బవానాలో ఆప్ అభ్యర్థి గెలుపు
ఢిల్లీ ఉప ఎన్నిక.. ఆప్ అభ్యర్థి విక్టరీ
Published Mon, Aug 28 2017 1:11 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: ఉత్కంఠ నడుమ జరిగిన బవానా ఉప ఎన్నిక కౌంటింగ్ లో చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థినే విజయం వరించింది. ఆప్ అభ్యర్థి రామ్ చంద్ర సుమారు 22 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
తొలి రౌండ్ నుంచి స్వల్ఫ ఆధిక్యంలో ముందంజలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర కుమార్ 12 రౌండో తర్వాత అనూహ్యంగా వెనకబడిపోయారు. క్రమక్రమంగా మెజార్టీ పెంచుకుంటూ పోయిన ఆప్ పార్టీ అభ్యర్థి చివరకు 56,178 ఓట్లు సాధించి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఇక మూడో స్థానానికి పరిమితమవుతుందని భావించిన బీజేపీ అభ్యర్థి వేద ప్రకాశ్ చివరకు 34 వేల 501 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. గెలుపు మీద గంపెడు ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్‌కుమార్ 30,758 ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
Advertisement
Advertisement