spot-fixing case
-
పీఎస్ఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ : పాక్ క్రికెటర్‌పై నిషేధం!
సాక్షి, స్పోర్ట్స్: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ షాజాబ్ హసన్‌పై ఆదేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏడాది నిషేధంతో పాటు పదిలక్షల రూపాయల జరిమాన విధించింది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో షాజాబ్తో పాటు పలువురు పాక్ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిలో కొంతమందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న పీసీబీ తాజాగా హసన్‌పై నిషేధం విధించింది. ఈ విషయాన్ని బోర్డు లీగల్ అడ్వైజర్ తాఫ్ఫాజుల్ రిజ్వీ ధృవీకరించారు. ఇతర క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌ల పాల్పడకుండా హసన్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేలా చార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు. దూకుడు ఓపెనర్ అయిన హసన్ అంతర్జాతీయ క్రికెట్లో కేవలం మూడు వన్డేలు, 10 టీ20లే ఆడాడు. 2009 టీ20 ప్రపంచకప్ విజేత పాక్‌జట్టులో హసన్ సభ్యుడు. పేలవ ప్రదర్శనతో 2010 అనంతరం పాక్ జట్టులో చోటు కోల్పోయాడు. పీఎస్ఎల్లో కరాచి కింగ్స్‌కు తరపున ఆడాడు. రెండో సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ఆదేశ క్రికెటర్లు షర్జీల్ ఖాన్, నాసిర్ జంషేడ్, ఖలీద్ లతీఫ్‌లు ఇప్పటికే శిక్షను అనుభవిస్తున్నారు. షర్జీల్ ఖాన్‌ను రెండున్నరేళ్లు నిషేధించగా.. ఖలీద్ లతీఫ్‌పై పీసీబీ ఐదేళ్లు నిషేధం విధించింది. ఇక పీఎస్ఎల్ మూడో సీజన్ కూడా దుబాయ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. -
స్పాట్ ఫిక్సింగ్: పాకిస్థాన్ క్రికెటర్‌పై వేటు
కరాచీ: వివాదాలకు, అనిశ్చితికి పాకిస్థాన్ క్రికెట్ మారుపేరు. ఎప్పుడు ఎవరు జట్టులో ఉంటారో, కెప్టెన్‌గా ఎవరు ఉంటారో, ఎప్పుడెలా ఆడుతారో ఊహించడం కష్టం. దీనికి తోడు పాకిస్థాన్ క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు షరా మామూలే. తాజాగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్‌పై వేటు వేశారు. ఇర్ఫాన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత పొడగరి అయిన ఫాస్ట్ బౌలర్‌గా ఇర్ఫాన్‌కు గుర్తింపు ఉంది. పాక్ తరఫున నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 20 టి-20 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇర్పాన్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ బుకీ అతన్ని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది. సోమవారం పీసీబీ అవినీతి నిరోధక కమిటీ ముందు ఇర్ఫాన్ హాజరైనా సమాధానం ఇవ్వలేదు. అతని కుటుంబ సభ్యులు మరణించడంతో బాధలో ఉన్నట్టు సమాచారం. బుకీలతో సంబంధాలు, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి అతనిపై పీసీబీ ఛార్జిషీట్ నమోదు చేసి, సస్పెండ్ చేసింది. 14 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలపై మరో ఇద్దరు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ సస్పెండ్ అయ్యారు. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్ కేసులోనే మరో పాక్ క్రికెటర్ నసీర్ జంషెడ్ అరెస్టయ్యాడు. గతంలో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు మహ్మద్ ఆమీర్, సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లు ఫిక్సింగ్ కేసులో సస్పెండ్ కావడంతో పాటు జైలు శిక్ష అనుభవించారు. గతంలో ఇంకా పలువురు పాక్ క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. -
సల్మాన్ భట్, ఆసిఫ్ పునరాగమనం
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్, పేసర్ మొహమ్మద్ ఆసిఫ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటుకున్నారు. ఇటీవలే వీరి సస్పెన్షన్ కాలం ముగియడంతో పాక్ జాతీయ వన్డే కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఆదివారం డబ్ల్యుఏపీడీఏ జట్టు తరఫున బరిలోకి దిగిన భట్ సెంచరీ (143 బంతుల్లో 135; 14 ఫోర్లు)తో అదరగొట్టగా ఇదే జట్టుకు ఆడుతున్న ఆసిఫ్ బౌలింగ్‌లో ఆరు ఓవర్లలో 23 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన భట్, ఆసిఫ్, ఆమిర్ త్రయం స్వల్పకాలం జైలు కెళ్లడంతో పాటు ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత సెప్టెంబర్‌లో వీరిపై నిషేధం ముగిసినా పునరావాస శిబిరంలో చేరారు. -
జనవరి 5న తేలనున్న చండిలా, షా భవితవ్యం
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన అజిత్ చండిలా, హికేన్ షాల భవితవ్యం వచ్చే ఏడాది జనవరి 5న తేలనుంది. గురువారం సమావేశమైన క్రమశిక్షణ కమిటీ ఈ ఇద్దరికి శిక్ష ఖరారు చేయాల్సి ఉన్నా... చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అలాగే ఈ అంశంపై జనవరి 4 వరకు ఇద్దరూ రాత పూర్వకంగా స్పందన తెలియజేయాలని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, జ్యోతిరాధిత్య సింధియా, నిరంజన్ షాలతో కూడిన కమిటీ ఆదేశించింది. కొత్త కమిటీ కూడా ఢిల్లీ పోలీసులు అడిగిన ప్రశ్నలే అడిగిందని సమావేశం తర్వాత చండిలా తెలిపాడు. ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు సభ్యులు నన్ను ప్రశ్నలు అడిగారు. ఢిల్లీ పోలీసులకు చెప్పిన విషయాలనే వీళ్లకు వివరించా. కోర్టు ఏం చెప్పిందో కూడా అందరికీ తెలుసు. అయితే కొత్త కమిటీ న్యాయం చేస్తుందని మాత్రం నమ్ముతున్నా. తీర్పు ఎలా ఉంటుందో నాకు తెలియదు’ అని చండిలా పేర్కొన్నారు. -
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయాలి: చాందీ
కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డ పేసర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధాన్ని కొనసాగించడం సరైంది కాదని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అన్నారు. బోర్డుది పెద్ద తప్పు అని చెప్పారు. ఈ అంశంలో సరైన న్యాయం జరగడం లేదని శ్రీకి మద్దతుగా మాట్లాడారు. ‘ఈ విషయంలో బీసీసీఐ వైఖరి సరైంది కాదు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి తీర్పును గౌరవిస్తూ నిషేధాన్ని ఎత్తివేయాలి’ అని చాందీ పేర్కొన్నారు.