batsmen
-
కెరీర్ అత్యుత్తమ స్థానంలో రిషభ్ పంత్
దుబాయ్: బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్లో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పంత్ 13వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 691 పాయింట్లు ఉన్నాయి. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో ఉండగా... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (862 పాయింట్లు)ని వెనక్కి నెట్టి ఆసీస్ ప్లేయర్ లబ్‌షేన్ (878 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత ప్లేయర్లు పుజారా ఏడో స్థానంలో, రహానే తొమ్మిదో ర్యాంకులో నిలిచారు. బౌలర్ల విభాగంలో సిరాజ్ 32 స్థానాలు మెరుగుపరుచుకొని 45వ ర్యాంక్‌కు చేరాడు. బౌలర్ల జాబితాలో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్‌బ్రాడ్ (ఇంగ్లండ్), నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)... ఆల్‌రౌండర్ల కేటగిరీలో బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్డిండీస్), జడేజా (భారత్) వరుసగా టాప్–3లో ఉన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టుల్లో తనదైన శైలిలో చురకలు, చలోక్తులతో ఆకట్టుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్ తీరును విమర్శించాడు. మైదానంలో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ను ‘ప్రభుత్వ ఉద్యోగం’గా భావిస్తున్నారని చురక వేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్ అర్ధసెంచరీ చేశాడు. కానీ అతను అవుట్ కాగానే మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై వీరూ స్పందిస్తూ ‘అది ఛేదించాల్సిన లక్ష్యం. పీకలమీదికి వచ్చినా కూడా కేదార్ జాదవ్, జడేజా బంతుల్ని వృథాచేయడం (డాట్ బాల్స్ ఆడటం) వల్లే చెన్నై విజయానికి దూరమైంది. దీన్ని బట్టి చూస్తే కొందరి చెన్నై బ్యాట్స్‌మెన్ ప్రదర్శన తీరు ప్రభుత్వ ఉద్యోగంగా నాకనిపిస్తోంది. పని చేసినా చేయకపోయినా... నెల తిరిగేసరికి జీతం వస్తుందిలే అన్న తరహాలో ఆడినా ఆడకపోయినా పారితోషికానికి ఢోకా లేదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు. మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్కే ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లాడి నాలుగింట ఓడిపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో చెన్నై తలపడుతుంది. -
‘ఓపెనింగ్’ మార్పుకు సమయం
టెస్టుల్లో క్రీజులో పాతుకుపోయి... కొత్త బంతి దాడిని కాచుకుంటూ... వీలునుబట్టి బౌలర్ల లయను దెబ్బతీస్తూ... ఒకవిధంగా మిడిలార్డర్లోని మేటి బ్యాట్స్‌మెన్‌కు రక్షణ కవచంగా నిలిచేది ఓపెనింగ్ జోడి! ప్రత్యర్థిపై ఆదిలోనే ఆధిపత్యం చూపుతూ, జట్టు మానసికంగా పైచేయి సాధించడంలో వీరిదే ప్రధాన పాత్ర. అయితే మిగతా జట్లలో ఒకరు విఫలమైతే మరొకరు నిలదొక్కుకుంటూ కొంతలో కొంత నయం అనిపిస్తున్నారు. కానీ, టీమిండియా విషయంలో మాత్రం ‘ముగ్గురు’ ఓపెనర్లూ మూకుమ్మడిగా చేతులెత్తేస్తున్నారు. ఏ ఇద్దరిని ఆడించినా, ఆటగాడి మార్పు తప్ప ఆటతీరు మారడం లేదు. సాక్షి క్రీడా విభాగం ఓపెనర్లకు ఉండాల్సిన కనీస లక్షణాలు భారత ఆరంభ జోడీలో లోపించాయి. దీంతో కీలక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చాలా ముందుగానే క్రీజులోకి రావాల్సి వస్తోంది. బర్మింగ్‌హామ్, లార్డ్స్ టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి 25 ఓవర్లలోపే బ్యాటింగ్‌కు దిగాడు. కొత్త బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే ఇంగ్లండ్‌లో, వందల కొద్దీ ఓవర్లు ఆడాల్సిన ఐదు రోజుల మ్యాచ్‌కు ఇది ఎంతమాత్రం సరైన తీరు కాదు. కోహ్లి, పుజారా, రహానే విఫలమైతే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించే వారే లేకుండా పోతారు. ఇక్కడే(నా) పోటాపోటీ... మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్... స్వదేశంలో టెస్టు సిరీస్ అంటే వీరిలో ఎవరిని తప్పించి, ఎవరిని ఆడించాలి అనేది టీమిండియాకు పెద్ద తలనొప్పి. అదే విదేశాలకు వచ్చేసరికి మాత్రం ఒకరివెంట ఒకరి వైఫల్యంతో అసలు ఎవరిని ఆడించాలో తెలియని డైలమా. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో, ప్రస్తుత ఇంగ్లండ్ టూర్లో ఇదే విషయం మళ్లీమళ్లీ స్పష్టమైంది. అయినా శుభారంభం మాత్రం కలే అవుతోంది. విజయ్–ధావన్ ద్వయం తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుదురుగానే కనిపించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో వైఫల్యంతో ఆ ప్రదర్శన మరుగునపడింది. ఇక రాహుల్‌ది మరో తరహా కథ. భారత్‌లో భారీ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతూ, విదేశాల్లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఆడిన నాలుగు టెస్టుల్లో అతడు కనీసం అర్ధ శతకమైనా చేయలేకపోవడమే దీనికి నిదర్శనం. విజయ్‌కి ఏమైంది టెస్టుల్లో టీమిండియా నంబర్‌వన్ ఓపెనర్ మురళీ విజయ్. వాస్తవంగా చూస్తే ఇటీవల ఎక్కువగా నిరాశపరుస్తోంది అతడే. కానీ, డిఫెన్స్‌తో పాటు విదేశీ రికార్డు మెరుగ్గా ఉండటం విజయ్ను కాపాడుతోంది. ఈ తమిళనాడు బ్యాట్స్‌మన్... సఫారీ టూర్లో ఆకట్టుకోలే కపోయాడు. అయినప్పటికీ తనపై భరోసా ఉంచారు. బౌలర్ల వలలో పడకుండా వారి సహనాన్ని పరీక్షించే విజయ్ ఇటీవల దానికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఫుట్‌వర్క్ కూడా మునుపటిలా లేకపోవడంతో వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఈ పరిస్థితుల నుంచి విజయ్ తొందరగా బయటపడాల్సిన అవసరం ఉంది. లేదంటే... తననూ పక్కనపెట్టక తప్పదు. యువతరం తలుపు తడుతోంది... విజయ్ వయసు 34. ధావన్‌కు 32 దాటుతున్నాయి. వీరిద్దరిపై మరెంతో కాలం ఆధారపడలేం. ఇప్పటికే కొత్తవారిని పరీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా తెరపైకి వస్తున్నారు. ఇటీవల జంటగా రాణిస్తున్నారు. వీరితోపాటు ప్రియాంక్ పాంచల్, ఫైజ్ ఫజల్, ఆర్.సమర్ధ్లు సైతం పరిశీలించదగినవారే. మరోవైపు దశాబ్ద కాలంలో భారత్ తరఫున టెస్టు ఓపెనర్లుగా అరంగేట్రం చేసింది నలుగురే. వీరిలో అభినవ్ ముకుంద్ ఒక్కడే ప్రస్తుత జట్టులో లేడు. ధావన్, విజయ్... తర్వాత రాహుల్ ఆశలు రేకెత్తించడంతో మరొకరి గురించి ఆలోచన రాలేదు. ఇప్పుడు మాత్రం కొత్తవారిని పరీక్షించక తప్పదనేలా ఉంది. అందులోనూ ఎడమచేతి వాటం ఓపెనర్ అయితే మరీ ఉపయోగం. కానీ, దేశవాళీల్లో ఫైజ్ ఫజల్ మినహా మరో నాణ్యమైన ఆటగాడు కనిపించడం లేదు. అయితే, అతడికి 33 ఏళ్లు. ఈ కోణంలో చూస్తే 28 ఏళ్ల ముకుంద్‌కు అవకాశాలివ్వొచ్చు. నేను రెడీ: రోహిత్ ముంబై: సంప్రదాయ ఫార్మాట్లోనూ ఓపెనింగ్‌కు సిద్ధం అంటున్నాడు వన్డే, టి20ల ఓపెనర్ రోహిత్‌శర్మ. టెస్టుల్లో విజయ్, ధావన్, రాహుల్‌ల వరుస వైఫల్యాలతో టీమిండియా సతమతం అవుతున్న వేళ తననూ పరీక్షించి చూడాలన్నట్లుగా మాట్లాడాడు. గురువారం ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్... ‘నాకెప్పుడూ టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం రాలేదు. మేనేజ్మెంట్ కోరితే మాత్రం అందుకు సిద్ధం. దేశం తరఫున వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తానని ఎప్పు డూ ఊహించలేదు. అయినా అది అలా జరిగిపోయింది. టెస్టుల్లోనూ అవకాశం వస్తే కాదనేది లేదు. నిరూపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తా’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో ఆడాలనేది తన కోరికని... అయినా అది తన చేతుల్లో లేదని రోహిత్ వివరించాడు. -
మీ బలహీనతను దాచేయండి: సచిన్
న్యూఢిల్లీ:ఏ మనిషికైనా బలం, బలహీనత ఉండటం సాధారణం. అయితే ప్రధానంగా ఆటగాళ్లు తమ బలహీనతల్ని కనబడనీయకుండా చేసినప్పుడే వారు విజయవంతం అవుతారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. దాంతో పాటు సవాళ్లను, కష్ట నష్టాలను ఎదుర్కొనడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని యువ క్రికెటర్లకు సచిన్ సూచించాడు. ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించే న్యూఢిల్లీ మారథాన్ ఆరంభ కార్యక్రమానికి విచ్చేసిన సచిన్.. వర్ధమాను క్రికెటర్లకు పలు సూచనలు చేశాడు. 'ఎప్పుడూ మీ బలహీనతను బయటకు కనబడనీయకండి. ఒకసారి ప్రత్యర్థులకు మనం ఎక్కడ దొరికిపోతాయో తెలిసిందటే మళ్లీ మీరు తిరిగి పుంజుకోవడం కష్టమవుతుంది. ఒకసారి నా విషయంలో ఇదే జరిగింది. ఒకానొక సందర్భంలో నా పక్కటెములకు బంతి బలంగా తాకింది. అదే ఆయుధంగా బౌలర్ బంతుల్ని వేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. అక్కడ తీవ్ర గాయమైంది నాకు తెలుసు. కానీ ఆ విషయాన్ని బయటకు కనబడనీయలేదు. ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొనడం అలవాటు చేసుకోండి. ఒకసారి కష్టం వచ్చిందని ముందుకు ధైర్యంగా వెళ్లడం ఆపకండి' అని సచిన్ సూచించాడు. తన ఫిట్ నెస్ లో పరుగు అనేది కీలక పాత్ర పోషించిందని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. -
చివర్లో చేతులెత్తేశారు
-
ఇలాగైతే టెస్టుల్లో ఎలా?
ఆశ్చర్యమేమీ లేదు...దక్షిణాఫ్రికాలో సవాల్ ఎదురు కానుందని భారత జట్టు ముందుగా ఊహించిందే. సొంత గడ్డపై అద్భుతాలు సృష్టించిన టీమిండియాకు రాబోయేది పూల బాట కాదని కూడా తెలిసిన విషయమే. అక్కడికి వెళ్లి మనవాళ్లు పాత రికార్డులు బద్దలు కొట్టి అద్భుత విజయాలు సాధిస్తారని కూడా ఎవరూ ఆశించలేదు. కానీ ఇప్పుడు సమస్య భారత్ వన్డేల్లో ఓడిపోవడం కాదు. ఓడిపోయిన తీరు. బ్యాట్స్‌మెన్ కనీసం 50 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. భారత జట్టు వరుసగా రెండు వన్డేల్లో వందకు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం 2006 తర్వాత ఇదే మొదటిసారి. బ్యాటింగ్ తడబాటు: కొన్నాళ్ల క్రితం ఇండియా ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఇక్కడికి వచ్చిన ధావన్ అనధికారిక వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు కూడా తాను సత్తా చాటుతానంటూ సఫారీ గడ్డపై అడుగు పెట్టాడు. కానీ అప్పుడు ఆడిన ప్రిటోరియాలాంటి నాసిరకం వికెట్‌తో పోలిస్తే ఎంతో తేడా ఉండే వాండరర్స్, కింగ్స్‌మీడ్‌లలో బంతిని అంచనా వేయలేక అవుటయ్యాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల నేర్పు ఉన్న కోహ్లి... సూపర్ ఫామ్‌లో కనిపించిన రోహిత్ శర్మలది కూడా ఇదే పరిస్థితి. ధోని ఈ విషయంలో తన అసంతృప్తిని దాచుకోలేదు. ‘గత కొన్ని సిరీస్‌లలో మా మిడిలార్డర్ పెద్దగా రాణించలేదు. అయితే అప్పుడు సమస్య తెలీలేదు. ఈ సిరీస్‌లో టాపార్డర్ ఒక్కసారిగా విఫలమైంది. దాంతో తర్వాతి ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. వారు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడటం లేదు. మొత్తంగా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు’అని అతను వ్యాఖ్యానించాడు. రెండో వన్డేలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై కూడా మన బ్యాట్స్‌మెన్ సఫలం కాలేదు. ఇది తనను పూర్తిగా నిరాశ పరచిందని కెప్టెన్ అన్నాడు. ‘ఫ్లాట్ పిచ్‌పై కూడా మనం పరుగులు చేయలేకపోయాం. అది ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించలేదు కూడా. కానీ చెత్త షాట్లు ఆడి అవుట్ కావడం ఆశ్చర్యంగా ఉంది’ అని ధోని అభిప్రాయ పడ్డాడు. బౌలింగ్ ఓకేనా: తొలి వన్డేతో పోలిస్తే రెండో మ్యాచ్‌లో భారత బౌలింగ్ కాస్త మెరుగు పడింది. డర్బన్ వన్డేలో సునాయాసంగా 325 పరుగులు చేస్తుందనుకున్న సఫారీలను చాలా ముందుగా మన బౌలర్లు నిలువరించారు. మధ్య ఓవర్లలో ఆ జట్టును కట్టడి చేసిన తీరు మన బౌలర్లపై కాస్త విశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా మొహమ్మద్ షమీ ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన టెస్టుల్లో మనకు ఉపయోగ పడవచ్చు. ‘సీమ్‌పై నియంత్రణతో చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో షమీ బౌలింగ్ చేస్తున్నాడు. రెండో వన్డేలో రివర్స్ స్వింగ్‌ను కూడా ఉపయోగించుకున్నాడు. ఇది చాలా కీలకం. పరిస్థితులకు అతను చాలా తొందరగా అలవాటు పడ్డాడు. ఈ సిరీస్‌లో మనకు లభించిన మరో మంచి ఆటగాడు షమీ’ అని ధోని ప్రశంసించాడు. నేర్చుకుంటున్నారా: వన్డేల్లో మన జట్టు ఆటతీరు చూస్తే మాత్రం టెస్టులో అనుకూల ఫలితాలు ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే వన్డే సిరీస్‌లో ఓటమిపాలైనా అక్కడి పరిస్థితులు, వికెట్ల గురించి తెలుసుకునేందుకు మన ఆటగాళ్లకు అవకాశం దక్కింది. టెస్టులకంటే ముందు వన్డే సిరీస్ ఉండటం కొంత వరకు ఉపయోగపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిని ఫలితాలు తేల్చే పరీక్షలు అనడంకన్నా ‘నేర్చుకునే తరగతి గదులు’ అనుకోవడం మన ఆటగాళ్లకు మంచి చేస్తుందేమో. ఎందుకంటే మన బ్యాట్స్‌మెన్‌లో చాలా మందిలో మంచి ప్రతిభ ఉంది. కోహ్లి, పుజారా, రోహిత్, ధావన్‌లు సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచి ప్రత్యర్థి బౌలర్లను విసిగించాల్సి ఉంటుంది. ఇలాంటి కఠిన పర్యటనల్లో ఆడి రాటుదేలితేనే భారత భవిష్యత్తు బాగుంటుంది. ద్రవిడ్ రాటు దేలింది వాండరర్స్‌లోనే... సెహ్వాగ్ మెరుపులు మొదలైందీ సఫారీ గడ్డపైనే... ఈ స్ఫూర్తితో యువ క్రికెటర్లు కాస్త మనసు పెట్టాలి.