సాక్షి, హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)లో శుక్రవారం ‘స్పోర్ట్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. తొలి రోజు ఫుట్‌బాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఐఎంటీ-నాగ్‌పూర్, ఐపీఈ-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నాగ్‌పూర్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐపీఈ-హైదరాబాద్ జట్టు 78 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఐఎంటీ-నాగ్‌పూర్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది.
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఐఎంటీ-హైదరాబాద్ జట్టు 5-0 గోల్స్ తేడాతో మేనేజ్ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఈ చాంపియన్‌షిప్‌ను ఐఎంటీ-హైదరాబాద్ డెరైక్టర్ పాండురంగారావు లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బిజినెస్ స్కూల్ జట్లు పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో సుమారు 300 క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ఐఎఫ్‌ఎంఆర్ (చెన్నై), ఐఎంటీ (నాగ్‌పూర్), క్రిస్ట్ యూనివర్సిటీ, ఎన్‌ఐసీఎంఏఆర్ (పుణె)లతో పాటు హైదరాబాద్‌లోని ఎన్‌ఎంఐఎంఎస్, ఐబీఎస్, ఐపీఈ తదితర జట్లు తలపడుతున్నాయి.
ఐఎంటీ నాగ్‌పూర్ గెలుపు
Published Sat, Jan 18 2014 12:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement