ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజిల స్పోర్ట్స్‌ఫెస్ట్
సాక్షి, హైదరాబాద్: వీఎన్‌ఆర్-వీజేఐఈటీ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజిల ‘స్పోర్ట్స్‌ఫెస్ట్’ శుక్రవారంతో ముగిసింది. బాస్కెట్‌బాల్ పురుషుల, మహిళల విభాగాల్లో ఆతిథ్య జట్లు విజేతలుగా నిలిచాయి. జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన మహిళల జట్టు వాలీబాల్ టైటిల్‌ను గెలువగా, హితమ్ కాలేజి పురుషుల ట్రోఫీ సాధించింది. బాస్కెట్‌బాల్ పురుషుల ఫైనల్లో వీఎన్‌ఆర్-విజేఐఈటీ జట్టు 52-44తో సెయింట్ మార్టిన్స్ జట్టుపై గెలుపొందింది. మహిళల ఫైనల్ పోరు కూడా ఈ రెండు కాలేజి జట్ల మధ్యే జరిగింది. ఇందులో వీఎన్‌ఆర్ జట్టు 23-19తో సెయింట్ మార్టిన్స్ జట్టుపై చెమటోడ్చి నెగ్గింది. వాలీబాల్ పురుషుల ఈవెంట్ తుదిపోరులో హితమ్ కాలేజి 25-20, 25-21తో సీఎంఆర్‌ఐటీపై గెలువగా, మహిళల విభాగంలో జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజి 25-20, 25-19తో భోజిరెడ్డి కాలేజిపై నెగ్గింది. బ్యాడ్మింటన్ మహిళల టీమ్ టైటిల్‌ను ఎస్‌ఎస్‌ఎన్ జట్టు గెలుపొందగా, వీఎన్‌ఆర్-వీజేఐఈటీ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల ట్రోఫీని ఎస్‌ఎస్‌ఎన్ జట్టు చేజిక్కించుకుంది. త్రోబాల్ పోటీల్లో జీఎన్‌ఐటీఎస్, వీఎన్‌ఆర్-వీజేఐఈటీ, భోజిరెడ్డి కాలేజిలు తొలి మూడు స్థానాలు పొందాయి.
అథ్లెటిక్స్ ఫలితాలు
పురుషుల 200 మీ. స్ప్రింట్: 1. లక్ష్మీకాంత్ (సీబీఐటీ), 2. కల్యాణ్ (బీవీఆర్‌ఐటీ), 3. శ్రీకర్ (వీఎన్‌ఆర్); మహిళల 200 మీ. స్ప్రింట్: 1. హన్నా ప్రభోదిని (విజ్ఞాన్), 2. మేఘ (సెయింట్ మార్టిన్స్), 3. సంజన (ఎంఎల్‌ఆర్‌ఐటీ); పురుషుల 800 మీ. పరుగు: 1.లోకేశ్ (శ్రీ హిందు), 2. హరీశ్ (శ్రీ హిందు), 3. ప్రశాంత్ (నోవా).
బాస్కెట్‌బాల్ చాంప్ వీజేఐఈటీ
Published Sat, Mar 8 2014 12:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement