BC voters survey
-
పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీసీ ఓటర్ల జాబితాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీ ఓటర్ల గణాంకాలను తెలంగాణ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో తప్పుగా చూపుతోందని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.అసలు బీసీల ఓట్ల శాతం ఎంతో తేల్చేవరకు గ్రామపంచాయతీ ఎనికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని పిటిషనర్ కోరారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బీసీ కమిషన్‌తో సర్వే నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించాలే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తెలంగాణలో బీసీ ఓటర్ల లెక్క తేల్చేందుకు సమగ్ర సర్వే నిర్వహించి.. నివేదికను తమకు సమర్పించాలని బీసీ కమిషన్‌ను ఆదేశించింది. తెలంగాణ బీసీ కమిషన్ తన సర్వే నివేదికను ఇవ్వకముందే.. ఫైనాన్స్ కమిషన్ బీసీ నివేదికను ఎలా రూపొందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ యాక్ట్ లో బీసీ జనాభా 34శాతమని, శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో 37శాతమని, సకల జనుల సర్వే గణాంకాల్లో 54శాతమని పేర్కొన్నారని, ఈ మూడింటిలో ఏది నిజమని ప్రభుత్వం ప్రశ్నించింది. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్‌లో పొందుపరిచిన ప్రకారం బీసీ కమిషన్‌తో ఆ సామాజిక వర్గాల సమగ్ర జాబితా రూపొందించాలని ఆదేశించింది. బీసీ ఓటర్ల జాబితాను పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
బీసీ ఓటర్ల గణనకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన దృష్ట్యా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం ఓటర్ల సంఖ్యను నిర్ధారిస్తోంది. వార్డుల విభజనకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. పంచాయతీల్లోని ఆవాసాల వారీగా ఓట ర్ల సంఖ్యను గ్రామ కార్యదర్శులు లెక్కిస్తున్నారు. వివరాలు రాగానే పంచాయతీల్లోని మొత్తం ఓటర్ల ఆధారంగా వార్డుల వారీగా ఓటర్లను విభజిస్తారు. గ్రామ పంచాయతీల వారీగా బీసీ ఓటర్ల సంఖ్యను తెల్చే ప్రక్రియ 2 రోజుల్లో మొదలుకానుంది. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ 2018 మార్చి 24న ఓటర్ల జాబితాను రూపొందించింది. అసెంబ్లీ నియోజకవర్గా ల్లోని ఓటర్ల జాబితా ఆధారంగా కొత్త గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను వేరు చేస్తున్నా రు. కొత్త పంచాయతీల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతోంది. ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఇప్పటికే నమోదై ఉంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ ఓటర్లను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికీ వెళ్లి బీసీ ఓటర్లను గుర్తించనున్నారు. అనంతరం గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. నెల రోజుల్లో ఇది పూర్తవుతుందని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై 31లోగా ఎన్నికలు! రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని 313 ఆవాసాలను మున్సిపాలిటీల్లో చేర్చా రు. కొత్తగా 4,380 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. వాటితో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,741కి పెరిగింది. పంచాయతీల ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం జూలై 31 నాటికి పూర్తి కానుండగా.. అప్పటి నుంచి కొత్త పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. ఆ లోపు ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచాయ తీరాజ్ శాఖ ఆధ్వర్యంలో బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తుంది. నివేదిక అంది న తర్వాత 20 నుంచి 90 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అమల్లోకి కొత్త చట్టం: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత వర్తించే 9 అంశాలను మినహాయించి.. మిగిలిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పంచాయతీరాజ్ చట్టం–1994 ముగిసింది. కొత్త పాలక వర్గాలు వచ్చాక సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్‌పవర్ ఉంటుంది. అప్పటివరకు సర్పంచ్, గ్రామ కార్యద ర్శులకు సంయుక్తంగా చెక్‌పవర్ నిబంధన ఉంటుంది. ఆడిట్ పత్రాలు సమర్పించకపోతే సర్పంచ్‌ను, గ్రామ కార్యదర్శిని తొలగించే అంశాన్ని కొత్త పాలకవర్గం వచ్చే వరకు వాయిదా వేశారు. సర్పంచ్‌ను ఆరు నెలల చొప్పున రెండుసార్లు సస్పెండ్ చేసే అధికారాన్ని కలెక్టర్‌కు ఇచ్చే నిబంధన అమలు సైతం ఇప్పుడే వర్తించదని అధికారులు పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ ఓట్ల పునఃపరిశీలన
-
జీహెచ్ఎంసీ ఓట్ల పునఃపరిశీలన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితాలను పునః పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నగరంలో బీసీ ఓటర్లను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ చేస్తున్న ఇంటింటి సర్వే ఈనెల 18లోగా ముగియనుంది. పనిలో పనిగా ఈ సందర్భంగా తొలగించిన ఓట్లన్నీ పునఃపరిశీలన జరపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించింది. అకారణంగా లక్షలాది ఓట్లు గల్లంతైనట్లుగా వచ్చిన అభియోగాలు, వివిధ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే 14 మంది అధికారుల బృందంతో విచారణ జరిపించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ గుప్తా సారథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ఈ బృందం వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పలువురు ఓటర్లను ముఖాముఖి కలిసి నిజానిజాలు ఆరా తీసింది. ఈ సందర్భంగా వెల్లువెత్తిన ఫిర్యాదులతో.. భారీ సంఖ్యలోనే ఓట్లు గల్లంతైనట్లుగా ఈ బృందం గుర్తించింది. వీరిచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఓటర్ల పునఃపరిశీలనకు ఈసీ నిర్ణయించింది. తొలిగించిన ఓట్లన్నీ ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని.. వారిచ్చే అప్పీళ్లను స్వీకరించాలని ఆదేశించింది. ఈ సర్వే సందర్భంగా ఇంటింటికి వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)లకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను తొలిగించినట్లు గుర్తిస్తే.. తగిన ధ్రువీకరణ పత్రాలతో బీఎల్వోలకు అప్పీలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.