆమెను నెట్టివేశారు. ఈ సంఘటన వైరల్ కావడంతో ఒకప్పుడు తన పెర్ఫార్మెన్స్ లతో యువతను ఉర్రూతలూగించిన క్రేజీ పాప్ స్టార్ కు ఇంతటి అవమానమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రిట్నీ స్పియర్స్ డిన్నర్ చేయడానికి వెగాస్ లోని అరియా హోటల్ కి వెళ్ళింది. అక్కడ అనుకోకుండా ప్రముఖ స్పర్స్ ఆటగాడు విక్టర్ వెంబన్యామ కనపడటంతో అతడితో ఒక ఫోటో తీసుకోవాలని అతడి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఎన్బీఏ స్టార్ చుట్టూ అభిమానులు మూగడంతో బ్రిట్నీ అతని వీపు మీద వెనుకనుండి చరిచింది. అక్కడే ఉన్న వెంబన్యామ సెక్యూరిటీ చీఫ్ డామియెన్ స్మిత్ ఇది గమనించి ఆమెను బలంగా తోసేశాడు. దీంతో బ్రిట్నీ స్పియర్స్ కింద పడిపోయింది. ఆమె కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. తర్వాత బ్రిట్నీ లేచి తన టేబుల్ వద్దకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సెక్యూరిటీ చీఫ్ స్మిత్ ఆమె దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. ఆ సమయంలో స్మిత్ ను క్షమించినట్టే కనిపించిన బ్రిట్నీ స్పియర్స్ అతడితో కొద్దిసేపు నవ్వుతూ సంభాషించింది కూడా. కానీ డిన్నర్ పూర్తయిన తర్వాత నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి జరిగిందంతా నివేదించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో వెంబన్యామ మాట్లాడుతూ.. ఎవరో తనను వెనుక నుండి బలంగా హత్తుకున్నారని, సెక్యూరిటీ వారిని బలంగా నెట్టి వేశారని తెలుసు.. తర్వాత తెలిసింది వారు తోసింది బ్రిట్నీ స్పియర్స్ నని. కానీ ఆమె చెబుతున్నట్లుగా ఆమె మెల్లగా తట్టలేదు బలంగా హత్తుకుందని వివరణ ఇచ్చాడు. దీనికి మళ్ళీ బ్రిట్నీ స్పందిస్తూ.. తాను వెంబన్యామను బలంగా కొట్టలేదని సున్నితంగా పిలిచానని చెబుతూ విషయమంతా వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కూడా చదవండి: భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు.. View this post on Instagram A post shared by Maria River Red (@britneyspears) -
బాస్కెట్‌బాల్ చాంప్ వీజేఐఈటీ
ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజిల స్పోర్ట్స్‌ఫెస్ట్ సాక్షి, హైదరాబాద్: వీఎన్ఆర్-వీజేఐఈటీ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజిల ‘స్పోర్ట్స్‌ఫెస్ట్’ శుక్రవారంతో ముగిసింది. బాస్కెట్‌బాల్ పురుషుల, మహిళల విభాగాల్లో ఆతిథ్య జట్లు విజేతలుగా నిలిచాయి. జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన మహిళల జట్టు వాలీబాల్ టైటిల్‌ను గెలువగా, హితమ్ కాలేజి పురుషుల ట్రోఫీ సాధించింది. బాస్కెట్‌బాల్ పురుషుల ఫైనల్లో వీఎన్ఆర్-విజేఐఈటీ జట్టు 52-44తో సెయింట్ మార్టిన్స్ జట్టుపై గెలుపొందింది. మహిళల ఫైనల్ పోరు కూడా ఈ రెండు కాలేజి జట్ల మధ్యే జరిగింది. ఇందులో వీఎన్ఆర్ జట్టు 23-19తో సెయింట్ మార్టిన్స్ జట్టుపై చెమటోడ్చి నెగ్గింది. వాలీబాల్ పురుషుల ఈవెంట్ తుదిపోరులో హితమ్ కాలేజి 25-20, 25-21తో సీఎంఆర్ఐటీపై గెలువగా, మహిళల విభాగంలో జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజి 25-20, 25-19తో భోజిరెడ్డి కాలేజిపై నెగ్గింది. బ్యాడ్మింటన్ మహిళల టీమ్ టైటిల్‌ను ఎస్ఎస్ఎన్ జట్టు గెలుపొందగా, వీఎన్ఆర్-వీజేఐఈటీ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల ట్రోఫీని ఎస్ఎస్ఎన్ జట్టు చేజిక్కించుకుంది. త్రోబాల్ పోటీల్లో జీఎన్ఐటీఎస్, వీఎన్ఆర్-వీజేఐఈటీ, భోజిరెడ్డి కాలేజిలు తొలి మూడు స్థానాలు పొందాయి. అథ్లెటిక్స్ ఫలితాలు పురుషుల 200 మీ. స్ప్రింట్: 1. లక్ష్మీకాంత్ (సీబీఐటీ), 2. కల్యాణ్ (బీవీఆర్ఐటీ), 3. శ్రీకర్ (వీఎన్ఆర్); మహిళల 200 మీ. స్ప్రింట్: 1. హన్నా ప్రభోదిని (విజ్ఞాన్), 2. మేఘ (సెయింట్ మార్టిన్స్), 3. సంజన (ఎంఎల్ఆర్ఐటీ); పురుషుల 800 మీ. పరుగు: 1.లోకేశ్ (శ్రీ హిందు), 2. హరీశ్ (శ్రీ హిందు), 3. ప్రశాంత్ (నోవా).