BC beneficiaries
-
బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు
హైదరాబాద్ : బీజేపీ నేత రాంమాధవ్ ఎంతగా మాట్లాడినా ఆ పార్టీకి తెలంగాణాలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదని టీఆర్ఎస్ నేతలు జోస్యం చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణలో అట్టడుగు వర్గాలకు కేసీఆర్ హయాంలోనే వచ్చిందని తాను చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. ఇపుడు కూడా చెబుతున్నా ...సబ్సిడీ గొర్రెల పథకం తెచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారని చెప్పారు. ఇప్పటి వరకు అరవై లక్షల గొర్రెల పంపిణీ చేశామని, ఇదో పెద్ద విజయమన్నారు. గొల్ల కురుమలు, మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది కేసీఆరేనని స్పష్టం చేశారు. కోట్లాది చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో వెనుకబడిన కులాలకు మంచి మేలు జరిగిందన్నారు. అసెంబ్లీ స్పీకర్ ,శాసనమండలి చైర్మన్ కూడా వెనకబడిన వర్గాలకు చెందిన వారు కావడం బీసీ వర్గాల అదృష్టమని, ప్రభుత్వం బీసీ వర్గాలకు ఎన్ని కోట్ల రూపాలయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. బీసీలను తామే ఉద్ధరిస్తున్నట్టు కొందరు మాట్లాడుతున్నారని..కానీ వారు చేసింది ఏమీ లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హేళనగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. -
మరింత జాప్యం
ప్రగతినగర్ : స్వయం ఉపాధికోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వ పెడుతున్న లేనిపోని కొర్రీలతో రుణమంజూరులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఎంపిక చేసిన బీసీ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట క ల్పిస్తూ జీఓ నెం 165 ను విడుదల చేసిన విషయ తెలిసిందే! స్వయం ఉపాధి పథకం కింద ఎంపికైన 1890 మందికి, వృత్తి పనిదారుల సహకార సంఘాలకు సైతం జీఓ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్చి వరకు లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాధ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఎన్నో నెలలుగా రాయితీకోసం ఎదురుచూస్తున్న సుమారు 2 వేల మంది వెనుకబడిన తరగతుల వారికి కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. అయితే బీసీ రాయితీకి సంబంధించి పలు నిబంధనలు విధించడం లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తున్నారు. గతంలో తీసుకువచ్చిన బ్యాంకు రుణ అర్హత పత్రం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ నెంబర్లను తిరిగి మళ్లీ అదే బ్యాంకుల నుంచి తీసుకురావాలని బీసీ లబ్ధిదారులకు అధికారులు చెబుతున్నారు. అలాగైతేనే రుణం మంజూరు చేస్తామంటున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పనిచేసిన ఫీల్డ్ ఆఫీసర్లు, బ్యాంకు మేనేజర్లు అన్ని అర్హతలు చూచుకొని బీసీ లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే తాజాగా తిరిగి డూయల్ అకౌంట్ నెంబర్, బ్యాంకు రుణ అర్హత పత్రం తీసుకరావాలని అధికారులు నిబంధన విధించడంతో బీసీ లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. వివరాలకు జిల్లాలో రాజీవ్ అభ్యుదయ యోజన క్రింద నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, మూడు మున్సిపాలిటీలలో 248 మందికిగాను రూ. 6 కోట్ల 86 లక్షల రాయితీ విడుదల కాగా, నిజామాబాద్ మండలాల్లో 1608 మందికి గాను రూ. 4కోట్ల 65 లక్షల రాయితీ విడుదల అవుతుంది. 34 వృత్తి పనిదారుల సహకార సంఘాలకుగాను రూ. 6 కోట్ల 49 లక్షల 15వేలు విడుదల అవుతాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1890 మంది ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా జిల్లాలో రాయితీని పొందనున్నారు. 2013 -14 సంవత్సరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను ఈ జీవోతో తిరిగి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బీసీ రాయితీ ఫైల్‌పై జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్‌రోస్ , బీసీ కార్పొరేషన్ అధికారి సత్యనారాయణ , నిజామాబాద్‌తో పాటు మూడు మున్సిపాలిటీ కమిషనర్ల సంతకాలు అయిపోయినప్పటికీ బ్యాంకుల నుంచి అకౌంట్లు తీసుకువస్తేనే రుణమంజూరు అంటూ మళ్లీ అధికారులు బీసీ లబ్దిదారులకు మెలికపెట్టారు. దీంతో రుణమంజూరు ఎంతకాలం పడుతుందోనని, ఆ తర్వాత మరెలాంటి ఉత్తర్వులు వస్తాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
ఎట్టకేలకు బీసీలకు రాయితీ!
ప్రగతినగర్ : గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఎంపిక చేసిన బీసీ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తూ జీఓ నెం 165 ను విడుదల చేసింది. స్వయం ఉపాధి పథకం కింద ఎంపికైన 1890 మందికి, వృత్తి పనిదారుల సహకార సంఘాలకు రాయితీ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల మార్చి వరకు లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాధ ఆదేశించారు. దీంతో జిల్లాలో ఎన్నో నెలలుగా రాయితీకోసం ఎదురుచూస్తున్న వెనుకబడిన తరగతుల వారికి మేలు జరుగనుంది. జిల్లాలో రాజీవ్ అభ్యుదయ యోజన కింద నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, మూడు మున్సిపాలిటీలలో 248 మందికిగాను రూ. 6 కోట్ల 86 లక్షలు, 1608 మంది గ్రామీణులకు గాను రూ. 4కోట్ల 65 లక్షలు రాయితీ విడుదల అవుతుంది. 34 వృత్తి పనిదారుల సహకార సంఘాలకుగాను రూ. 6 కోట్ల 49 లక్షల 15 వేల రాయితీ వస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1890 మంది ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ద్వారా సబ్సిడీ పొందనున్నారు. కాగా 2013 -14 ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ జీఓలో తిరిగి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. లబ్ధిదారులు తిరిగి తమ తమ బ్యాంకులకు వెళ్లి డ్యుయెల్ అకౌంట్‌ను (లోన్ అకౌంట్,జీరో బ్యాలెన్స్ అకౌంట్)సంబందిత శాఖలో అప్పగించాల్సిఉంటుంది. అనంతరం ఈ శాఖాధికారులు ముఖ్య కార్యాదర్శి ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితా, వివరాలను తిరిగి కొత్త డ్యుయెల్ నెంబర్‌తో కలిపి జిల్లా కలెక్టర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. పోరాట ఫలితంగానే : నరాల సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జనాభాలో 56 శాతంపైగా ఉన్నా బీసీల పొరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయితీని విడుదల చేసింది. ఉమ్మడి రాష్టంలో అయితే ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వంపై నమ్మకముంది : పొదిల శోభ, బీసీ మహిళ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు తెలంగాణ ప్రభుత్వంపై మాకు పూర్తిగా నమ్మకముంది. రాయితీ విడుదలలో జాప్యం వల్ల వేల మంది వెనుకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారులకు తిప్పలు తప్పలేదు. ఏది ఏమైన్పటికీ ప్రభుత్వం తీసుకున్నా నిర్ణయానికి బీసీల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే 2014-15 సంవత్సరంలో బీసీ లబ్ధిదారుల సంఖ్య , రాయితీ పెంచాలి. వెనుకబడిన తరగతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేయాలి.