Mumbai Ranji player
-
గుండెపోటుతో మరో క్రికెటర్ అకాల మరణం
ముంబై రంజీ జట్టు పేసర్ రాజేష్ వర్మ(40) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని తన మాజీ సహచర ఆటగాడు భవిన్ థక్కర్ ధృవీకరించాడు. కాగా 2002లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాజేష్ వర్మ వర్మ అరంగేట్రం చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన వర్మ మొత్తం ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అతడు తన చివరి మ్యాచ్‌లో బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో ఆడాడు. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాజేష్ వర్మ 23 వికెట్లు పడగొట్టాడు. దీంట్లో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక 2007లో రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో రాజేష్ వర్మ భాగంగా ఉన్నాడు. "రాజేష్ వర్మ మరణ వార్త విని షాక్‌కు గురయ్యా. అండర్-19 నుంచి మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడాం. 20 రోజుల క్రితం మేమిద్దరం కలిసి ఓ టోర్నమెంట్లో పాల్గొన్నాం. శనివారం (ఏప్రిల్ 23) నేను అతడితో దాదాపు 30 నిమిషాలు పాటు ఫోన్లో మాట్లాడాను. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున 4 గంటలకు అతడి చనిపోయాడాని నాకు ఫోన్ వచ్చింది. అతడు మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. అతడు మమ్మల్ని విడిచి వెళ్లి పోవడం చాలా బాధగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఠక్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'అతడు యార్కర్ల కింగ్.. ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు' -
'మన్కడింగ్'పై పోరాటం చేసిన మాజీ క్రికెటర్ రాహుల్ మన్కడ్ కన్నుమూత
Rahul Mankad Passed Away: భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు వినూ మన్కడ్ చిన్న కుమారుడు ముంబై మాజీ ఆల్‌రౌండర్ రాహుల్ మన్కడ్ (66) అలియాస్ జిగ్గా భాయ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాహుల్.. బుధవారం (మార్చి 30) లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని క్రికెటర్‌గా ఎదిగిన రాహుల్.. 1972-85 మధ్యకాలంలో ముంబై రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. జిగ్గా భాయ్.. ముంబై తరఫున 47 మ్యాచ్‌లు ఆడి 5 శతకాలు, 12 అర్ధ శతకాల సాయంతో 2111 పరుగులు, 162 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ మన్కడ్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. రాహుల్ సోదరులు అశోక్ మన్కడ్, అతుల్ మన్కడ్ కూడా క్రికెటర్లుగా రాణించారు. వీరిలో అశోక్ టీమిండియాకు ప్రాతనిధ్యం వహించాడు. రాహుల్ మృతిపై పలవురు మాజీ క్రికెటర్లు, ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. కాగా, రాహుల్.. తన తండ్రి వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్' (నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను బౌలర్ ఔట్ చేయడం) ను నిషేధించాలని జీవితాంతం పోరాడారు. అయితే ఇటీవలే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్ అనే పదాన్ని నిషేధించి, అలా ఔట్ అయిన విధానాన్ని సాధారణ రనౌట్ గానే పరిగణించాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధన కార్యరూపం దాల్చకుండానే రాహుల్ కన్నుమూయడం బాధాకరం. మన్కడింగ్‌కు సంబంధించి ఎంసీసీ కొత్త రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. చదవండి: షేన్ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు -
అవినీతి ఆరోపణలతో ముంబై క్రికెటర్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ముంబై రంజీ క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ వేటు వేసింది.హికెన్ షాపై వచ్చిన లంచం ఆరోపణలు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతడిపై తదుపరి చర్య కోసం ఈ అంశాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. ఐపీఎల్ లో ఓ జట్టు తరపున ఆడుతున్న తన తోటి క్రికెటర్ కు లంచం ఇవ్వచూపాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ అవినీతి నిరోధక నిబంధనావళిని హికెన్ షా ఉల్లంఘించినట్టు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు. 30 ఏళ్ల హికెన్ షా ముంబై తరపున 37 ఫస్ట్ క్లాచ్ మ్యాచ్ లు ఆడి 42.35 సగటుతో 2160 పరుగులు చేశాడు.