Bawana By Election
-
బవానాలో ఆప్ అభ్యర్థి గెలుపు
న్యూఢిల్లీ: ఉత్కంఠ నడుమ జరిగిన బవానా ఉప ఎన్నిక కౌంటింగ్ లో చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థినే విజయం వరించింది. ఆప్ అభ్యర్థి రామ్ చంద్ర సుమారు 22 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి స్వల్ఫ ఆధిక్యంలో ముందంజలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర కుమార్ 12 రౌండో తర్వాత అనూహ్యంగా వెనకబడిపోయారు. క్రమక్రమంగా మెజార్టీ పెంచుకుంటూ పోయిన ఆప్ పార్టీ అభ్యర్థి చివరకు 56,178 ఓట్లు సాధించి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఇక మూడో స్థానానికి పరిమితమవుతుందని భావించిన బీజేపీ అభ్యర్థి వేద ప్రకాశ్ చివరకు 34 వేల 501 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. గెలుపు మీద గంపెడు ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్‌కుమార్ 30,758 ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
బై పోల్.. ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో పుంజుకునే మాట అటుంచి ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పునాదులను మళ్లీ వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బవానా ఉప ఎన్నిక ఫలితాలలో ఆ పార్టీ అభ్యర్థి అనూహ్యాంగా దూసుకుపోతుండటం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఉదయం నుంచి బవానా ఉప ఎన్నికల్లో ప్రస్తుతం ఒక్కో రౌండ్ ఫలితాలు వెలువడుతుండగా, కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ కుమార్ ఆరో రౌండ్ ముగిశాక 3437 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సురేందర్ బవానాకు గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, చివరగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఆప్ అభ్యర్థి రాంచంద్ర, బీజేపీ అభ్యర్థి వేద్ ప్రకాశ్ వెనకంజలో ఉన్నారు. తమ అభ్యర్థి ఆధిక్యంలో ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ ఆసక్తిగా తిలకిస్తోంది. ఇక ఇవాళే గోవా లోని పనాజీ, ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.