మరింత జాప్యం | Further delay in Self-employment | Sakshi
Sakshi News home page

మరింత జాప్యం

Published Sun, Jan 18 2015 6:34 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

మరింత జాప్యం - Sakshi

మరింత జాప్యం

ప్రగతినగర్ : స్వయం ఉపాధికోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వ పెడుతున్న లేనిపోని కొర్రీలతో రుణమంజూరులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఎంపిక చేసిన బీసీ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట క ల్పిస్తూ జీఓ నెం 165 ను విడుదల చేసిన విషయ తెలిసిందే! స్వయం ఉపాధి పథకం కింద ఎంపికైన 1890 మందికి, వృత్తి పనిదారుల సహకార సంఘాలకు సైతం జీఓ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మార్చి వరకు లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాధ ఆదేశాలు జారీ చేశారు.  దీంతో జిల్లాలో ఎన్నో నెలలుగా రాయితీకోసం ఎదురుచూస్తున్న సుమారు 2 వేల మంది వెనుకబడిన తరగతుల వారికి కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.
 
అయితే  బీసీ రాయితీకి సంబంధించి పలు నిబంధనలు విధించడం లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తున్నారు. గతంలో తీసుకువచ్చిన బ్యాంకు రుణ అర్హత పత్రం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ నెంబర్లను తిరిగి మళ్లీ అదే బ్యాంకుల నుంచి తీసుకురావాలని  బీసీ లబ్ధిదారులకు అధికారులు చెబుతున్నారు. అలాగైతేనే రుణం మంజూరు చేస్తామంటున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గతంలో పనిచేసిన ఫీల్డ్ ఆఫీసర్లు, బ్యాంకు మేనేజర్లు అన్ని అర్హతలు చూచుకొని బీసీ లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే తాజాగా తిరిగి డూయల్ అకౌంట్ నెంబర్, బ్యాంకు రుణ అర్హత పత్రం తీసుకరావాలని అధికారులు నిబంధన విధించడంతో బీసీ లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. వివరాలకు జిల్లాలో రాజీవ్ అభ్యుదయ యోజన క్రింద నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, మూడు మున్సిపాలిటీలలో 248 మందికిగాను రూ. 6 కోట్ల 86 లక్షల రాయితీ విడుదల కాగా, నిజామాబాద్ మండలాల్లో 1608 మందికి గాను రూ. 4కోట్ల 65 లక్షల రాయితీ విడుదల అవుతుంది.

34 వృత్తి పనిదారుల సహకార సంఘాలకుగాను రూ. 6 కోట్ల 49 లక్షల 15వేలు విడుదల అవుతాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1890 మంది ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా జిల్లాలో రాయితీని పొందనున్నారు. 2013 -14 సంవత్సరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను ఈ జీవోతో తిరిగి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బీసీ రాయితీ ఫైల్‌పై జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్‌రోస్ , బీసీ కార్పొరేషన్ అధికారి సత్యనారాయణ , నిజామాబాద్‌తో పాటు మూడు మున్సిపాలిటీ కమిషనర్ల సంతకాలు అయిపోయినప్పటికీ బ్యాంకుల నుంచి అకౌంట్‌లు తీసుకువస్తేనే రుణమంజూరు అంటూ మళ్లీ అధికారులు బీసీ లబ్దిదారులకు మెలికపెట్టారు. దీంతో రుణమంజూరు ఎంతకాలం పడుతుందోనని, ఆ తర్వాత మరెలాంటి ఉత్తర్వులు వస్తాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement