Hiken Shah
-
ఐపీఎల్ ఫిక్సింగ్; మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది. అజిత్ చండీలాపై జీవితకాలం, హీకెన్ షాపై ఐదేళ్ల చొప్పున బీసీసీఐ నిషేధం విధించింది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బృందం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపీఎల్ సీజన్లో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో పాటు చండీలాను ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశాంత్, చవాన్లపై ఇప్పటికే బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా, తాజాగా చండీలా, ముంబై క్రికెటర్ హీకేన్ షాలపై చర్యలు తీసుకుంది. -
చండిలా, హికేన్లపై నిర్ణయం 18కి వాయిదా
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న అజిత్ చండిలా, హికేన్ షాలపై నిర్ణయాన్ని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈనెల 18కి వాయిదా వేసింది. పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై సమాధానమిచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో మంగళవారం సమావేశమైన కమిటీ అంగీకరించింది. -
చండీలా, షాల భవితవ్యంపై నిర్ణయం వాయిదా
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన అజిత్ చండిలా, హికేన్ షాల భవితవ్యం ఈనెల 18వ తేదీన తేలనుంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వంలోని జ్యోతిరాధిత్య సింధియా, నిరంజన్ షాలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ చండీలా, షాలను విచారించి వారి నుంచి రాత పూర్వకంగా స్పందన సేకరించింది. కాగా, ఈ కేసులో మూడో నిందితునిగా ఉన్న పాకిస్తాన్ అంపైర్ అసద్ రాఫ్ విచారణకు హాజరువుకావడానికి కొంత సమయం కోరిన నేపథ్యంలో చండీలా, షాలకు సంబంధించిన నిర్ణయాన్ని జనవరి 18కు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ తాజాగా పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీ సోమవారం మరోసారి సమావేశమయ్యింది. అప్పట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన 15 మంది ఫిక్సింగ్ బృందం అంపైర్ అసద్ రాఫ్ సాయంతో చండీలా, షాలను కలిశారనేది బీసీసీఐ ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే అసద్ ను మూడో నిందితునిగా చేర్చిన బీసీసీఐ అతనికి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించడానికి అసద్ కొంత సమయం కోరడంతో చంఢీలా, షాల భవిష్యత్తుపై నిర్ఱయాన్ని కూడా మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. -
జనవరి 5న తేలనున్న చండిలా, షా భవితవ్యం
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన అజిత్ చండిలా, హికేన్ షాల భవితవ్యం వచ్చే ఏడాది జనవరి 5న తేలనుంది. గురువారం సమావేశమైన క్రమశిక్షణ కమిటీ ఈ ఇద్దరికి శిక్ష ఖరారు చేయాల్సి ఉన్నా... చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అలాగే ఈ అంశంపై జనవరి 4 వరకు ఇద్దరూ రాత పూర్వకంగా స్పందన తెలియజేయాలని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, జ్యోతిరాధిత్య సింధియా, నిరంజన్ షాలతో కూడిన కమిటీ ఆదేశించింది. కొత్త కమిటీ కూడా ఢిల్లీ పోలీసులు అడిగిన ప్రశ్నలే అడిగిందని సమావేశం తర్వాత చండిలా తెలిపాడు. ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు సభ్యులు నన్ను ప్రశ్నలు అడిగారు. ఢిల్లీ పోలీసులకు చెప్పిన విషయాలనే వీళ్లకు వివరించా. కోర్టు ఏం చెప్పిందో కూడా అందరికీ తెలుసు. అయితే కొత్త కమిటీ న్యాయం చేస్తుందని మాత్రం నమ్ముతున్నా. తీర్పు ఎలా ఉంటుందో నాకు తెలియదు’ అని చండిలా పేర్కొన్నారు. -
'బీసీసీఐ నిర్ణయంతో షాకయ్యా'
న్యూఢిల్లీ: తనను సస్పెండ్ చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని ముంబై రంజీ క్రికెటర్ హికెన్ షా(30) ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం విస్మయానికి గురి చేసిందన్నాడు. తాను ప్రవీణ్ తాంబేను కలిసిన మాట వాస్తవమే అయినా.. కోచింగ్ కోసమే అతన్ని కలిసినట్లు హికెన్ తెలిపాడు. 'నేనెప్పుడూ అవినీతికి పాల్పడలేదు. దానిపై ఇప్పటికే బీసీసీఐకి వివరణ ఇచ్చా. నేను తప్పుచేయలేదని మాత్రమే బీసీసీఐకి చెప్పగలను. అంతకుమించి నావద్ద సమాధానం కూడా ఏమీ లేదు. బీసీసీఐ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో నేను షాక్ తిన్నా' అని హికెన్ తెలిపాడు. ప్రస్తుతం హీకెన్ ఇంగ్లండ్ కౌంటీ క్లబ్ లాంక్ షైర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా, హికెన్ షాపై గత ఐపీఎల్ సందర్భంగా వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో అతడిని బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతడిపై తదుపరి చర్య కోసం ఈ అంశాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. ఐపీఎల్ లో ఓ జట్టు తరపున ఆడుతున్న తన తోటి క్రికెటర్ కు లంచం ఇవ్వచూపాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ అవినీతి నిరోధక నిబంధనావళిని హికెన్ షా ఉల్లంఘించినట్టు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు. హికెన్ షా ముంబై తరపున 37 ఫస్ట్ క్లాచ్ మ్యాచ్ లు ఆడి 42.35 సగటుతో 2160 పరుగులు చేశాడు. అయితే హికెన్ ఏ ఐపీఎల్ జట్టు తరుపున ఆడకపోవడం గమనార్హం. -
అవినీతి ఆరోపణలతో ముంబై క్రికెటర్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ముంబై రంజీ క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ వేటు వేసింది.హికెన్ షాపై వచ్చిన లంచం ఆరోపణలు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతడిపై తదుపరి చర్య కోసం ఈ అంశాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. ఐపీఎల్ లో ఓ జట్టు తరపున ఆడుతున్న తన తోటి క్రికెటర్ కు లంచం ఇవ్వచూపాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ అవినీతి నిరోధక నిబంధనావళిని హికెన్ షా ఉల్లంఘించినట్టు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు. 30 ఏళ్ల హికెన్ షా ముంబై తరపున 37 ఫస్ట్ క్లాచ్ మ్యాచ్ లు ఆడి 42.35 సగటుతో 2160 పరుగులు చేశాడు.