ముంబై: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన అజిత్ చండిలా, హికేన్ షాల భవితవ్యం వచ్చే ఏడాది జనవరి 5న తేలనుంది. గురువారం సమావేశమైన క్రమశిక్షణ కమిటీ ఈ ఇద్దరికి శిక్ష ఖరారు చేయాల్సి ఉన్నా... చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అలాగే ఈ అంశంపై జనవరి 4 వరకు ఇద్దరూ రాత పూర్వకంగా స్పందన తెలియజేయాలని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, జ్యోతిరాధిత్య సింధియా, నిరంజన్ షాలతో కూడిన కమిటీ ఆదేశించింది.
కొత్త కమిటీ కూడా ఢిల్లీ పోలీసులు అడిగిన ప్రశ్నలే అడిగిందని సమావేశం తర్వాత చండిలా తెలిపాడు. ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు సభ్యులు నన్ను ప్రశ్నలు అడిగారు. ఢిల్లీ పోలీసులకు చెప్పిన విషయాలనే వీళ్లకు వివరించా. కోర్టు ఏం చెప్పిందో కూడా అందరికీ తెలుసు. అయితే కొత్త కమిటీ న్యాయం చేస్తుందని మాత్రం నమ్ముతున్నా. తీర్పు ఎలా ఉంటుందో నాకు తెలియదు’ అని చండిలా పేర్కొన్నారు.
జనవరి 5న తేలనున్న చండిలా, షా భవితవ్యం
Published Fri, Dec 25 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
Advertisement