bc voters
-
మున్సిపల్ రిజర్వేషన్లపైనే ..అందరి దృష్టి!
సాక్షి, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన వార్డుల పునర్విభజన, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల గణనతో పాటు వార్డు ఓటరు జాబితా ముసాయిదా సైతం పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందో అన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తాజా మాజీ కౌన్సిలర్లతోపాటు ఈసారి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న వారు సైతం అనుకూల రిజర్వేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నిలబడి సత్తా చాటాలని భావిస్తున్న ఆశావహులు తాము పోటీ చేద్దామనుకుంటున్న వార్డులు తమకు అనుకూల రిజర్వేషన్ వస్తుందా, లేక ఇతర సామాజిక వర్గాల వారీకి రిజర్వు అవుతుందా అన్న అంచనాల్లో మునిగిపోయారు. నల్లగొండ మున్సిపాలిటీ 40 వార్డుల నుంచి 48 వార్డులకు పెరిగింది. పట్టణంలో 1,24,117 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల సంఖ్య ప్రకారం వార్డు రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. 24 వార్డులు జనరల్..! నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నందున 24 వార్డులు జనరల్ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉన్నా రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని ఉన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో 24 వార్డులు మాత్రం వివిధ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయి. పట్టణంలో తక్కువ సంఖ్యలోనే దాదాపు 1400 వరకు గిరిజన ఓటర్లు ఉన్నందున వారికి ఒక వార్డు రిజర్వు కానుంది. 48 వార్డులలో 24 జనరల్, ఒకటి ఎస్టీలకు రిజర్వు కానుండగా ఇంకా 23 వార్డుల ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ 23 వార్డులలో 7 వార్డులు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన 16 వార్డులు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఎస్సీలకు 1 వార్డు పెరిగి 8 అయితే బీసీలకు 1 వార్డు తగ్గి 15 వార్డులు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, బీసీలకు కేటాయించే వార్డుల్లో ఒకటి అటు, ఇటు అయినా.. దాదాపు ఈ సంఖ్య ప్రకారమే వార్డుల రిజర్వేషన్ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన బీసీ ఓటర్లు 2014 మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి పట్టణంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ముస్లిం ఓటర్లను ఎక్కువ సంఖ్యలో బీసీ సామాజిక వర్గంలో కలపడంతోనే బీసీ ఓటర్లు ఎక్కువగా పెరిగాయని అంటున్నారు. దీంతో పట్టణంలో ఓసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల పెరిగిన ఓటర్ల ప్రకారం ప్రస్తుతం మున్సిపాలిటీలో సుమారుగా ఓసీ ఓటర్లు 27 వేలు, బీసీ ఓటర్లు 77,350, ఎస్సీ ఓటర్లు 18,750, ఎస్టీ ఓటర్లు 1450 మంది ఉన్నట్లు సమాచారం. -
కులాల లెక్క తేలింది..
సాక్షి, విశాఖపట్నం: స్థానిక ఎన్నికల నిర్వహణ కసరత్తు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తికాగా..తాజాగా కులాల వారీగా ఓటర్ల గణన కూడా కొలిక్కి వచ్చింది. కులాలవారీగా ఓటర్ల గణన పూర్తి కాగా బుధవారం అధికారికంగా ప్రకటిం చారు. ఇక రిజర్వేషన్ల ఖరారుపై విధివిధానాలు ప్రకటించడమే తరువాయి. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలవు తుంది. గత నెల 20వ తేదీన ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం గ్రామీణ జిల్లా పరిధిలోని పంచాయతీ ఓటర్లు 18,02,730 మంది ఉన్నట్టుగా లెక్క తేల్చారు. తుది జాబితా ప్రకారం 18,02,730 మంది ఓటర్లలో 9,17,654 మంది మహిళలు, 8,85,005 మంది పురుష ఓటర్లున్నారు. 2013లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే లక్షన్నర మంది ఓటర్లు పెరిగినట్టుగా తెలుస్తోంది. నాటి ఎన్నికల్లో 15,48,800మంది ఓటర్లున్నారు. వారిలో మహిళలు 7,86,745 మంది కాగా, పురుషులు 7,62,055 మంది ఉన్నారు. గతంలో ఓటర్లతో పోల్చుకుంటే ఈసారి 2,53,930 మంది ఓటర్లు పెరిగారు. గతంతో పోల్చుకుంటే పురుష ఓటర్లు 1,22,950 మంది పెరగగా, మహిళా ఓటర్లు 1,30,909 మంది పెరిగారు. 8.28లక్షలకు చేరిన బీసీ ఓటర్లు వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు కులాల వారీగా ఓటర్ల విభజనపై దాదాపు నెల రోజుల పాటు కసరత్తు చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో ఎస్టీలు 4,48,374 మంది ఉన్నట్టుగా లెక్క తేలింది. వీరిలో పురుషులు 2,18,251 మంది, మహిళలు 2,30,104మంది మహిళలు, ఇతరులు 19 మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 1,25,507 మంది ఉన్నట్టుగాలెక్క తేలగా, వారిలో పురుషులు 60,764, మహిళలు 64,741 మంది, ఇతరులు ఇద్దరుఉన్నారు.ఇక బీసీలు 8,28,128 మంది ఉండగా, వారిలో పురుషులు 4,09,800 మంది, మహిళలు 4,18,295 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు.ఇక ఇతర సామాజిక వర్గాలన్నీ కలిపి మరో 4,00,721 మంది ఉండగా, వారిలో పురుషులు 1,96,190 మంది, మహిళలు 2,04,514 మంది,ఇతరులు17మంది ఉన్నారు. భారీగా పెరిగిన ఎస్సీ, ఎస్టీ ఓటర్లు.. 2013 ఎన్నికల నాటికి ఎస్టీ ఓటర్లు 3,70,531మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,82, 277 మంది కాగా, 1,88, 254 మంది మహిళా ఓటర్లున్నారు. ఇక ఎస్సీ ఓటర్లు 1,.09,523 మంది ఉండగా, వారిలో పురుషులు 53,591 మంది, మహిళా ఓటర్లు 55932 మంది ఉన్నారు. ఇక బీసీ ఓటర్లు 6,83,693 మంది ఉండగా,వారిలో 3,37,945మంది పురుషులు కాగా, 3,45, 748 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. ఇతర సామాజిక వర్గాలవారు 3,85,053 మంది కాగా, పురుషులు 188242 మంది కాగా, మహిళా ఓటర్లు 196811 మంది ఉన్నారు. 2013 ఓటర్లతో పోలిస్తే ఈసారి 77,843 మంది ఎస్టీలు, 15,984 మంది ఎస్సీ ఓటర్లు పెరగ్గా బీసీ ఓటర్లు 1,34,435 మంది పెరిగారు. త్వరలో రిజర్వేషన్లపై విధివిధానాలు.. ఇక మిగిలింది రిజర్వేషన్ల ఖరారుపై విధివిధానాలు రావాడమే తరువాయి. ఆ వెంటనే షెడ్యూ ల్ విడుదలవడం, ఎన్నికల నిర్వహణ చకచకా సాగిపోతాయి. వారం పదిరోజుల్లోనే రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం విధివిధానాలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాభా దామాషా ప్రకారం చూస్తే జిల్లాలో ఆయా సామాజిక వర్గాల వారికి 58 శాతం మేర సీట్లు కేటాయించాల్సి ఉంది. ఏజెన్సీలోని 234 పంచా యతీలను పూర్తిగా ఎస్టీలకు కేటాయించినా, మైదాన ప్రాంతాల్లో మిగిలిన 681 పంచాయతీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున ఓటర్ల జాబితా మేరకు సీట్లు కేటాయించాలి. మళ్లీ ఆయా సామాజిక వర్గాల్లో సగం సీట్లు మహిళలకు ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా చూస్తే రిజర్వేషన్లు 58 శాతానికి మించిపోతున్నాయి. బీసీ రిజర్వేషన్లు కుదించకుండా రిజర్వేషన్ల ఖరారు సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ప్రమాణ స్వీకారం రోజునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధ్యమైంత త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లబోతున్నాం.. సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్ల ఖరారుపై వచ్చే వారం మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బీసీలను దగా చేశారు
సాక్షి, ప్రకాశం: ‘మాట్లాడితే చాలు.. మాది బీసీల పార్టీ అంటారు. వెనుకబడిన తరగతుల వారికి వెన్నుదన్నుగా ఉన్నామంటారు. బీసీల ఓట్లన్నీ మావేనంటారు. ఊకదంపుడు ఉపన్యాసాలు మినహా బీసీల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిందేమీ లేదు’ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు ధన్నారపు మస్తానరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీలను చంద్రబాబు ఏ విధంగా నయవంచనకు గురిచేశారో ఆయన వివరించారు. ‘మన రాష్ట్రంలో, జిల్లాలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. అలాంటి బీసీలను చంద్రబాబు దగా చేశారు. రాజకీయంగా పూర్తిగా అణగదొక్కారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని స్వయంగా సుప్రీంకోర్టుకు లేఖరాశారు. బీసీలు తెలివితక్కువ వారంటూ ఆయన రాసిన లేఖను బీసీ సామాజికవర్గానికి చెందిన జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ బయట పెట్టకుంటే చంద్రబాబును నమ్మి బీసీలు మరింత మోసపోయేవారు. బీసీల పట్ల ఆయనకున్న చులకన భావం గురించి సమాజానికి తెలిసేది కూడా కాదు. బీసీలకు చెందిన మత్స్యకారులు సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబును కలవగా, ‘తాటతీస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. నాయీబ్రాహ్మణులు వెళ్లి కలిస్తే.. ‘తోలుతీస్తా’ అని అన్నారు. ముదిరాజ్‌లు వెళ్లి కలిస్తే ‘అసలు రాష్ట్రంలో మీరెక్కడున్నారు’ అంటూ అవమానించారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలను నిర్వీర్యం చేయడం ద్వారా బీసీలే అత్యధికంగా నష్టపోయారు.. ఇలా చెప్పుకుంటూపోతే బీసీలకు చంద్రబాబు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు’ అని మస్తానరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంటర్వ్యూ విశేషాలు... సాక్షి : బీసీల పట్ల చంద్రబాబు వైఖరి ఏంటి..? మస్తానరావు : బీసీల పట్ల చంద్రబాబు చెప్పేది ఒకటి, లోలోపల చేసేది మరొకటి. బీసీలు తనకు అండగా ఉంటారని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు లేఖ రాశాడంటే, తన మనసులో బీసీల పట్ల ఎంతటి కుట్ర దాగి ఉందో బట్టబయలైంది. కొన్ని సంవత్సరాల పాటు అత్యున్నత న్యాయస్థానాల్లో బీసీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుది. ఆ విషయం బయటపడేటప్పటికే బీసీ న్యాయమూర్తులుగా వెళ్లాల్సిన వారికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. కొంతకాలం తర్వాత.. అది కూడా ఒక బీసీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ ఆ లేఖను బయట పెట్టిందాకా ఏ ఒక్కరికీ చంద్రబాబు కుట్ర తెలియలేదు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. సాక్షి : చంద్రబాబు పాలనలో వెనుకబడిన తరగతుల వారికి ఉన్నత విద్య అందిందా..? మస్తానరావు : ఎక్కడ అందింది..? రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలలు 80 శాతానికిపైగా ఆయన సామాజికవర్గానికి చెందిన వారివే. నారాయణ, చైతన్య, భాష్యంతో పాటు ఇంకా ఎన్నో కార్పొరేట్ కళాశాలలు ఆయన సామాజికవర్గానికి చెందిన వారివే. అందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులను రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుకోవచ్చని జీఓ ఇచ్చారు. దీంతో వారంతా అమాంతం ఫీజులు పెంచారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయడంతో బీసీలు ఆ ఫీజులు కట్టలేక ఉన్నత విద్య పొందలేకపోయారు. సాక్షి : ప్రస్తుతం బీసీల విద్య పరిస్థితి ఎలా ఉంది..? మస్తానరావు : 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పాఠశాల విద్యపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో 9,500 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిన మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబే. సర్కారు విద్యను నిర్వీర్యం చేశారు. ఎందుకంటే కార్పొరేట్ కళాశాలలకు ప్రయోజనం చేకూర్చడమే ఆయన లక్ష్యం. రాష్ట్రం విడిపోకముందు సమైక్యాంధ్రలో 18 గురుకుల కళాశాలలు ఉన్నాయి. విడిపోయిన తర్వాత కూడా అవే ఉన్నాయి. కొత్తగా ఒక్క కళాశాలను కూడా తీసుకొచ్చింది లేదు. కార్పొరేట్ కళాశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివలన బీసీలు, సంచార జాతుల వారు సర్కారు విద్యకు దూరమయ్యారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సన్నబియ్యంతో పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం రేషన్ బియ్యంతో పెడుతున్నారు. సాక్షి : ఆరోగ్యశ్రీ, 108 పథకాల అమలు ఏ విధంగా ఉంది..? మస్తానరావు : వైఎస్సార్ హయాంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సమీపంలోని వైద్యశాలలకు వెళ్లాలంటే 108కు ఫోన్ చేస్తే రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఫోన్ చేస్తే 108 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈలోగా ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్సార్ పాలనలో ఆరోగ్య శ్రీ పథకం వల్ల నిరుపేదలు రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్లు సైతం చేయించుకున్నారు. ఇప్పుడు వైద్యశాలకు వెళితే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని, ఉచిత వైద్యం లేదని చెప్పడంతో పేదలు అనారోగ్యంతో చావుకు చేరువవుతున్నారు. సాక్షి : వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ వల్ల బీసీలకు ప్రయోజనం చేకూరుతుందా..? మస్తానరావు : యువనేత అయినా బీసీల పట్ల చాలా ముందు చూపుతో వైఎస్ జగన్ వ్యవహరించారు. తన పాదయాత్ర సమయంలోనే బీసీ అధ్యయన కమిటీని పార్టీ తరఫున నియమించారు. అనేక బీసీ సామాజికవర్గాలకు చెందిన వారిని ఆ కమిటీలో సభ్యులుగా వేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏలూరులో బీసీ గర్జన ఏర్పాటు చేసి బీసీలకు తాను ఏం చేస్తాడో వెల్లడించారు. సాక్షి : బీసీ గర్జన వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరింది..? మస్తానరావు : బీసీ గర్జన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే.. వైఎస్సార్ సీపీకి ఒక ఎమ్మెల్సీకి అవకాశం వచ్చింది. ఆ ఒక్క స్థానాన్ని బీసీ సామాజికవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తియాదవ్కు ఇచ్చి తనకు బీసీల పట్ల ఉన్న అభిమానాన్ని జగన్ చాటుకున్నారు. సాక్షి : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ఏమైనా చేశారా..? మస్తానరావు : రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా బీసీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రతాంబూలం ఇచ్చారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఊహకు అందని విధంగా, ఎవరూ సాహసం చేయలేని విధంగా బీసీలకు 41 అసెంబ్లీ సీట్లు కేటాయించి బరిలో నిలిపారు. సామాన్యులైన ఏడుగురు బీసీలను పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీలో ఉంచారు. సాక్షి : బీసీల పట్ల చంద్రబాబు దురుసుగా ప్రవర్తించిన సందర్భాలేంటి..? మస్తానరావు : సమస్యలు చెప్పుకునేందుకు రాజధానికి సీఎంను కలిస్తే పళ్లు బిగపట్టి కళ్లు ఎర్రచేసి వేలు చూపిస్తూ తోలు తీస్తా.. తాట తీస్తా అని మాట్లాడారు. బీసీలేమైనా పశువులా.. తోలు తీయడానికి..? వీళ్లేమైనా జామాయిల్ కర్రా తాట తీయడానికి. ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగని పని. మత్స్యకారులు వెళ్లి వేట నిషేధ సమయంలో జీవనం దుర్భరంగా ఉందని, ఆ సమయంలో నెలకు రూ.10 వేలు కేటాయించాలని ప్రాధేయపడితే తోలు తీస్తానని బెదిరించాడు. ♦ నాయీబ్రాహ్మణులు రాజధానికి వెళ్లి బార్బర్ షాపులకు ఏటా రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలని, షాపునకు నెలకు 150 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని, దేవాలయ పాలకమండలి కమిటీల్లో తమ సామాజికవర్గానికి స్థానం కల్పించాలని అడిగితే తోలు తీస్తానని బెదిరించాడు. ♦ముదిరాజ్‌లు చాలా వెనుబడి ఉన్నామని, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరితే అసలు మీరెక్కడున్నారని గదిమాడు. వాళ్లను తీవ్రంగా అవమానపరిచి బయటకు గెట్టించేశాడు. బీసీలపై ఆయనకున్న భావన అది. -
బీసీ మంత్రం
జిల్లాలో ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రారంభ మయ్యాయి. అభ్యర్థులు రెండు నియోజకవర్గాల్లో అధికంగా ఉన్న బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమకు మద్దతిస్తే అండగా ఉంటామని ‘ప్రత్యేకంగా హామీలుస్తున్నారు. సగానికంటే ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, మెదక్: జిల్లాలో ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు కుల సమీకరణాలపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో గెలుపు, ఓటములను ప్రభావితం చేసే సామాజికవర్గాలను తమవైపు తిప్పకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపుకోసం కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ఓటర్లు ఎన్నికల్లో ప్రభావితం చేయనున్నారు. దీంతో కులాల వారిగా ఓటర్ల వివరాలు సేకరించి వారి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా బీసీ ఓటర్లపై అన్ని రాజకీయ పార్టీలు గురి పెట్టాయి. రెండు నియోజకవర్గాల్లో బీసీ ఓటర్ల శాతం ఎక్కువ. ఈ ఎన్నికల్లో వారు అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో బీసీ ఓట్లకు గాలం వేస్తున్నారు. ఎలాగైనా బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కుల సంఘాలతో అభ్యర్థులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తమ పార్టీకి ఎన్నికల్లో మద్దతు ఇస్తే కుల సంఘాలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు.. మెదక్ నియోజకవర్గంలో 1,93,141 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 80 వేలకుపైగా బీసీ ఓటర్లు ఉంటారని అంచనా. బీసీల్లో అత్యధికంగా ముదిరాజ్, గౌడ్, మున్నూరుకాపు, యాదవులు, పద్మశాలి, నాయిబ్రాహ్మణ, రజక కులాల ఓటర్లు ఉన్నారు. 12.5 శాతం మేర ముదిరాజ్‌లు, 8 శాతం మేర గౌడ్ కులస్తులు, మున్నూరు కాపు 5 శాతం ఉన్నారు. మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కుల సంఘాల పెద్దలతో ఇప్పటికే సమావేశం అవుతున్నారు. రామాయంపేట, చిన్నశంకరంపేట, హవేళిఘనపూర్ మండలాల్లోని బీసీ కుల సంఘాలతోనూ ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బుధవారం ఏడుపాయల్లో మెదక్ నియోజకవర్గంలోని గొల్ల, కుర్మ సంఘం నాయకులతో జెడ్పీచైర్‌పర్సన్ రాజమణిమురళీయాదవ్, టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ సమావేశంలో కోరారు. మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బీసీ నేత బట్టి జగపతి బీసీ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఆశావహులు శశిధర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, బాలకృష్ణ తదితరులు కూడా ఒక్కొక్కరు బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం అవుతున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి దూడ యాదేశ్వర్ సైతం గ్రామాల్లో పర్యటిస్తూ బీసీ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. ఇలా ఎవరికివారే బీసీలను తమవైపు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అండగా ఉంటాం.. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలోనూ బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువే. నియోజకవర్గంలో మొత్తం 1,99,465 ఓటర్లు ఉన్నారు. ఇక్కడా కూడా దాదాపుగా 80 వేల పై చిలుకు బీసీ ఓటర్లు ఉన్నారు. బీసీల్లో ప్రధానంగా ముదిరాజ్‌లు 20వేలు, యాదవులు 15వేలు, గౌడ కుల ఓటర్లు 10వేలు, పద్మాశాలీలు 7వేలు, నాయా బ్రాహ్మణులు 3వేలు, మున్నురు కాపు 3వేలకుపైగా ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీలో దిగనున్న సునీతారెడ్డి ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాలతో సమావేశమై తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బీసీ నేత మురళీయాదవ్ ద్వారా బీసీల ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని, ఎన్నికల్లో గెలిపిస్తే బీసీలకు మరింత న్యాయం చేస్తామని మదన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. టీఆర్ఎస్లోని బీసీ నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన హత్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని సునీతారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. -
పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీసీ ఓటర్ల జాబితాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీ ఓటర్ల గణాంకాలను తెలంగాణ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో తప్పుగా చూపుతోందని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.అసలు బీసీల ఓట్ల శాతం ఎంతో తేల్చేవరకు గ్రామపంచాయతీ ఎనికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని పిటిషనర్ కోరారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బీసీ కమిషన్‌తో సర్వే నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించాలే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తెలంగాణలో బీసీ ఓటర్ల లెక్క తేల్చేందుకు సమగ్ర సర్వే నిర్వహించి.. నివేదికను తమకు సమర్పించాలని బీసీ కమిషన్‌ను ఆదేశించింది. తెలంగాణ బీసీ కమిషన్ తన సర్వే నివేదికను ఇవ్వకముందే.. ఫైనాన్స్ కమిషన్ బీసీ నివేదికను ఎలా రూపొందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ యాక్ట్ లో బీసీ జనాభా 34శాతమని, శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో 37శాతమని, సకల జనుల సర్వే గణాంకాల్లో 54శాతమని పేర్కొన్నారని, ఈ మూడింటిలో ఏది నిజమని ప్రభుత్వం ప్రశ్నించింది. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్‌లో పొందుపరిచిన ప్రకారం బీసీ కమిషన్‌తో ఆ సామాజిక వర్గాల సమగ్ర జాబితా రూపొందించాలని ఆదేశించింది. బీసీ ఓటర్ల జాబితాను పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
'బాబు హామీలు నమ్మే వాళ్లంతా ఓటేశారు'
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నమ్మి బీసీలంతా ఓట్లేశారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. శంకరావు అన్నారు. నెల్లూరులోని ఓ కల్యాణమండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం బీసీలపై చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించి పొందుపరిచిన హామీలు నెరవేర్చటంలేదని మండిపడ్డారు. బీసీలంతా కలిసి టీడీపీకి ఓట్లేసినా ఇంత అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలు కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు. త్వరలో విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు శంక ర్రావు తెలిపారు.