రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ
సాక్షి, తిరుపతి: తెలంగాణ విడిపోతే రాయలసీమకు తాగునీరు లభించే అవకాశాలు ఉండవని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ తిరుపతిలో శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడు తూ తెలంగాణ ఏర్పడితే కష్ణానదిపై వారు ఆనకట్ట కట్టుకుని, దిగువ ప్రాంతానికి నీళ్లు వదలరని, జిల్లా ప్రజలు దాహంతో అలమటించి పోవాల్సి ఉంటుందని చె ప్పారు. కష్ణా జలాలు కండలేరుకు వచ్చి, అక్కడ నుంచి తిరుపతికి తెలుగు గంగ కాలువ ద్వారా రావాల్సి ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లా దొంగలు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు కలిసి సొంత జిల్లాకు ఇంత అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
నదీ జలాల ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలు ఫలించవని గుర్తు చేశారు. కష్ణ, తుంగభద్ర డ్యామ్‌లను మ్యూజియంల్లా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆం దోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నిలువునా చీ ల్చుతారనే విషయాన్ని ముందుగానే గ్రహిం చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పదవులను కూడా లెక్కచేయకుండా రాజీనామాలు సమర్పించారని తెలిపారు. అయితే చిత్తూరు జిల్లా ద్రోహులైన కిరణ్, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి గుమ్మడికాయల్లా తలలు ఊపి వచ్చేశారని ఎ ద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రజల గుండెలను చీల్చడానికి కూడా కుమ్మక్కు రాజకీయాలు నడిపారని భూమన విమర్శించారు. పార్టీ నాయకుడు ఎస్కె.బాబు మాట్లాడుతూవిభజనను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోమని అన్నారు. మైనారిటీల విభాగం కన్వీనర్ షఫీ అహ్మద్ ఖాద్రీ మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాక, ముఖ్యమంత్రి తొమ్మిది రోజులు దొం గలా దాక్కున్నారని విమర్శించారు. న్యాయవాదుల విభాగం నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రానికి అహర్నిశలు కషి చేస్తామన్నారు.
పార్టీ నాయకుడు దుద్దేల బాబు మాట్లాడుతూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ సమైక్య రాష్ట్ర ఉద్యమాన్ని తుం గలో తొక్కి, సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారని ఆరోపించారు. ఎంవీఎస్.మణి వందన సమర్పణ చేయగా, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, రైతు నాయకుడు ఆదికేశవరెడ్డి, కేతం రామారావు, ముద్రనారాయణ, పార్టీ 25, 26, 28 వార్డుల నాయకులు పాల్గొన్నారు.