అవినీతి ఆరోపణలతో ముంబై క్రికెటర్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ముంబై రంజీ క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ వేటు వేసింది.హికెన్ షాపై వచ్చిన లంచం ఆరోపణలు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతడిపై తదుపరి చర్య కోసం ఈ అంశాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. ఐపీఎల్ లో ఓ జట్టు తరపున ఆడుతున్న తన తోటి క్రికెటర్ కు లంచం ఇవ్వచూపాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి.
బీసీసీఐ అవినీతి నిరోధక నిబంధనావళిని హికెన్ షా ఉల్లంఘించినట్టు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు. 30 ఏళ్ల హికెన్ షా ముంబై తరపున 37 ఫస్ట్ క్లాచ్ మ్యాచ్ లు ఆడి 42.35 సగటుతో 2160 పరుగులు చేశాడు.