BGMI క్రాఫ్టన్కి వ్యతిరేకంగా కేంద్రానికి తెలంగాణ ఎంపీ లేఖ
పబ్జీ.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో క్రాఫ్టన్ సంస్థ భారత్లో విడుదల చేయడానికి సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితులు చూస్తే ఇది విడుదల అవుతుందా? అనే సందేహం కలుగుతుంది. దీనికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది. దేశీయ రాజకీయ నాయకులు దీనికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాస్తున్నారు. కొద్దీరోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే దీనిని దేశంలో విడుదల కాకుండా చూడాలని కోరుతూ ఒక లేఖను కేంద్రానికి రాశారు. అప్పుడు అది భాగ వైరల్ అయ్యింది.
తాజాగా తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ విషయంలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే లాగా రద్దు చేయాలని కోరుతూ కాకుండా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ గేమ్, క్రాఫ్టన్ సంస్థకు చెందిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎంపి డిమాండ్ చేశారు. క్రాఫ్టన్, టెన్సెంట్ మధ్య సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా పబ్జీ మొబైల్కు చెందిన రైట్స్ టెన్సెంట్ దగ్గర ఉన్నాయి. గత ఏడాది నిషేధం భారతదేశం కోసం క్రాఫ్టన్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది.
కాబట్టి, సాంకేతికంగా ఎంపీ ధర్మపురి అరవింద్ కోరిన దర్యాప్తు పూర్తిగా నిరాధారమైనది కాదు. ఐటి మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో ఈ ఆటకు వ్యతిరేకంగా స్థానిక సామాజిక కార్యకర్త సాయి కుమార్ నుంచి తనకు అభ్యర్ధన వచ్చినట్లు చెప్పారు. ఈ లేఖ ప్రధానంగా సేవా నిబంధనలు, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గోప్యతా విధానం గురించి. ఈ గేమ్ వినియోగదారుల డేటా భారతదేశం, సింగపూర్ లో నిల్వ చేసినప్పటికీ అంతర్జాతీయ సర్వర్ల మధ్య డేటా బదిలీ జరిగే అవకాశం ఉందని కుమార్ పేర్కొన్నారు. క్రాఫ్టన్ దక్షిణ కొరియా దేశానికి చెందినది. ఈ లేఖలో ప్రధానంగా క్రాఫ్టన్, టెన్సెంట్ మధ్య ఉన్న సంబంధం గురుంచి దర్యాప్తు చేయాలని కోరారు. డిమాండ్ ప్రకారం అయితే, ఐటి మంత్రి క్రాఫ్టన్ పెట్టుబడులను చైనా దేశనికి చెందిన బెహెమోత్ టెన్సెంట్తో ఉన్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉంటుంది.