BBCI
-
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
అసలే మ్యాచ్ ఓడిపోయిన కోహ్లీకి BCCI షాక్
-
అవినీతి ఆరోపణలతో ముంబై క్రికెటర్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ముంబై రంజీ క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ వేటు వేసింది.హికెన్ షాపై వచ్చిన లంచం ఆరోపణలు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతడిపై తదుపరి చర్య కోసం ఈ అంశాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. ఐపీఎల్ లో ఓ జట్టు తరపున ఆడుతున్న తన తోటి క్రికెటర్ కు లంచం ఇవ్వచూపాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ అవినీతి నిరోధక నిబంధనావళిని హికెన్ షా ఉల్లంఘించినట్టు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు. 30 ఏళ్ల హికెన్ షా ముంబై తరపున 37 ఫస్ట్ క్లాచ్ మ్యాచ్ లు ఆడి 42.35 సగటుతో 2160 పరుగులు చేశాడు. -
హైదరాబాద్ లో భారత్-విండీస్ టెస్టు
ముంబై: భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ తో వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. అక్టోబర్-నవంబర్ మధ్యలో భారత్, వెస్టిండీస్ మ్యాచ్లుంటాయని బీసీసీఐ గురువారం తెలిపింది. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్లు ఆడతాయని ప్రకటించింది. మొదటి వన్డే కొచ్చిలో అక్టోబర్ 8న జరుగుతుంది. రెండో వన్డే విశాఖపట్నం(అక్టోబర్ 11), మూడో వన్డే కటక్(అక్టోబర్ 20), నాలుగో వన్డే(అక్టోబర్ 17), ఐదో వన్డే ధర్మశాల(అక్టోబర్ 20)లో జరుగుతాయి. టి20 మ్యాచ్ అక్టోబర్ 22న ఢిల్లీలో జరుగుతుంది. టెస్టు సిరీస్ అక్టోబర్ 30న హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు బెంగళూరు(నవంబర్7-11), మూడో టెస్టు అహ్మదాబాద్(నవంబర్ 15-19)లలో జరుగుతాయి.