Battalion commandant
-
రష్యన్ డ్రోన్ విధ్వంసం: వైరల్ వీడియో
Video Footage Of The Drone Strike: ఉక్రెయిన్ పై రష్యా భూ, వాయు, జల మార్గాలలో నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. ఈ క్రమంలో రష్యా అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో కూడా మరోవైపు నుంచి దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఒక రష్యన్ డ్రోన్ ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్లోని ఐదార్ బెటాలియన్ కమాండ్, అబ్జర్వేషన్ పోస్ట్‌ను ధ్వంసం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అంతేకాదు డ్రోన్ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఓరియన్ డ్రోన్(ఇనోఖోడెట్స్ అని కూడా పిలుస్తారు) అనేది క్రోన్ష్టాడ్ట్ అభివృద్ధిపరిచిన అత్యాధునిక డ్రోన్. ఈ డ్రోన్ విమానం మాదిరి ఒక మోస్తారు ఎత్తులో ఉండి క్షిపణులతో దాడులు చేస్తోంది. అంతేకాదు ఈ డ్రోన్‌కి సుమారు నాలుగు క్షిపణులను మోసుకెళ్లగల సామర్థ్యం గలదు. పైగా 24 గంటల పాటు గాలిలో ఉండగలదు. ఈ మేరకు ఈ డ్రోన్ విధ్వంసానికి సంబంధించి వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. The destruction of the command and observation post of Aidar battalion by crew of unmanned aerial vehicle Inokhodets of the Russian Aerospace Forces in the territory of the Donetsk People's Republic. The target was hit by guided aerial munition. pic.twitter.com/0EYlHoNqpR — Минобороны России (@mod_russia) March 4, 2022 (చదవండి: జెలెన్ స్కీకి హ్యాండ్ ఇచ్చిన నాటో.. ఉక్రెయిన్ అభ్యర్థన తిరస్కరణ) -
పోలీస్ వ్యవస్థపై గౌరవం పెంచారు
ఎస్పీకి ఘన సన్మానం పాల్గొన్న అన్ని పార్టీల నేతలు కోనేరుసెంటర్ : సమర్థవంతమైన అధికారిగా ప్రజల మన్ననలు పొందడంతో పాటు పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు మరింత గౌరవం పెరిగేలా కృషి చేసిన ఎస్పీ ప్రభాకరరావు నిజంగా అభినందనీయుడని వక్తలు కొనియాడారు. జిల్లా ఎస్పీగా పనిచేస్తూ కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై వెళుతున్న జె.ప్రభాకరరావును మంగళవారం మచిలీపట్నం పుర ప్రజలు, వర్తక, వాణిజ్య, సేవా సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రముఖులు ఘనంగా సన్మానించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన అధికారిగా ఎస్పీ జిల్లా వాసుల మన్ననలు అందుకోగలిగారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ జిల్లా అధికారిగా ప్రభాకరరావు పోలీసుశాఖ తరఫున ప్రజలకు విశిష్ట సేవలందించారని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ మారుతీదివాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎస్పీ నుంచి తెలియని ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నానన్నారు. ప్రభాకరరావు లాంటి అధికారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించిన అధికారి ప్రభాకరరావు అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, ఎంవీవీ కుమార్‌బాబు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యవస్థపై ప్రజలంతా గౌరవం పెంచుకోవాలన్నారు. సన్మాన గ్రహీత ఎస్పీ ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం నిరంతరం పాటుపడాలన్నారు. అపుడే ప్రజల నుంచి మన్ననలు పొందగలుగుతామని చెప్పారు. బదిలీపై వెళుతున్న తనకు ఇంతటి ఘన సన్మానం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ నేత చిలంకుర్తి పృధ్వీప్రసన్న, బీజేపీ నేత పంతం గజేంద్ర, వాలిశెట్టి మల్లి, లంకిశెట్టి బాలాజీ ప్రసంగించారు. మామిడి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. బూరగడ్డ రమేష్‌నాయుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కాశీవిశ్వనాథ్, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
జిల్లా ఎస్పీ బదిలీ
కొత్త ఎస్పీగా విజయ్‌కుమార్ కాకినాడ ఏపీఎస్పీకి ప్రభాకరరావు బదిలీ విజయవాడలో ఇద్దరు డీసీపీలకు స్థాన చలనం సాక్షి, విజయవాడ/మచిలీపట్నం : జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు బదిలీ అయ్యారు. ఆయనతోపాటు విజయవాడ కమిషనరేట్‌లో ఇద్దరు డీసీపీలనూ బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీగా తూర్పుగోదావరి ఎస్పీగా పనిచేస్తున్న జి.విజయ్‌కుమార్ రానున్నారు. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న జె.ప్రభాకరరావును కాకినాడలోని ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీచేశారు. విజయవాడ కమిషనరేట్‌లో లా అండ్ అర్డర్ డీసీపీగా పనిచేస్తున్న ఎం.రవిప్రకాష్‌ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నియమించారు. అయన స్థానంలో విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్న తప్సీర్ ఇక్బాల్ విజయవాడ రానున్నారు. రవిప్రకాష్ 2012, డిసెంబర్ ఒకటో తేదీన కమిషనరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ కమిషనరేట్‌లో డీసీపీ(అడ్మిన్)గా పనిచేస్తున్న ఎ.సత్తార్‌ఖాన్ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా బదిలీఅయ్యారు. అయన స్థానంలో వైఎస్సార్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న జీవీజీ అశోక్‌కుమార్ విజయవాడ రానున్నారు. సత్తార్‌ఖాన్ 2012, నవంబర్ 26న బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ విజయ్‌కుమార్ ప్రొఫైల్ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ 1998లో గ్రూప్-1 ఉత్తీర్ణుడై డీఎస్పీగా ఎంపికయ్యారు. వరంగల్, అనంతపురంలో డీఎస్పీగా పనిచేశారు. అనంతపురం ఓఎస్ డీగా, విజయవాడ డీసీపీగా, సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. పదోన్నతిపై మెదక్ ఎస్పీగా వెళ్లారు. అక్కడి నుంచి తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. వివాదరహితుడిగా పేరుంది. సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించేవారు. గత ఫిబ్రవరి 17న తూర్పుగోదావరి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బదిలీపై కృష్ణా జిల్లా ఎస్పీగా వస్తున్నారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచిన ప్రభాకరరావు జిల్లా ఎస్పీగా జె.ప్రభాకరరావు 2012, డిసెంబర్ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 19 నెలలపాటు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన ఆయన సార్వత్రిక ఎన్నికల అనంతరం బదిలీ అవుతారని ప్రచారం జరిగింది. జె.ప్రభాకరరావు ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కువగా హత్యలు, దొంగతనాలు జరిగాయి. మచిలీపట్నం మండలం పెదపట్నం వద్ద ఐదు రాష్ట్రాల పరిధిలో మెరైన్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేశారు. ఈ అకాడమీ ప్రతిపాదనల దశలోనే ఉంది. పోలీస్ సిబ్బంది కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించేలా చూశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కృషిచేశారు. ఎన్నికల అనంతరం అధికార పార్టీ నాయకుల ఆడగాలను అరికట్టలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు, పోలీస్ అధికారుల సెల్ఫోన్లకు జీఎస్ఎం పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చి పనితీరు మెరుగుపడేలా చొరవచూపారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్లు అందేలా చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ కేసులో నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సోమవారం మాత్రమే ఎస్పీ కార్యాలయానికి వస్తారని, ఎక్కువ రోజులు క్యాంపు కార్యాలయాలకు పరిమితమవుతారనే అపవాదు ప్రభాకరరావుపై ఉంది. సిబ్బంది, అధికారుల బదిలీల విషయంలో రాజకీయ నాయకుల సిఫార్సులకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని విమర్శలు ఎదుర్కొన్నారు. మైలవరంలో 2013, జూలైలో అప్పటి సీఐ బంగార్రాజు ప్రజలపై కాల్పులు జరిపిన అనంతరం విచారణ సక్రమంగా సాగలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.