సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీసీ ఓటర్ల జాబితాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీ ఓటర్ల గణాంకాలను తెలంగాణ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో తప్పుగా చూపుతోందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.అసలు బీసీల ఓట్ల శాతం ఎంతో తేల్చేవరకు గ్రామపంచాయతీ ఎనికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని పిటిషనర్ కోరారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బీసీ కమిషన్‌తో సర్వే నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించాలే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తెలంగాణలో బీసీ ఓటర్ల లెక్క తేల్చేందుకు సమగ్ర సర్వే నిర్వహించి.. నివేదికను తమకు సమర్పించాలని బీసీ కమిషన్‌ను ఆదేశించింది.
తెలంగాణ బీసీ కమిషన్ తన సర్వే నివేదికను ఇవ్వకముందే.. ఫైనాన్స్ కమిషన్ బీసీ నివేదికను ఎలా రూపొందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ యాక్ట్ లో బీసీ జనాభా 34శాతమని, శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో 37శాతమని, సకల జనుల సర్వే గణాంకాల్లో 54శాతమని పేర్కొన్నారని, ఈ మూడింటిలో ఏది నిజమని ప్రభుత్వం ప్రశ్నించింది. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్‌లో పొందుపరిచిన ప్రకారం బీసీ కమిషన్‌తో ఆ సామాజిక వర్గాల సమగ్ర జాబితా రూపొందించాలని ఆదేశించింది. బీసీ ఓటర్ల జాబితాను పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment