sports festival
-
సూపర్ స్టార్‌ను ఎగిరి తన్నాడు!
హాలీవుడ్ సూపర్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌత్ ఆఫ్రికా, జోహెన్స్ బర్గ్‌లో జరుగుతున్న ఓ స్పోర్ట్స్ ఫెస్టివల్‌కు హాజరైన ఆర్నాల్డ్ ను ఓ వ్యక్తి వెనకు నుంచి బలంగా తన్నాడు. క్రీడాకారులు స్కిప్పింగ్ ఆడుతుండగా ఆర్నాల్డ్ అక్కడ ఉన్న అభిమానులతో సెల్పీలు దిగేందుకు ముందుకు వచ్చాడు. ఆ సమయంలో ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆర్నాల్డ్ ను బలంగా తన్నాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అతడికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన ఆర్నాల్డ్ వీడియోలో చూసే వరకు తనను వెనుక నుంచి ఓ వ్యక్తి తన్నిన విషయం తెలియదని.. కేవలం అక్కడున్న వారు తోపులాటలో తన మీద పడ్డారని భావించానని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి Thanks for your concerns, but there is nothing to worry about. I thought I was just jostled by the crowd, which happens a lot. I only realized I was kicked when I saw the video like all of you. I’m just glad the idiot didn’t interrupt my Snapchat. — Arnold (@Schwarzenegger) 18 May 2019 -
క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్: కిషన్‌రెడ్డి
కాచిగూడ (హైదరాబాద్ సిటీ) : బాలబాలికలకు సహజంగానే సహనం, ఓర్పు ఉంటాయని, ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని క్రీడల్లో రాణించాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపడం ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆయన అన్నారు. వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ నారాయణగూడ బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17వ వార్షిక వైఎంసీఏ కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ ఫెస్టివల్ - 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి వివిధ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలకు గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని వివిధ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డి, చెస్, త్రోబాల్, కరాటే తదితర పోటీలలో వందల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ చాటనున్నారు. అనంతరం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు, మామూలు విద్యార్థులకు చాలా వ్యత్యాసాలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో స్నేహ పరిచయాలు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ఛైర్మన్ ఫిలమెన్ రాజ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీజే వినయ్‌స్వరూప్, కోశాధికారి మార్యో, సీనియర్ కార్యదర్శి కిరణ్‌కుమార్, విజయలక్ష్మీ, బీజేపీ నేతలు ఏ.సూర్యప్రకాష్ సింగ్, జి.సోమేశ్వర్, బిఆర్ రవి తదితులు పాల్గొన్నారు. -
ఐఎంటీ నాగ్‌పూర్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)లో శుక్రవారం ‘స్పోర్ట్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. తొలి రోజు ఫుట్‌బాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఐఎంటీ-నాగ్‌పూర్, ఐపీఈ-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నాగ్‌పూర్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐపీఈ-హైదరాబాద్ జట్టు 78 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఐఎంటీ-నాగ్‌పూర్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఐఎంటీ-హైదరాబాద్ జట్టు 5-0 గోల్స్ తేడాతో మేనేజ్ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఈ చాంపియన్‌షిప్‌ను ఐఎంటీ-హైదరాబాద్ డెరైక్టర్ పాండురంగారావు లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బిజినెస్ స్కూల్ జట్లు పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో సుమారు 300 క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఐఎఫ్ఎంఆర్ (చెన్నై), ఐఎంటీ (నాగ్‌పూర్), క్రిస్ట్ యూనివర్సిటీ, ఎన్‌ఐసీఎంఏఆర్ (పుణె)లతో పాటు హైదరాబాద్‌లోని ఎన్ఎంఐఎంఎస్, ఐబీఎస్, ఐపీఈ తదితర జట్లు తలపడుతున్నాయి.